బ్యాట్‌తో గ్రౌండ్‌లోకి దిగిన షాహిద్‌! | Shahid Kapoor Steps Into Ground With Cricket Bat For Remake Of Nanis Jersey | Sakshi
Sakshi News home page

బ్యాట్‌తో గ్రౌండ్‌లోకి దిగిన షాహిద్‌!

Published Fri, Nov 1 2019 1:46 PM | Last Updated on Fri, Nov 1 2019 2:27 PM

Shahid Kapoor Steps Into Ground With Cricket Bat For Remake Of Nanis Jersey - Sakshi

టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక‌్షన్ల వర్షం కురిపించిన ‘అర్జున్‌ రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’తో బీ- టౌన్‌ను షేక్‌ చేశాడు బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌. ఇక ఈ సక్సెస్‌తో జోరుమీద ఉన్న షాహిద్‌ మరో తెలుగు రీమేక్‌కు సిద్దమైపోయిన సంగతి తెలిసిందే. నేచురల్‌ స్టార్‌ నాని నటించిన ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో షాహిద్‌ నటిస్తున్నాడు.  ఇందుకోసం ఇప్పుడే బ్యాట్స్‌మెన్‌ అవతారం ఎత్తి ప్రాక్టీస్‌ కూడా మొదలు పెట్టేశాడు. కాగా ఈ ఎమోషనల్‌ స్పోర్ట్స్ డ్రామా రీమేక్‌తో షాహిద్‌ తొలిసారి తెరపై క్రికెటర్‌గా కనిపించనున్నాడు. ఇందుకోసం క్రికెట్‌ బ్యాట్‌తో గ్రౌండ్‌లోకి దిగిపోయాడు. షాహిద్‌ తాజా లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘ఇక తర్వాత 300 కోట్లకు పరుగులు’ అంటూ ఇప్పటి నుంచే సినిమా కలెక్షన్ల గురించి అంచనాలు పెంచేస్తున్నారు. కాగా మరికొందరు ‘తెలుగు సినిమాలు హిందీ హిట్లకు మార్గం సుగమం చేస్తున్నాయని, రీమేక్‌ల సక్సెస్‌కు కేరాఫ్‌ అయిన కండల వీరుడు సల్మాఖాన్‌ స్థానాన్ని షాహిద్‌ భర్తి చేసేలా ఉన్నాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


ఇక జెర్సీ రీమేక్‌ గురించి షాహిద్‌ మాట్లాడుతూ.. ‘కబీర్‌ సింగ్‌’ హిట్‌ తర్వాత నాకు కాస్త సమయం దొరికిందని, ఆ సమయంలో తాను జెర్సీ సినిమా చుశానని అది తనకు బాగా నచ్చిందని షాహిద్‌ అన్నాడు. కాగా ఒరిజనల్‌ వర్షన్‌ను రుపొందించిన గౌతమ్‌ తిన్ననూరి హిందీ ‘జెర్సీ’కి దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్‌ నిర్మాతలైన అల్లు అరవింద్‌, దిల్‌ రాజులు సంయుక్తంగా అమన్‌ గిల్‌తో కలిసి హిందీలో రీమేక్‌ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement