Selvakumar
-
వడ్డీ మాఫియాలపై చిత్రం!
తమిళసినిమా: పులి చిత్ర నిర్మాత పీటీ.సెల్వకుమార్ చేతికి పొదునలన్‌కరుది చేరింది. ఇంతకుముందు ఇరుంబుతిరై వంటి విజయవంతమైన చిత్రాన్ని విడుదల చేసిన పీటీ.సెల్వకుమార్ తాజాగా ఈ పొదునలన్‌కరుది చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా ఈ నెల 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన చిత్రం గురించి తెలుపుతూ తమిళనాడులో లెక్కలు తెలియకుండా, ఎవరూ పట్టించుకోని విధంగా కందువడ్డీ వృత్తి ఎలా సాగుతోంది? సాధారణ ప్రజలు దానికి ఎలా బలైపోతున్నారు? అని చెప్పే చిత్రంగా పొదునలన్‌కరుది ఉంటుందన్నారు. రూ.5 వేలకు ఆశపడి రూ.50 వేల వరకూ తిరిగి చెల్లించే పేద, మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొనే సమస్యలను నవ దర్శకుడు సీయోన్ కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించారని అన్నారు. ఆ మధ్య నెల్లైలో కందువడ్డీ బారిన పడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని, అదేవిధంగా కుమారుడి చదువు కోసం వడ్డీకి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేక తిరుచ్చికి చెందిన ఒక రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడని అన్నారు. ఇలాంటి సంఘటనలను ఆవిష్కరించే చిత్రంగా పొదునలన్‌కరుది చిత్రం ఉంటుందని చెప్పారు. అలా వడ్డీ మాఫియా అమాయకులను మానసికంగా ఎలా బాధిస్తున్నారన్నది కొత్త కోణంలో అవిష్కరించిన చిత్రం పొదునలన్‌కరుది అని చెప్పారు. నటుడు కరుణాకరన్, సంతోష్, అరుణ్‌ఆదిత్, యోగ్‌జాపీ, ఇయాన్‌అన్నాచ్చి, ముత్తురాం ప్రధాన పాత్రలను పోషించిన ఇందులో నటి అను సితార, సుభిక్ష, లీసా ముగ్గురు హీరోయిన్లు నటించారని చెప్పారు. అన్భువేల్‌రాజన్ నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కర కార్యక్రమాన్ని సోమవారం చెన్నైలో నిర్వహించనున్నారు. చిత్రాన్ని ఈ నెల 7న విడుదల చేయనున్నారు. -
ఇళయరాజాపై హైకోర్టులో కేసు
పెరంబూరు(చెన్నై): సంగీత జ్ఞాని ఇళయరాజాకు వ్యతిరేకంగా చిత్ర నిర్మాతలు చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశారు. సంగీత దర్శకుడు ఇళయరాజా తన పాటలను అనుమతి లేకుండా ఏ వేదికపైనా పాడరాదని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అంతేకాదు, గత ఐదేళ్లుగా తన పాటలకు రాయల్టీని వసూలు చేస్తున్నారు. ఈ విధానానికి చెక్‌పెట్టేలా ‘పులి’ చిత్ర నిర్మాత పీటీ సెల్వకుమార్, అన్బుసెల్వన్, జపజోన్స్, మీరాకధిరవన్, మణికంఠన్, చంద్రశేఖర్ తదితర నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పీటీ సెల్వకుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తాను సంగీతాన్ని అందించిన పాటలపై తనకే హక్కంటూ వాటిపై ఇళయరాజానే రాయల్టీ పొందడం చట్ట విరుద్ధమన్నారు. పాటల రాయల్టీలో చిత్ర నిర్మాతకు కనీసం 50 శాతం చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ పిటిషన్ వేశామన్నారు. -
మహిళను కాలుతో తన్నిన సెల్వకుమార్
-
మహిళ అని కూడా చూడకుండా కార్పొరేటర్ ఘాతుకం
-
కార్పొరేటర్ ఘాతుకం
సాక్షి, చెన్నై : ప్రజల మంచి చెడులు చూడాల్సిన ఓ రాజకీయనాయకుడు, మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా దాడికి దిగాడు. తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. సీసీటీవీ కెమెరాలో రికార్డైన దాడి దృశ్యాలు సామాజికమాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. డీఎంకే కార్పొరేటర్ సెల్వకుమార్‌కు బ్యూటీపార్లర్ యజమాని సత్యకు మధ్య మే25న తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన సెల్వకుమార్ ఆమెను దూషిస్తూ తీవ్రంగా కొట్టాడు. పక్కనే ఉన్న మహిళలు ఎంత ఆపడానికి ప్రయత్నించినా ఆగకుండా కిందపడేసి కాలుతో ఇష్టానుసారంగా తన్నాడు. వీడియో ఆధారంగా సెల్వకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎంకే పార్టీ అధినాయకత్వం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. -
కామెడీ 72... జీఎస్టీ 28 శాతం!
రజనీకాంత్ పుట్టిన తేదీ 12–12–1950. ఫ్యాన్స్ ఆయన బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తుంటారు. సెల్వ అనే అభిమాని ఏకంగా ‘12–12–1950’ టైటిల్‌తో ఓ సినిమా తీస్తున్నారు. కబాలి అనే పాత్ర చేయడంతో పాటు ఆయనే ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. జ్యోస్టార్ ఎంట్రప్రైజెస్ పతాకంపై ఎమ్.కోటేశ్వరరాజు నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. త్వరలో టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ‘‘72 శాతం కామెడీ, 28 శాతం జీఎస్టీ (గ్యాంగ్‌స్టర్, సెంటిమెంట్ మరియు థ్రిల్లర్)తో ఆసక్తికరంగా ఉంటుందీ సినిమా’’ అన్నారు సెల్వ. ఇందులో రమేష్ తిలక్, తంబీ రామయ్య, యోగిబాబు, ఎం.ఎస్. భాస్కర్, జాన్ విజయ్ ముఖ్య పాత్రలు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో నటుడి మృతి
తమిళ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన సెల్వకుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. శుక్రవారం రాత్రి ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ఆయన బైక్ బ్రేక్ వైర్ తెగిపోవటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సెల్వకుమార్ అక్కడికక్కడే మరణించగా ఆయనతోపాటు ప్రయాణిస్తున్న మరో నటుడు కోవై సెంథిల్ గాయాలతో బయటపడ్డారు. అనియన్, రమణ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సెల్వకుమార్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.