
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన తాజా చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం (జూలై 12న) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాను ఫస్ట్ టికెట్ ను యంగ్ రెబల్ స్టార్, 'బాహుబలి' ప్రభాస్ లాంచ్ చేశారు.
ప్రచార చిత్రాలు చూశానని, ఈ చిత్రంతో సందీప్ కిషన్ మంచి విజయం అందుకుంటాడని ఆశిస్తున్నానని ఆయన ఆకాంక్షించారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘ప్రభాస్ అన్న అందరి మంచి కోరే వ్యక్తి. మంచి సినిమాలకు ఎప్పుడూ ఆయన అండగా నిలబడతారు. మేం అడగ్గానే మా ఆహ్వానాన్ని మన్నించి 'నిను వీడని నీడను నేనే' ఫస్ట్ టికెట్ లాంచ్ చేశారు. ప్రభాస్ అన్నకు చాలా చాలా థాంక్స్. కొన్ని గంటల్లో సినిమా విడుదలవుతోంది. ఇదొక న్యూ ఏజ్ హారర్ ఫిల్మ్. ప్రేక్షకులకు కొత్త సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. అందరికీ మంచి సినిమా చూపించాలనే ఉద్దేశంతో తీసిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’ అని అన్నారు. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, ప్రగతి తదితరులు నటించారు.
Comments
Please login to add a commentAdd a comment