మ్యాచ్‌కి డేట్‌ ఫిక్స్‌ | Shahid Kapoor Jersey to release on Diwali | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌కి డేట్‌ ఫిక్స్‌

Published Mon, Jan 18 2021 12:33 AM | Last Updated on Mon, Jan 18 2021 12:33 AM

Shahid Kapoor Jersey to release on Diwali - Sakshi

నాని హీరోగా శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. క్రికెట్‌ నేపథ్యంలో గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది ఏప్రిల్‌లో విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా షాహిద్‌ కపూర్‌ హీరోగా హిందీలో రీమేక్‌ అయింది. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటించారు. తెలుగు ‘జెర్సీ’ని డైరెక్ట్‌ చేసిన గౌతమ్‌ తిన్ననూరి హిందీలోనూ తెరకెక్కించారు.

నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో ‘దిల్‌’ రాజు, అమన్‌ గిల్, ఎస్‌. నాగవంశీ నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్‌ అయ్యింది. ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్‌ 5న ‘జెర్సీ’ సినిమాను విడుదల చేస్తున్నామని షాహిద్‌ కపూర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘‘ఫెంటాస్టిక్‌ ఎమోషనల్‌ స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బాలీవుడ్‌ ప్రేక్షకులనూ అలరిస్తుందనే నమ్మకం ఉంది. తెలుగులో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్‌ను షేక్‌ చెయ్యడం ఖాయం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement