
బీజింగ్: ఒంటరిగా వచ్చే కుర్రాళ్ల కోసం చైనాలోని ఓ షాపింగ్ మాల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 10కే గర్ల్‌ఫ్రెండ్స్‌ని అద్దెకు పంపుతామంటోంది. దీంతో ఆ షాపింగ్ మాల్‌కు ఒక్కసారిగా యువకుల తాకిడి పెరిగిపోయింది. షాపింగ్‌కు వెళ్లే యువకులు అమ్మాయి తోడుగా ఉంటే బాగుండు అని ఫీలవుతుంటారు. ఇలాంటి ఆసక్తిని పసిగట్టిన సదరు షాపింగ్ మాల్ ఒంటరిగా వచ్చే యువకుల కోసం ఈ ఆఫర్‌ను ప్రకటించింది. మాల్‌లోకి వెళ్లేముందు 20 నిమిషాలకు రూ. 10 అద్దె చెల్లించి పోడియం వద్దనున్న అమ్మాయిలను తోడుగా తీసుకెళ్లొచ్చు.
సమయం దాటితే మాత్రం మనతో వచ్చిన యువతులు వెంటనే పోడియం వద్దకు వచ్చేస్తారు. మనతో ఉన్న సమయంలో ఆ యువతులు షాపింగ్‌లో ఏవైనా అనుమానాలు వస్తే సాయం చేస్తారు. తోడుగా ఉండటం మాత్రమే కాకుండా షాపింగ్ బ్యాగ్స్ పట్టుకోవడం, పిల్లల్ని ఎత్తుకోవడం వంటి పనులు కూడా చేస్తారు. షాపింగ్ మాల్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. లంచ్, డేటింగ్ కోసం కూడా కస్టమర్లు గర్ల్‌ఫ్రెండ్స్‌ను తీసుకెళ్లొచ్చు. అందుకోసం రెండు నిబంధనలు పెట్టారు. గర్ల్‌ఫ్రెండ్‌గా తీసుకెళ్లినవారిని ముట్టుకోకూడదు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంగణం దాటి ఎక్కడికీ తీసుకెళ్లకూడదంటూ నిబంధనలు కూడా ఉన్నాయి. అన్నీ బానే ఉన్నా షాపింగ్ మాల్ కండిషన్స్ మాత్రం కొందరు యువకుల్ని నిరాశకు గురిచేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment