trending in social media
-
మెడలో తాళిబొట్టు.. మోడ్రన్ డ్రెస్‌లో కీర్తి సురేష్ ట్రెండింగ్ (ఫోటోలు)
-
టిక్ టాక్ బామ్మ.. వయసు 78.. ఫాలోవర్లు 23 వేలు
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ ట్రెండింగ్ డ్యాన్స్ ఇరగదీస్తున్న విజయలక్ష్మి బంజారాహిల్స్: ఆమె భామ కాదు.. బామ్మ.. స్టేజీ ఎక్కి డ్యాన్స్ మొదలెట్టిందంటే చాలు.. కుర్రకారు ఈలలు, గోలలు.. ఆమె డ్యాన్స్ చూస్తే పెద్దవాళ్లు ఐనా సరే ముక్కున వేలు వేసుకోవాల్సిందే.. ఆమె వేసే స్టెప్పులకు కురీ్చల్లో నుంచి అమాంతం లేసి చప్పట్లు చరవాల్సిందే.. ఇంతకూ ఆ బామ్మ వయసు ఎంతో తెలుసా..! సరిగ్గా 78 ఏళ్లు.. ఆమెకు ఇన్‌స్టాలో దాదాపు 23 వేల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. టిక్ టాక్ భామ్మగా పిలుచుకునే ఆమె పేరు విజయలక్ష్మి. పదేళ్ల పాటు హోంగార్డుగా.. బాలానగర్‌కు చెందిన విజయలక్ష్మి పదేళ్లపాటు హోంగార్డుగా పనిచేసింది. బాలనగర్, కూకట్పల్లి, చందానగర్, జీడిమెట్ల, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసింది. మనువడు ఫోన్ చూసే క్రమంలో ఆమె టిక్ టాక్‌లో తనకు ఒక ఖాతాను ఏర్పాటు చేసుకుంది. డ్యాన్స్ చేయడం, నటులను అనుకరించడం, డైలాగ్‌లకు అనుగుణంగా నటించడం ప్రారంభించింది. ఇంకేముంది ఆమెను ఫాలో చేసే వారి సంఖ్య 12 లక్షలకు చేరింది. దీంతో టిక్ టాక్ బామ్మగా ఆమెకు ఎక్కడలేని గుర్తింపు వచి్చంది. అదే సమయంలో టిక్‌టాక్ నిషేధించడంతో టికి అనే మరో యాప్‌లోకి వెళ్లింది. అందులోనూ దాదాపు 2.5 లక్షల మంది ఫాలోవర్లు వచ్చి చేరారు. అది కూడా బ్యాన్ కావడంతో బామ్మ తాజాగా ఇన్‌స్టా వైపు మళ్లింది.యూత్ ఫిదా.. తన ఇద్దరు కుమారులకు దూరమై ఒంటరిగా ఉన్న విజయలక్ష్మి అక్కడక్కడ నృత్య కార్యక్రమాలకు హాజరయ్యేది. ఈ క్రమంలోనే సినీనటి కరాటే కళ్యాణితో పరిచయం ఏర్పడి నాలుగేళ్లుగా ఆమెతోనే ఉంటోంది. బామ్మ నృత్యాలకు నెటిజన్లు అంతా ఫిదా అవుతున్నారు. ఇన్‌స్టాలో ఇప్పటికే దాదాపు 3300 డ్యాన్స్ వీడియోలను పోస్టు చేసింది. ఇటీవల ఆమె వినాయకుడి మండపం వద్ద వేసిన డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. క్లాస్ అయినా, మాస్ అయినా పాట ఏది వచి్చనా ఆమె స్టెప్పులను ఎవరూ ఆపలేరు. యువతతో కలిసి డ్యాన్స్ చేయడానికి బామ్మనే పోటీపడుతుంది. ఈ వయసులోనూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా డ్యాన్స్ చేసే ఆ బామ్మ ప్రతిరోజు యోగ చేస్తుంది. మితమైన, పోషకాహారం తీసుకుంటానని, అదే తన ఆరోగ్య రహస్యమని చెబుతోంది.సినిమాల్లోకి.. ప్రస్తుతం బామ్మ సినిమాల వైపు అడుగులు వేసింది. విడుదలకు సిద్ధమైన ‘ఉప్పు కప్పురంబు’ చిత్రంలో ఆమె బామ్మ పాత్రలో నటించింది. ఇదే కాకుండా కొన్ని ఛానెళ్లలో బామ్మ మాట పేరుతో సుభాషిౠతాలు, విలువలు, మానవ సంబంధాల గురించి వివరిస్తుంది. ఈ బామ్మకు సినీ పరిశ్రమలోనూ పలువురు ఇన్‌స్టా అభిమానులు ఉన్నారు. -
దిమ్మతిరిగే ఫొటోస్ వదిలిన హీరోయిన్ సమంత (ఫొటోలు)
-
మినీ బాహుబలి
ఫొటోలో కనిపిస్తున్న ఈ జీవి.. బాహుబలి కంటే బలమైంది. పేరు ఒరిబాటిడ్ మైట్ లేదా ఆర్మర్డ్ మైట్. చూడటానికి ఇది 0.2 మి.మీ నుంచి 1.4 మి.మీ పరిమాణంలో.. ఇసుక రేణువంత ఉంటుంది. కానీ, శక్తి విషయంలో మాత్రం అత్యంత బలమైంది. ఇంతకాలం చీమ మాత్రమే తన శరీర బరువుకంటే వంద రెట్లు ఎక్కువ బరువును మోయగలదని అనుకున్నాం. ఇప్పుడు ఇది చీమను మించిన బాహుబలి అని తేలింది. ఇది తన శరీర బరువు కంటే సుమారు 1,180 రెట్ల అధిక బరువును ఎత్తగలదని ఈ మధ్యే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వంద మైక్రోగ్రాముల బరువు మాత్రమే ఉండే ఆర్మర్డ్ మైట్ ప్రపంచంలోనే అత్యంత బలమైన జీవి. ఇతర పురుగులు, కీటకాలు, జంతువుల కంటే ఈ జీవి ఇంత బలంగా ఉండటానికి ప్రధాన కార ణాలలో ఒకటి వాటి ఎక్సోస్కెలిటన్. ఇది ఎముక కంటే తేలికగా.. బలంగా ఉంటూ కండరాలకు ఎక్కువ శక్తిని అందిస్తుంది. శరీర ఉపరితల వైశాల్యం పెద్దగా ఉండటం వల్ల కూడా అది అంతంత బరువులు ఎత్తగలుగుతోందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. కేవలం అడవుల్లో మాత్రమే.. అరుదుగా కనిపించే ఈ ఆర్మర్డ్ మైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
మంకీ డ్యాన్స్ చాలెంజ్
ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్యాన్స్‌లు వస్తూ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సందడి ఇంటర్నెట్కే పరిమితం కావడం లేదు. బయట రకరకాల ఫంక్షన్లలో నృత్యాభిమానులు ఈ ట్రెండింగ్ డ్యాన్స్‌లను ఫాలో అవుతున్నారు. ‘గాంగ్నమ్’ డ్యాన్స్ తరువాత రకరకాల డ్యాన్సులు వచ్చాయి. తాజాగా ‘మంకీ డ్యాన్స్ చాలెంజ్’ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌గా మారింది. బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమ సనా షేక్ ‘నేను సైతం’ అంటూ ఈ చాలెంజ్‌ను స్వీకరించింది. పింక్ శారీలో మెరిసిపోతూ తన బృందంతో కలిసి చేసిన మంకీ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ‘దిస్ ఈజ్ అమేజింగ్’లాంటి కామెంట్స్‌తో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. కొత్త స్టైల్లో డ్యాన్స్ ట్రై చేయాలనుకుంటున్నావారికి ఈ వీడియో బెస్ట్ ఛాయిస్. -
ఇదేం ‘ఫ్యాషన్ షో’.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోండి
ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసే మోడల్స్‌ను అనుకరిస్తూ ఓ వ్యక్తి వినూత్న వీడియోను షూట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. మోడల్స్ ధరించిన దుస్తులను చిత్రీకరించడానికి అతను ఉపయోగించిన పరికరాలు నెటిజన్లను కేకలు పెట్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను డాక్టర్ అజయిత అనే ట్విట్టర్ యూజర్ తన ప్రొఫైల్ పోస్టు చేశారు. ఈ వీడియోకు ‘ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ షోలు’ అనే క్యాప్షన్ పెట్టారు. కాగా, ఈ వీడియోలో ‘మోడల్’ షహీల్ షెర్మాంట్ ఫ్లెయిర్.. ఫ్యాషన్ షోలో ఉపయోగించే ఫ్యాన్సీ దుస్తులకు బదులుగా ఇంట్లో వాడుకునే వస్తువులను ఎంచుకున్నాడు. ఆ వస్తువులను పట్టుకుని ర్యాంప్ వాక్‌ను అనుకరిస్తూ కనిపించాడు. ఆ వస్తువుల్లో వాకర్, స్కర్ట్, అల్యూమినియం నిచ్చెన, ఓ అమ్మాయి, రేకును ఉపయోగించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంలో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఫ్యాషన్ షోనా లేక ఇంట్లో దోపిడీ చేస్తున్నాడా అంటూ స్పందించారు. మరో నెటిజన్.. ‘అది పారిస్ లేక మిలన్’ అంటూ కామెంట్స్ చేశాడు. That third one got me reeling 😂😂😂 https://t.co/FupJhEuRaK — Black Dynamite (@jamesrautta) June 29, 2022 ఇది కూడా చదవండి: విమానంలోంచి గుట్టలు గుట్టలుగా చేపలు... -
హాట్ టాపిక్‌గా చైనా.. ఈసారి ఏం చేసిందంటే..?
బీజింగ్: చైనా మరోసారి సోషల్ మీడియాలో నిలిచింది. ఇప్పటికే ఎన్నోసార్లు వివిధ ఆవిష్కరణలు, ప్రపంచాన్ని భయపెడుతూ వార్తల్లో నిలిచిన చైనా.. ఈసారి మాత్రం కొంచెం వైరెటీ పని చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా.. భార్యలతో షాపింగ్‌కు వెళ్లే భర్తల కోసం చైనీయులు ట్రెండీగా ఆలోచించారు. భార్యలు గంటల కొద్దీ సమయం షాపింగ్ కోసం కేటాయిస్తారాన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో భర్తలు అసహనానికి గురికాకుండా, వారికి బోర్ కొట్టకుండా ఉండేందుకు చైనా ఓ పరిష్కారాన్ని కనుగొంది. షాపింగ్ చేసే భార్యలకు దూరంగా ఉండేందుకు షాంఘైలోని గ్లోబల్ హార్బర్ మాల్లో 'husband storage' పాడ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పాడ్స్‌లో ఓ వ్యక్తి కూర్చునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసింది. కస్టమర్లు ఆ పాడ్స్‌లో కుర్చొన్న సమయంలో వారు వైరే లోకంలో ఉన్నారనే అనుభూతిని కలిగించేందుకు వారికి బోర్ కొట్టకుండా ఉండేందుకు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసింది. గేమ్స్ ఆడుకునేందుకు వీలుగా మానిటర్, గేమ్ ప్యాడ్స్‌ను, కనీస అవసరాలను ఏర్పాటు చేసింది. అయితే, ప్రస్తుతానికి వినియోగదారులకు పాడ్స్‌లో ఉచితంగా గేమ్స్ ఆడుకునేందుకు అవకాశం కల్పించారు. రానున్న రోజుల్లో కస్టమర్లు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని షాపింగ్ మాల్స్ యజమానులు చెబుతున్నారు. కాగా, ఈ పాడ్స్‌లో సమయంగా గడిపిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. పాడ్స్‌లో గేమ్స్ ఆడటం ఎంతో కొత్తగా ఉందన్నారు. ఆహ్లదాన్ని అందించినట్టు తెలిపారు. దీంతో పాడ్స్ ఏర్పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. -
ఓ వైపు యుద్దం.. ఇటు లవ్ ప్రపోజ్ చేసిన ఉక్రెయిన్ సైనికుడు.. వీడియో వైరల్
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఆ దేశ ప్రజలు జీవన విధానం అస్తవ్యస్తమైపోయింది. బాంబు దాడులకు నివాస సముదాయాలు కూలిపోయాయి. చాలా మంది ఉక్రేనియన్లు వీధిన పడ్డారు. ఉక్రెయిన్‌లో హృదయ విదారక ఘటనలు పలువురికి కంట తడి పెట్టిస్తున్నాయి. రష్యా దాడుల నేపథ్యంలో పలువురు ఉక్రెయిన్ ప్రజలు ఆ దేశం నుండి ఇతర దేశాలకు తరలిపోతున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యుద్దం కారణంగా ఉక్రెయిన్‌కు వీడిపోతున్న తన ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేశాడు ఉక్రెయిన్ సైనికుడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. లవ్ ప్రపోజ్ చేసిన తీరు చూసి నెటిజన్లు ఫన్నీగా, ఎమోషనల్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఎలా జరిగిందంటే.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని ఫాస్టివ్ చెక్‌పోస్ట్ నగరాన్ని వీడుతున్న ప్రజలను ఆ దేశ సైనికులు తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక కారులో ప్రయాణిస్తున్న కొందరు వ్యక్తులను సైనికులు ఆపి.. వారి కారును, పత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కారులో ప్రయాణిస్తున్న వారిలో తన ప్రియురాలు ఉన్నట్లు ఒక సైనికుడు గమనించాడు. తనిఖీ చేస్తుండగా వెనక్కి నిలుచుని ఉన్న ఆమె వద్దకు వెళ్లి మోకాలిపై కూర్చొని ఒక చేతిలో ఉంగరం, మరో చేతిలో పుష్ఫగుచ్చంతో పెళ్లి ప్రపోజల్‌ను ఆమె ముందుంచాడు. సడెన్‌గా ఇలా ప్రియుడిని చూసిన ఆనందంలో ఆమె ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యింది. క్షణాల వ్యవధిలో ఆమె.. అతడిని హగ్ చేసుకొని తాను పెళ్లి రెడీ అన్న సంకేతంతో ముద్దుపెట్టింది. అనంతరం అతడు ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. ఆ సమయంలో అక్కడున్న మిగతా సైనికులు, ఇతరులు ఆ జంటకు అభినందనలు తెలిపారు. కాగా, 14 రోజులుగా బాంబు దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌లో ఇలాంటి ఓ ఘటన చోటుచేసుకోవడం అందరినీ ఆనందపరిచింది. ఈ సందర్బంగా ఈ జంటకు అంతా మంచే జరగాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుకుంటున్నారు. #Watch#Ukraine️ pic.twitter.com/4DeRtEgivM — Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) March 7, 2022 -
24 క్యారెట్ గోల్డ్ ఐస్‌క్రీం.. మన హైదరాబాద్‌లో.. ధర ఎంతంటే ?
Viral: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచం మన అర చేతుల్లో ఇమిడి పోయింది. దునియా నలుమూలల జరుగుతున్న విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. అలా మరోసారి వెలుగులోకి వచ్చింది బంగారు ఐస్‌క్రీం. అది దొరికేది మరెక్కడో కాదు మన భాగ్యనగరంలోనే.. ఆ వివరాలు ఓ సారి చూద్దాం.. బంజారాహిల్స్‌లో వ్యాపారం ఏదైనా వినియోగదారులను ఆకట్టుకోవడమే ప్రధానం. క్వాలిటీ, క్వాంటిటీతో పాటు ప్రత్యేకను నిలుపుకునే వ్యాపారాలు ప్రజల్లోకి ఇట్టే చొచ్చుకుపోతాయి. అదే క్రమంలో తమ ఐస్‌క్రీం పార్లర్‌కు ప్రత్యేకత తెచ్చేందుకు ఓ ఐక్క్రీం పార్లర్ 24 క్యారెట్ గోల్డ్ కోటెడ్ ఐస్క్రీంని అందిస్తోంది. ఈ ఐస్‌క్రీం పార్లర్ అదేక్కడో కాదు మన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కి చెందిన హుబర్ అండ్ హల్లీ ఐస్‌క్రీమ్ పార్లర్. మినీ మిడాస్ బంజారాహిల్స్‌లోని హుబర్ అండ్ హల్లీ ఐస్‌క్రీం పార్లర్లో వందలాది రకాలైన ఐస్‌క్రీమ్‌లు లభిస్తాయి. కానీ ఈ పార్లర్‌కి ప్రత్యేకతను తీసుకొచ్చింది మినీ మిడాస్ ఐస్ ఐస్‌క్రీం. వివిధ ప్లేవర్లలో రుచికరంగా ఐస్‌క్రీం తయారు చేసిన తర్వాత చివరకు 24 క్యారెట్ గోల్డ్ ఫాయిల్‌ను అలంకరణగా అమరుస్తారు. దీంతో ఒక్కసారిగా ఐస్‌క్రీం కొత్త అందాన్ని సంతరించుకుంటుంది. అద్భుతమైన రుచి అందమైన రూపు కలిగిన ఈ ఐస్‌క్రీం ఈ పార్లర్ ఇప్పుడు నెట్టింట ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఈ బంగారం తీనేయొచ్చట ఈ ఐస్‌క్రీం అలంకరణలో ఉపయోగించే గోల్డ్ ఫాయిల్ పేపర్ ఇడిబుల్ అని పార్లర్ నిర్వాహకులు అంటున్నారు. ఈ ఐస్‌క్రీం ఐదువందల రూపాయల దగ్గర నుంచి లభిస్తోంది. నాలుగేళ్లుగా ఈ ఐస్క్రీంని ఇక్కడ అందిస్తున్నారు. కాగా మరోసారి సోషల్ మీడియాలో ఈ ఐస్‌క్రీం ట్రెండవుతోంది. View this post on Instagram A post shared by JUST NAGPUR THINGS (@abhinavjeswani) చదవండి: హైదరాబాద్‌లో ఇవి కూడానా? ఓపెన్ కొరియన్ మెనూ! -
