భయానికి మించి.. నిను వీడని నీడను నేనే | Sudeep Kishan Ninu Veedani Needanu Nene Movie Trailer | Sakshi
Sakshi News home page

భయానికి మించి.. నిను వీడని నీడను నేనే

Published Sun, Jun 30 2019 12:45 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

Sudeep Kishan Ninu Veedani Needanu Nene Movie Trailer - Sakshi

మ‌నిషి శ‌త్రువుతో యుద్ధం చేస్తే గెలుస్తాడు.. కానీ త‌న నీడ‌తోనే యుద్ధం చేయాల్సి వ‌స్తే.. ఎలా ఉంటుంది. అలాంటి విప‌త్కర పరిస్థితులను ఎదుర్కొన్న ఓ యువ‌కుడు ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు. ఎలా స‌క్సెస్ అయ్యాడు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతున్న సినిమా ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’. ఎమోషనల్‌ హర్రర్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్నాడు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. ట్రైలర్‌ లోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్‌ ఇచ్చారు చిత్రయూనిట్. సందీప్‌ కిషన్‌ అద్ధంలో చూసుకుంటే ప్రతిబింబంలో వెన్నెల కిశోర్‌ కనిపిస్తాడు. అలా కనిపించడానికి కారణం ఏంటి. ట్రైలర్‌లో కనిపించే ఆ భయానక రూపాలేంటి అన్నది ఆసక్తికరంగా మారింది. జూలై 12న సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమాను వెంక‌టాద్రి టాకీస్‌,  విస్తా డ్రీమ్ మ‌ర్చంట్స్ ప‌తాకాల‌పై  ద‌యా ప‌న్నెం, వి.జి.సుబ్రహ్మణ్యన్‌ నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు కార్తీక్ రాజు ద‌ర్శకుడు. తమన్‌ సంగీతమందిస్తుండగా అన్య సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement