తెలుగులో హిట్ అయిన సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేయడం కామన్. టాలీవుడ్ హిట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’తో షాహిద్ కపూర్ ఇటీవల భారీ హిట్ అందుకున్నారు. షాహిద్ గత చిత్రాల అత్యధిక వసూళ్లను సైతం ‘కబీర్‌సింగ్’ తొలి వారంలోనే దాటనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు తెలుగు చిత్రం ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటించనున్నారని బాలీవుడ్ టాక్.
నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ‘జెర్సీ’ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకూ అలరిస్తుందని ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ అనుకున్నారట. అందుకే ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారనే మాట వినిపిస్తోంది. తెలుగు ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే హిందీ రీమేక్ చేయనున్నారట.
Comments
Please login to add a commentAdd a comment