Humorous video: ఈ హెయిర్ స్టైల్‌తో నా అందం రెట్టింపవ్వాలి.. జాగ్రత్త!
అసలేంటో ఈ యేడాది మొత్తం షాకులమీద షాకులు ఎదురౌతున్నాయి. యేడాది చివరిలో కూడా వీటి ఉధృతి ఏమాత్రం తగ్గేదేలే! అనే విధంగా ఉంది చూడబోతే. లేకపోతే ఏంటండీ.. ఎక్కడైనా కోతి బార్బర్ షాప్‌కి వెళ్లడం, షేవ్ చేయించుకోవడం, దర్జాగా కూర్చుని హెయిర్ కటింగ్ చేయించుకోవడం కనీవినీ ఎరుగునా? అందుకే ఈ నిష్ఠూరమంతానూ! కాలం మారిపోయింది. అభిరుచులు మారిపోయాయి. ప్రస్తుతం స్త్రీలే కాదు పురుషుల డ్రస్ స్టైల్స్, ఆహార్యం, అభిరుచుల్లోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఐతే రొటీన్‌కు భిన్నంగా కోతిగారికి తన అందం గురించి డౌట్ కొట్టినట్టుంది. స్టైల్ మార్చాలనుకుంది.సెలూన్‌కు వెళ్లింది. హెయిర్ డ్రెస్సర్స్ చైర్లో కూర్చుని, మెడ చుట్టూ షీట్ చుట్టించుకుంది. తర్వాత బార్బర్ వచ్చి దువ్వెనతో దువ్వుతూ ఎలక్ట్రిక్ ట్రింబర్తో షేవ్ చేయడం ప్రారంభించాడు. ఇక కోతిగారేమో బుద్ధిగా కూర్చుని చక్కగా షేవ్ చేయించుకోవడం, బార్బర్ చెప్పినట్లు సూచనలు పాటించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. దీంతో నెట్టింట కోతి బార్బర్ షాప్ విజిటింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంకేముంది ఈ క్యూట్ వీడియోను చూసిన నెటిజన్లంతా ఫిదా అయిపోయి, కామెంట్ల రూపంలో ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. మీరు ఓ లుక్కెయ్యండి.. अब लग रहे SMART☺️☺️☺️👌👌👌 BEAUTY_PARLOUR☺️☺️😊@ParveenKaswan @susantananda3 @SudhaRamenIFS @NaveedIRS @arunbothra @TheJohnAbraham pic.twitter.com/lCiy0tmqN0 — Rupin Sharma IPS (@rupin1992) November 29, 2021 -
సోషల్ మీడియాని ఊపేస్తున్న #WeStandWithSRK
Aryan Khan's Drugs Case: డ్రగ్స్ కేసు విషయంలో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఎన్సీబీ కస్టడీలో ఉన్నఈ స్టార్ కిడ్ ఓ రోజు విచారణ తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, కొట్టి వేసిన కోర్టు కస్టడీని అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఈ తరుణంలో ఆయన షారుక్ ఫ్యాన్స్ ఆయన కుటుంబానికి, కొడుకు ఆర్యన్‌కి మద్దతు నిలుస్తున్నారు. ఎంతోమంది అభిమానులు షారుక్ మేము మీతో ఉన్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో ట్విట్టర్లో #WeStandWithSRK ట్రెండింగ్‌లోకి వచ్చింది. అభిమానులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం షారుక్ కుటుంబానికి మద్దతు తెలిపారు. ఈ తరుణంలో ఆర్యన్ గతంలో చిన్నారికి డబ్బులు దానం చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఆర్యన్‌తోపాటు మొత్తం 8మందిపై ఈ డ్రగ్స్ కేసు నమోదైంది. చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వివాదం.. షారుక్ కలిసి సల్మాన్ ఖాన్ #WeStandWithSRK #SRKPRIDEOFINDIA We all stand with SRK sir and his beautiful family his amazing kids and wonderful wife God bless you all Ameen O God 🙏#ShahRukhKhan pic.twitter.com/Hs0Zp2hRx9 — 🇪🇬Nahla Elsayed (@NahlaEl99258710) October 3, 2021 I stand with you @iamsrk, Always and forever SRKian WE LOVE SHAH RUKH KHAN#WeStandWithSRK pic.twitter.com/9NehQk7dKX — ღ 𝚂𝚑𝚊𝚑_𝚍𝚞𝚗𝚒𝚊 ღ🦋 (@fan_girl_srk) October 3, 2021 I don’t understand why someone would want to tarnish the reputation of the biggest star on this earth. Probably because they couldn’t do it directly to our beloved SRK they have now decided to get to him through his kids, that is not okay.#WeStandWithSRK pic.twitter.com/skF5iSpEvM — Laura Lou (@riversong1986) October 3, 2021 #WeStandWithSRK"Hawaon se thodi na hilne wala hoon mai"#WeStandWithSRK We Love You SRK pic.twitter.com/MRhtUvJlAX — Salman Baba (@SalmanB00526774) October 3, 2021 -
WeWantANewCaptain: సమయం ఆసన్నమైంది కోహ్లీ.. దిగిపో!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలవడంతో కెప్టెన్సీ మార్పు అంశం మరో సారి తెరపైకి వచ్చింది. బుధవారం ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గి విశ్వవిజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా చెత్త ప్రదర్శనకు కోహ్లీ కెప్టెన్సీనే కారణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీపై వేటు వేసి రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అప్పగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. తుది జట్టు ఎంపిక నుంచి మైదానంలో అనుసరించే వ్యూహాలు.. ఫీల్డింగ్ ప్లేస్ మెంట్స్, బౌలింగ్ మార్పులు ఇలా అన్నింటిలో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడని, చెత్త బ్యాటింగ్‌తో జట్టు ఓటమికి కారణమయ్యాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Kohli should step down . #Captaincy #WTC2021Final #Rahane #ICCWorldTestChampionship #WTCFinal pic.twitter.com/vtgrueryy2 — Supreme Leader (@tHeMantal) June 23, 2021 Now the time has come to make a new coach and a new captain.#T20WC #captaincy #INDvNZ #WTC21 #ViratKohli #RohitSharma pic.twitter.com/AIfWn8eDIJ — Dinesh LiLawat (@imDL45) June 23, 2021 అలాగే టీమిండియా ఘోర ప్రదర్శనకు హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా మరో ప్రధాన కారణమని అభిమానులు భావిస్తున్నారు. దీంతో కోహ్లీతో పాటు కోచ్ రవిశాస్త్రిపై కూడా వేటు వేయాల్సిన సమయం ఆసన్నమైందని కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ ఓ అన్ లక్కీ కెప్టెన్ అని, టాస్ నుంచి వాతావరణ పరిస్థితుల వరకు ఏదీ అతనికి కలిసిరావడం లేదంటున్నారు. