
సాధారణంగా యాక్టర్స్ డైరెక్టర్స్‌గా మారడం ఇండస్ట్రీలో కొత్తేం కాదు. కానీ అప్పుడప్పుడు డైరెక్టర్స్ యాక్టర్స్‌గా మారతారు. ఇప్పుడు ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం’ చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ ‘నిను వీడని నీడను నేనే’ అనే చిత్రంతో యాక్టర్‌గా మారారు. ఇందులో సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్నారు.
నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు ఆయన. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. 2015లో సందీప్‌కిషన్ హీరోగా వచ్చిన ‘టైగర్’ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక దర్శకుడి వీఐ ఆనంద్ ‘డిస్కోరాజా’ అనే చిత్రం తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ హీరో. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment