
కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
గుంటూరు జిల్లాలో ఘటన
చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామ శివారులో మహిళా కూలీలతో వెళుతున్న ఆటోను సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సుద్దపల్లి గ్రామానికి చెందిన 12 మంది మహిళా కూలీలు మినుము కోత కోసేందుకు నీరుకొండ ప్రాంతానికి ఆటోలో బయలుదేరారు.
మార్గమధ్యంలోని నారాకోడూరు గ్రామ శివారులో దట్టమైన పొగుమంచు కారణంగా ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్ కూలీల ఆటోను వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో తోట సీతారావమ్మ (41), అల్లం శెట్టి అరుణ (39), కుర్రా నాంచారమ్మ (40) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆటో డ్రైవర్ ఇబ్రహీంకు, మరో ఎనిమిది మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల్లో చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment