బీజింగ్: చైనా మరోసారి సోషల్ మీడియాలో నిలిచింది. ఇప్పటికే ఎన్నోసార్లు వివిధ ఆవిష‍్కరణలు, ప్రపంచాన్ని భయపెడుతూ వార్తల్లో నిలిచిన చైనా.. ఈసారి మాత్రం కొంచెం వైరెటీ పని చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా..
భార‍్యలతో షాపింగ్‌కు వెళ్లే భర్తల కోసం చైనీయులు ట్రెండీగా ఆలోచించారు. భార్యలు గంటల కొద్దీ సమయం షాపింగ్ కోసం కేటాయిస్తారాన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో భర్తలు అసహనానికి గురికాకుండా, వారికి బోర్ కొట్టకుండా ఉండేందుకు చైనా ఓ పరిష్కారాన్ని కనుగొంది. షాపింగ్ చేసే భార్యలకు దూరంగా ఉండేందుకు షాంఘైలోని గ్లోబల్ హార‍్బర్ మాల్‌లో 'husband storage' పాడ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పాడ్స్‌లో ఓ వ్యక్తి కూర్చునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసింది.
కస్టమర్లు ఆ పాడ్స్‌లో కుర్చొన్న సమయంలో వారు వైరే లోకంలో ఉన్నారనే అనుభూతిని కలిగించేందుకు వారికి బోర్ కొట్టకుండా ఉండేందుకు స్పెషల్ అరేంజ్‌మెంట్స్ చేసింది. గేమ్స్ ఆడుకునేందుకు వీలుగా మానిటర్, గేమ్ ప్యాడ్స్‌ను, కనీస అవసరాలను ఏర్పాటు చేసింది. అయితే, ప్రస్తుతానికి వినియోగదారులకు పాడ్స్‌లో ఉచితంగా గేమ్స్ ఆడుకునేందుకు అవకాశం కల్పించారు. రానున్న రోజుల్లో కస్టమర్లు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని షాపింగ్ మాల్స్ యజమానులు చెబుతున్నారు. కాగా, ఈ పాడ్స్‌లో సమయంగా గడిపిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. పాడ్స్‌లో గేమ్స్ ఆడటం ఎంతో కొత్తగా ఉందన్నారు. ఆహ‍్లదాన్ని అందించినట్టు తెలిపారు. దీంతో పాడ్స్ ఏర్పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment