మిమ్మల్ని భయపెట్టిన సంఘటనలున్నాయా! | NVNN Movie Contest Share Your Scary Experiences | Sakshi
Sakshi News home page

మిమ్మల్ని భయపెట్టిన సంఘటనలున్నాయా!

Published Sat, Jul 6 2019 11:53 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

NVNN Movie Contest Share Your Scary Experiences - Sakshi

సినిమా ప్రమోషన్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. త్వరలో రిలీజ్ రెడీ అవుతున్న సందీప్‌ కిషన్‌ సినిమా నిను వీడని నీడను నేనే. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో హారర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్‌.

మీ జీవితంలో మీకు ఎదురైన భయానక సంఘటనలను సెల్పీ వీడియో రూపంలో పంపాలని కోరారు. అలా పంపిన వారిలో కొందరికి నిను వీడని నీడను నేను సినిమా ప్రీమియర్‌ షో టికెట్స్‌తో పాటు చిత్ర యూనిట్‌ను కలిసే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. జూలై 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమాను వెంక‌టాద్రి టాకీస్‌,  విస్తా డ్రీమ్ మ‌ర్చంట్స్ ప‌తాకాల‌పై  ద‌యా ప‌న్నెం, వి.జి.సుబ్రహ్మణ్యన్‌ నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు కార్తీక్ రాజు ద‌ర్శకుడు. తమన్‌ సంగీతమందిస్తుండగా అన్య సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement