
నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రం హిందీలో రీమేక్ అయింది. తెలుగు చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేశారు. నాని పాత్రను షాహిద్ కపూర్ పోషించారు. కోవిడ్ వల్ల చాలా సినిమాల్లానే ఈ సినిమా చిత్రీకరణ కూడా ఆగిపోయింది. అయితే ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను ఉత్తరాఖండ్‌లో తిరిగి ప్రారంభించి, పూర్తి చేశారు. ఈ సినిమాలో క్రికెట్ ప్లేయర్‌గా కనిపించడానికి పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నారు షాహిద్. మృణాల్ థాకూర్ కథానాయికగా నటించారు. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment