ఆ హీరోతో నా సినిమా అందుకే ఆగిపోయింది: దర్శకుడు శంకర్‌ | Director Shankar Gives Clarity On Why Anniyan Ranveer Remake Shelved, Deets Inside | Sakshi
Sakshi News home page

Director Shankar: ఆ హీరోతో నా సినిమా అందుకే ఆగిపోయింది

Published Wed, Jul 3 2024 8:01 AM | Last Updated on Wed, Jul 3 2024 10:28 AM

Director Shankar Clarity On Why Anniyan Ranveer Remake Shelved

భారత అగ్రదర్శకుల్లో ఒక్కరైన శంకర్‌ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు ఇండియన్‌-2 ఈ నెలలోనే రిలీజ్‌కు రెడీ అయ్యింది. ప్రస్తుతం ఆ చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారాయన.  మరోవైపు రామ్‌చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ నిర్మాణంలో ఉంది. దాదాపు షూటింగ్‌ పూర్తి కావొచ్చిన ఈ చిత్రం రిలీజ్‌ ఎప్పుడన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ రెండూ కాకుండా..

.. శంకర్‌ ఇండియన్‌ 3పైనా ఫోకస్‌ చేశాడు. తాను తర్వాత తీయబోయే చిత్రం అదేనని తాజాగానూ స్పష్టం చేశారాయన. దీంతో శంకర్‌ అప్‌కమింగ్‌ ప్రాజెక్టు ఇంకా ఏదైనా ఉందా? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో చాలా కాలం కిందట ఆయన డైరెక్షన్‌లో రావాల్సిన ఓ సినిమా.. ఇప్పుడు తెర మీదకు వచ్చింది. అదే ‘అన్నియన్‌’(అపరిచితుడు) రీమేక్‌.

బాలీవుడ్‌ క్రేజీ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా అన్నియన్‌ రీమేక్‌ చేయాలని శంకర్‌ భావించారు. ఇందు సంబంధించిన టెస్ట్‌ షూట్‌ చేసి.. ఆ ఫొటోలను సైతం రిలీజ్‌ చేశారు. అయితే ఎందుకనో ఆ ప్రాజెక్టు గురించి తర్వాత అప్‌డేట్‌ లేకుండా పోయింది. తాజాగా.. ఇండియన్‌ 2 ప్రమోషన్‌లో శంకర్‌ ఈ ప్రాజెక్టు గురించి స్పందించారు.

‘‘రణ్‌వీర్‌తో అన్నియన్‌ను హిందీలో రీమేక్‌ చేయాలని అనుకున్నాం. కానీ, ఆ తర్వాత మా ఆలోచనలన్నీ మారిపోయాయి. భారీ బడ్జెట్‌తో ఇతర భాషల్లో చిత్రాలు తీద్దామని, అది అన్నియన్‌ కంటే గొప్పగా ఉండాలని మా నిర్మాతలు నన్ను కోరారు. దీంతో ఆలోచనల్లో పడ్డాం. రణ్‌వీర్‌తో సినిమా ఉంటుంది. కానీ, అది అన్నియన్‌ రీమేక్‌ కాదు. అంతకు మించిన కథతో తప్పకుండా ఆయనతో సినిమా తీస్తా’’ అని శంకర్‌ ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement