
రోడ్డు ప్రమాదంలో నటుడి మృతి
తమిళ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన సెల్వకుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. శుక్రవారం రాత్రి ఓ ప్రైవేట్ ఫంక్షన్కు వెళ్లి వస్తుండగా ఆయన బైక్ బ్రేక్ వైర్ తెగిపోవటంతో ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో సెల్వకుమార్ అక్కడికక్కడే మరణించగా ఆయనతోపాటు ప్రయాణిస్తున్న మరో నటుడు కోవై సెంథిల్ గాయాలతో బయటపడ్డారు. అనియన్, రమణ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సెల్వకుమార్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.