నేను లేనుగా.. ఎవరితో చేస్తారో చేసుకోండి: నాని | Actor Nani Reacts On Fans Demand Of Jersey Movie Sequel, Comments Goes Viral - Sakshi
Sakshi News home page

Nani On Jersey Sequel: హిట్ మూవీ సీక్వెల్‌పై రిక్వెస్ట్.. నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published Tue, Apr 23 2024 8:57 AM | Last Updated on Tue, Apr 23 2024 9:16 AM

Actor Nani Comments On Jersey Movie Sequel - Sakshi

ప్రస్తుతం అంతా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. 'పుష్ప 2', 'సలార్ 2'.. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడన్ని మూవీస్ లైన్‌లో ఉన్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలే కాదు మ్యాడ్ 2, ప్రేమలు 2 లాంటివి కూడా సెట్స్‌పైకి వెళ్లాయి. దీంతో ఆటోమేటిక్‌గా హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలకు కూడా సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అలాంటి రిక్వెస్ట్ హీరో నానికి ఎదురైంది. దీనికి అతడు ఇచ్చిన సమాధానం కూడా అంతే ఆసక్తికరంగా అనిపించింది.

(ఇదీ చదవండి: పెళ్లి న్యూస్‌తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్)

నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో బెస్ట్ మూవీ అంటే 'జెర్సీ' అని చెప్పొచ్చు. క్రికెట్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన ఈ చిత్రం ఎలాంటి కమర్షియల్ అంశాలు లేనప్పటికీ అద్భుతమైన హిట్‌గా నిలిచింది. ప్రేక్షకుల ముందుకొచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రాన్ని రీసెంట్‌గా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో రీ రిలీజ్ చేశారు. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది.

ఈ క్రమంలోనే 'జెర్సీ' మూవీకి సీక్వెల్ కావాలని నానికి అభిమానుల నుంచి రిక్వెస్ట్ వచ్చింది. తాజాగా 'ఆ ఒక్కటి అడక్కు' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న నానికి ఈ ప్రశ్న ఎదురైంది. దీంతో.. 'నేను లేనుగా, ఎవరితో చేస్తారో చేసుకోండి' అని నాని సమాధానమిచ్చాడు. నాని చెప్పిన దానిబట్టి చూస్తే 'జెర్సీ' సీక్వెల్ కష్టమే. ఎందుకంటే సినిమాలో నాని పాత్ర చనిపోతుంది. ఒకవేళ సీక్వెల్ తీయాలన్నా ఈ పాత్ర లేకుండా సాధ్యం అవుతుందా లేదా దర్శకుడికే తెలియాలి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ రెండు కాస్త స్పెషల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement