Jersey: Nani Praises Shahid Kapoor And Jersey Movie Team, Deets Here - Sakshi
Sakshi News home page

Nani-Shahid Kapoor: హిందీ జెర్సీ చూసి షాహిద్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాని

Published Fri, Apr 22 2022 3:22 PM | Last Updated on Fri, Apr 22 2022 4:34 PM

Nani Tweet About Hindi Jersey, Praises Shahid Kapoor And Movie Team - Sakshi

Nani Interesting Comments on Shahid Kapoor: బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ తాజాగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచిన హీరో స్టార్‌ నాని జెర్సీని హిందీలో షాహిద్‌ రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల అనంతరం ఈ రోజు(ఏప్రిల్‌ 22) థియేటర్లో విడుదలైంది. ఇందులో షాహిద్‌ పాత్రకు సినీ సెలబ్రెటీల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అలాగే ఈ సినిమా చూసిన నాని కూడా చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించాడు.

చదవండి: కన్నడ ప్రేక్షకులకు సారీ చెప్పిన నాని, అసలేం జరిగిందంటే..

హిందీ జెర్సీలో తన రోల్‌ పోషించిన షాహిద్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.ఈ మేరకు నాని ట్వీట్‌ చేస్తూ అర్జున్‌ పాత్రకు షాహిద్‌ పూర్తి న్యాయం చేశాడని పేర్కొన్నాడు. ‘జెర్సీ సినిమా చూశాను.  గౌత‌మ్ తిన్న‌నూరి ఈ సినిమాతో మ‌రోసారి హిట్ కొట్టేన‌ట్టే. షాహిద్‌క‌పూర్ అర్జున్ పాత్ర‌ను మ‌న‌స్సు పెట్టి చేశాడు. మృణాళ్ ఠాకూర్‌, పంక‌జ్ క‌పూర్ స‌ర్‌, మై బాయ్ రోనిత్ (చైల్డ్ యాక్ట‌ర్) కూడా చాలా బాగా చేశారు.. నిజ‌మైన మంచి సినిమా ఇది. చిత్ర‌యూనిట్‌కు నా శుభాకాంక్ష‌లు’ అంటూ నాని రాసుకొచ్చాడు.

చదవండి: జెర్సీ సినిమా భరించలేకున్నానంటూ కేఆర్‌కే రివ్యూ

ఇక నాని ట్వీట్‌కు షాహిద్‌ సమాధానం ఇచ్చాడు. ‘థాంక్యూ మై ఫ్రెండ్‌(అర్జున్‌ నుంచి మరోక అర్జున్‌). మీది చాలా పద్ద మనసు అందుకే జెర్సీకి ఈ స్థాయిలో రెస్పాన్స్‌ వచ్చింది. మోర్‌ పవర్‌ టూ యూ’ అంటూ రీట్వీట్‌ చేశాడు. కాగా ఇప్ప‌టివ‌ర‌కు స్క్రీనింగ్ అయిన షోల వ‌ర‌కు ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మంచి స్పంద‌న వస్తోంది. ఇందులో షాహిద్‌కు జోడిగా బాలీవుడ్‌ నటి మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. దిల్ రాజు, నాగ‌వంశీ, అమ‌న్ గిల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సాచెట్ అండ్ ప‌రంప‌ర మ్యూజిక్‌ అందించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement