Anniyan
-
ఆ హీరోతో నా సినిమా అందుకే ఆగిపోయింది: దర్శకుడు శంకర్
భారత అగ్రదర్శకుల్లో ఒక్కరైన శంకర్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు ఇండియన్-2 ఈ నెలలోనే రిలీజ్‌కు రెడీ అయ్యింది. ప్రస్తుతం ఆ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారాయన. మరోవైపు రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ నిర్మాణంలో ఉంది. దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ రెండూ కాకుండా.... శంకర్ ఇండియన్ 3పైనా ఫోకస్ చేశాడు. తాను తర్వాత తీయబోయే చిత్రం అదేనని తాజాగానూ స్పష్టం చేశారాయన. దీంతో శంకర్ అప్‌కమింగ్ ప్రాజెక్టు ఇంకా ఏదైనా ఉందా? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో చాలా కాలం కిందట ఆయన డైరెక్షన్లో రావాల్సిన ఓ సినిమా.. ఇప్పుడు తెర మీదకు వచ్చింది. అదే ‘అన్నియన్’(అపరిచితుడు) రీమేక్.He is a maverick and charismatic showman no one else can play!Welcome aboard, @RanveerOfficial Can't wait for this magnificent journey to begin mid 2022.⁰@jayantilalgada @PenMovies pic.twitter.com/LJueK4d8ra— Shankar Shanmugham (@shankarshanmugh) April 14, 2021బాలీవుడ్ క్రేజీ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా అన్నియన్ రీమేక్ చేయాలని శంకర్ భావించారు. ఇందు సంబంధించిన టెస్ట్ షూట్ చేసి.. ఆ ఫొటోలను సైతం రిలీజ్ చేశారు. అయితే ఎందుకనో ఆ ప్రాజెక్టు గురించి తర్వాత అప్డేట్ లేకుండా పోయింది. తాజాగా.. ఇండియన్ 2 ప్రమోషన్లో శంకర్ ఈ ప్రాజెక్టు గురించి స్పందించారు.He is a maverick and charismatic showman no one else can play!Welcome aboard, @RanveerOfficial Can't wait for this magnificent journey to begin mid 2022.⁰@jayantilalgada @PenMovies pic.twitter.com/LJueK4d8ra— Shankar Shanmugham (@shankarshanmugh) April 14, 2021‘‘రణ్వీర్తో అన్నియన్ను హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నాం. కానీ, ఆ తర్వాత మా ఆలోచనలన్నీ మారిపోయాయి. భారీ బడ్జెట్‌తో ఇతర భాషల్లో చిత్రాలు తీద్దామని, అది అన్నియన్ కంటే గొప్పగా ఉండాలని మా నిర్మాతలు నన్ను కోరారు. దీంతో ఆలోచనల్లో పడ్డాం. రణ్వీర్తో సినిమా ఉంటుంది. కానీ, అది అన్నియన్ రీమేక్ కాదు. అంతకు మించిన కథతో తప్పకుండా ఆయనతో సినిమా తీస్తా’’ అని శంకర్ ప్రకటించారు. -
'అలా అనకు చారీ.. నా మనసు బాధపడుతుంది'
లండన్: రవిచంద్రన్ అశ్విన్.. ఈ తరం అగ్రశ్రేణి స్పిన్నర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు. టీమిండియా తరపున ఆడుతున్న అశ్విన్ జట్టుకు ఎన్నో కీలక విజయాలు సాధించిపెట్టాడు. ఇటీవలే ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్.. అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో అశ్విన్ దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకూ 78 టెస్టుల్లో 409 వికెట్లు తీసిన అశ్విన్ కెరీర్లో మొత్తం 30సార్లు ఒక ఇన్నింగ్స్‌లో 5 కంటే ఎక్కువ వికెట్లు తీసి అత్యుత్తమ స్పిన్నర్‌గా నిలిచాడు. అయితే అశ్విన్ మంచి స్పిన్నరే కావచ్చు కానీ.. ఆల్‌టైమ్ గ్రేట్‌లో ఒకడు మాత్రం కాదని కామెంటేటర్ మంజ్రేకర్ ఒక ఇంటర్య్వూలో అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో రాణిస్తాడనే పేరున్న అశ్విన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికాలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడని పేర్కొన్నాడు. అందువల్ల అశ్విన్ ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపాడు. దీనికి సంబంధించి మంజ్రేకర్ ఆదివారం ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపాడు. మంజ్రేకర్ కామెంట్స్‌పై రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో పంచ్ ఇచ్చాడు. తమిళ బ్లాక్బాస్టర్ సినిమా అన్నియన్ (అపరిచితుడు)లోని ఓ డైలాగ్ మీమ్‌ను పోస్ట్ చేశాడు. 'అప్డి సొల్లాదా చారీ.. మనసెల్లమ్ వలికిర్దు (అలా అనకు చారీ.. నా మనసు బాధపడుతుంది) అనే డైలాగ్‌ను షేర్ చేశాడు. అశ్విన్ పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.కాగా అశ్విన్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు ఇప్పటికే టీమిండియాతో కలిసి ఇంగ్లండ్‌కు చేరుకొని క్వారంటైన్లో ఉన్నాడు. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్, భారత్‌ల మధ్య చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చదవండి: జాతి వివక్ష: మరో ఇంగ్లండ్ క్రికెటర్‌పై వేటు పడనుందా! అశ్విన్ ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్ అంటే ఒప్పుకోను.. 😂😂😂🤩🤩 https://t.co/PFJavMfdIE pic.twitter.com/RbWnO9wYti — Mask up and take your vaccine🙏🙏🇮🇳 (@ashwinravi99) June 7, 2021 -
వివాదం.. డైరెక్టర్ శంకర్ స్పందన కోసం చూస్తున్నాం
దర్శకుడు శంకర్‌ను చుట్టుముట్టిన వివాదాలు ఇప్పుడు తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్. ‘ఇండియన్ 2’ నిర్మాణం, ‘అన్నియన్’ రీమేక్ చిత్రాల విషయంలో ఆయన వివాదాలు ఎదుర్కొంటున్నారు. ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేయకుండా దర్శకుడు శంకర్ మరో సినిమాను డైరెక్ట్ చేయకూడదని మద్రాస్ హైకోర్టులో చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కేసు వేసిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ హీరోగా తన దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు శంకర్ ప్రకటించిన తర్వాత కోర్టుని ఆశ్రయించింది లైకా. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ 2’ సినిమా విషయంలో కోర్టు జోక్యంతో సానుకూలత ఏర్పడదని, రెండు పక్షాలవారు ఆలోచించుకుని ఓ సానుకూల నిర్ణయానికి రావాలని కేసుని విచారించిన కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ప్రముఖ తమిళ నటుడు వివేక్ హఠాన్మరణం కూడా ‘ఇండియన్ 2’ని ఇరుకుల్లో పడేసింది. ఆయన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఇంకా పూర్తి కాలేదు. సినిమా పూర్తి చేయాలంటే వివేక్ ఉన్న సీన్స్‌ను మళ్లీ మరో నటుడితో చిత్రీకరించాలని శంకర్ పేర్కొన్నారు. కాగా.. కమల్‌హాసన్‌తో ఓ సినిమాలో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలన్నది వివేక్ కల. ఆ కల పూర్తి స్థాయిలో నిజం కాకుండానే వివేక్ మరణించడం బాధాకరమని ఆయన ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. మరి.. ‘ఇండియన్ 2’, ‘అన్నియన్’ చిత్రాల వివాదాలకు ఎలా తెరపడనుందో చూడాలి. శంకర్ స్పందన కోసం చూస్తున్నాం! – సౌత్ ఇండియన్ ఫిలిమ్ ఛాంబర్ ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’) సినిమా రీమేక్ రైట్స్ గురించి ఈ చిత్రదర్శకుడు శంకర్, చిత్రనిర్మాత రవిచంద్రన్‌ల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రణ్వీర్ సింగ్ హీరోగా హిందీలో రీమేక్ చేయనున్నట్లు ఇటీవల శంకర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్రనిర్మాతగా ‘అన్నియన్’ రీమేక్ రైట్స్ తనవే అని ఆస్కార్ రవిచంద్రన్, దర్శకుడిగా రీమేక్ హక్కులు తనవేనని శంకర్ ఎవరికివారు బహిరంగ లేఖలను విడుదల చేశారు. తాజాగా శంకర్‌పై సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు నిర్మాత రవిచంద్రన్. ‘‘రవిచంద్రన్ మా సంస్థ సభ్యుడు. ‘అన్నియన్’ రీమేక్ రైట్స్ విషయంలో ఆయన శంకర్‌పై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మేం శంకర్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. మామూలుగా అయితే రీమేక్ రైట్స్ నిర్మాతలకే ఉంటాయి. ఒక నిర్మాత నిర్మించిన సినిమాను వేరే నిర్మాతతో రీమేక్ చేయాలన్నప్పుడు ఆ దర్శకుడు సదరు నిర్మాతకు కూడా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి కేసులు గతంలో కొన్ని ఉన్నాయి. కానీ ‘అన్నియన్’ సినిమా విడుదలై చాలా రోజులయింది కాబట్టి ఈ విషయంపై ప్రస్తుతం నేనేం కామెంట్ చేయలేను’’ అని సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌కి చెందిన రవి కొట్టాక్కర పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో నటుడి మృతి
తమిళ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన సెల్వకుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. శుక్రవారం రాత్రి ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ఆయన బైక్ బ్రేక్ వైర్ తెగిపోవటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సెల్వకుమార్ అక్కడికక్కడే మరణించగా ఆయనతోపాటు ప్రయాణిస్తున్న మరో నటుడు కోవై సెంథిల్ గాయాలతో బయటపడ్డారు. అనియన్, రమణ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సెల్వకుమార్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.