కామెడీ 72... జీఎస్‌టీ 28 శాతం!
రజనీకాంత్ పుట్టిన తేదీ 12–12–1950. ఫ్యాన్స్ ఆయన బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తుంటారు. సెల్వ అనే అభిమాని ఏకంగా ‘12–12–1950’ టైటిల్‌తో ఓ సినిమా తీస్తున్నారు. కబాలి అనే పాత్ర చేయడంతో పాటు ఆయనే ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.
జ్యోస్టార్ ఎంట్రప్రైజెస్ పతాకంపై ఎమ్.కోటేశ్వరరాజు నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. త్వరలో టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ‘‘72 శాతం కామెడీ, 28 శాతం జీఎస్‌టీ (గ్యాంగ్‌స్టర్, సెంటిమెంట్ మరియు థ్రిల్లర్)తో ఆసక్తికరంగా ఉంటుందీ సినిమా’’ అన్నారు సెల్వ. ఇందులో రమేష్ తిలక్, తంబీ రామయ్య, యోగిబాబు, ఎం.ఎస్. భాస్కర్, జాన్ విజయ్ ముఖ్య పాత్రలు చేశారు.