అందుకే ‘జెర్సీ’లో నటించనని చెప్పా: రష్మిక వివరణ | Rashmika Mandanna Explains Why Did She Say No To Hindi Jersey | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: అందుకే జెర్సీ ఆఫర్‌ను వదులుకున్న, నావల్ల నిర్మాతలు..

Published Tue, Apr 26 2022 8:01 PM | Last Updated on Tue, Apr 26 2022 8:01 PM

Rashmika Mandanna Explains Why Did She Say No To Hindi Jersey  - Sakshi

Rashmika Mandanna Was 1st Choice For Shahid Jersey: బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ నటించిన జెర్సీ ఈ నెల 22న విడుదలై బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంటోంది. ఇందులో షాహిద్‌ నటకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నాడు. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో షాహిద్‌ ఎమోషనల్‌ సీన్స్‌ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటున్నాయి. తెలుగులో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించిన నేచులర్‌ స్టార్‌ నాని జెర్సీకి ఇది హిందీ రీమేక్‌ అనే విషయం తెలిసిందే.  దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి హిందీ ఇదే పేరుతో ఈ మూవీని రీమేక్‌ చేశాడు. ఇందులో షాహిద్‌ 40 ఏళ్ల వయసులో భారత జట్టులో స్థానం సంపాదించి కొడుకు కోరికను నెరవేర్చిన అర్జున్‌ తల్వార్‌ అనే తండ్రి పాత్రలో కనిపించాడు. 

చదవండి: నా తండ్రి గుర్తింపుతో బతకాలని లేదు: వేదాంత్‌ షాకింగ్‌ కామెంట్స్‌

ఈ క్రమంలో షాహిద్‌ పోషించిన భావోద్వేగ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయినప్పటికీ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో షాహిద్‌ భార్యగా బాలీవుడ్‌ నటి మృణాల్‌ ఠాకుర్‌ నటించింది. అయితే మొదట ఈ పాత్ర కోసం నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నాను సంప్రదించారట చిత్ర బృందం. అయితే తను ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై రష్మిక స్పందించింది. ఐఏఎన్‌ఎస్‌తో ముచ్చటించిన రష్మిక హిందీ జెర్సీ ఆఫర్‌పై నోరు విప్పింది. తనకు హిందీ జెర్సీ ఆఫర్‌ వచ్చిందని, కానీ దాన్ని తిరస్కరించానని తెలిపింది. 

చదవండి: షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌కు వెళ్లిన అనుపమకు షాకిచ్చిన ఫ్యాన్స్‌

‘ఎందుకంటే నేను ఇప్పటి వరకు చేసినవన్ని కమర్షియల్‌ సినిమాలే. అలాంటి నేను జెర్సీలాంటి చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది. జెర్సీ మంచి సినిమా కాదు అని నేను అనడం లేదు. ఇది రియలిస్టిక్‌ చిత్రం. జెర్సీ తెలుగు వెర్షన్‌లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్‌ అద్భుతంగా నటించారు. ఆ పాత్రకు తనకన్న గొప్పగా ఎవరూ నటించలేరని నా ఉద్దేశం. అందుకే ఈ పాత్రకు నేను కరెక్ట్‌ కాదని అనిపించింది. అనుకుంటే నేను ఈ సినిమాలో నటించేదాన్నే. కానీ నా వల్ల దర్శక-నిర్మాతలు నష్టపోకూడదనుకున్న. ఈ సినిమా కోసం వారికి నాకంటే బెటర్‌ ఆప్షన్స్‌ ఎన్నో ఉండోచ్చు కదా. అందుకే ఈ సినిమాకు నో చెప్పాను’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం రష్మిక తెలుగు పుష్ప 2తో పాటు హిందీలో యానిమల్‌ చిత్రాలతో బిజీగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement