నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ హీరోగా సక్సెస్ వేటలో వెనుకపడుతున్నాడు. కెరీర్‌లో ఒక్క వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేకపోవటంతో తన కెరీర్‌ను గాడిలో పెట్టే బాద్యతను తానే తీసుకున్నాడు. అందుకే స్వయంగా నిర్మాతగా మారి తెలుగు, తమిళ భాషల్లో ‘నిను వీడని నీడను నేనే’ చిత్రాన్ని నిర్మించాడు.