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో కెప్టెన్‌గా కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడని కామెంట్ చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తే కనీసం టీ20 ప్రపంచకప్ అయినా గెలుస్తామని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో WeWantNewCaptain అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అలాగే కోచ్ రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్‌ను కొత్త కోచ్‌గా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ఆ జాబితాలో నంబర్ వన్ స్థానం -
ట్రెండింగ్ డాల్గొనా పెగ్ విస్కీ ఛాలెంజ్
కరోనా కట్టడికి సామాన్యుల నుంచి సెలబ్రటీల వరకు అందరూ ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి. దీంతో లాక్డౌన్ పుణ్యమా అని చాలామంది వారిలో ఉన్న సృజనాత్మకతను బయటపెడుతున్నారు. మొన్నటివరకు సోషల్ మీడియాలో దుమ్మురేపిన డాల్గొనా కాఫీ ట్రెండ్‌కి ఇప్పడు ఇంకోటి వచ్చి చేరింది. అదే డాల్గొనా పెగ్. డాల్గొనా కాఫీలానే డాల్గొనా పెగ్ తయారు చేయడం చాలా సులువు కావడంతో ఇప్పడు ఇది డాల్గొనా కాఫీని రీప్లేస్ చేసింది. డాల్గొనా పెగ్‌కి కావల్సినవి 1. నీళ్లు 2. విస్కీ 3. ఏదైనా వస్ర్తం ముందుగా ఓ గ్లాస్లో 3 వంతుల నీళ్లు పోయాలి. పైనుంచి ఓ వస్ర్తంతో కప్పి ఉంచుతూ మెల్లిగా నీళ్లను తాకుతూ క్లాత్‌ను కిందికి జారవిడవాలి. రెండు టేబుల్ స్ఫూన్ల విస్కీని వస్ర్తం పైనుంచి పోయాలి. తర్వాత నెమ్మదినెమ్మదిగా ఆ వస్ర్తాన్ని తీసేయాలి. అంతే డాల్గొనా కాఫీలానే డాల్గొనా విస్కీ పైన తేలియాడుతూ కనిపిస్తుంది. ఇప్పడు ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ విధించిన ప్రభుత్వం..నిత్యవసరాలు, మందులు మినహా మిగతా అమ్యకాలపై నిషేదం విధించింది. దీంతో మద్యం లభించక చాలామంది మద్యం బానిసలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో మందుబాబులకు వరం ప్రసాదిస్తూ డాక్టర్ ప్రిస్రిప్షన్ లెటర్ ఉంటే మద్యం సరఫరా చేయాలని కేరళ ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఆ తర్వాత పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా పరిమిత పాస్‌ల ద్వారా మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు అనుమతిచ్చింది. ఇక కర్ణాటకలో ఆదాయాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా ఏప్రిల్ 14 తర్వాత మద్యం అమ్మకాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు సీఎం యడియూరప్ప ప్రకటించారు. దేశంలో అత్యధిక మద్యం సరఫరా చేసే బాకార్డి, రెమీ మార్టిన్ లాంటి కంపెనీలు సామాజిక దూరం, నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో అయినా మద్యం విక్రయించడానికి అనుమతి ఇవ్వండంటూ కేంద్రాన్ని కోరాయి. ఇక భారత్‌లోనూ కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే కోవిడ్ కారణంగా 35 మంది ప్రాణాలు విడువగా, 706 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,152 కు చేరుకోగా, 308 మంది చనిపోయారు. -
ఆ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తోంది?
కత్రినా కైఫ్ సినిమాలు హిట్ అయి చాలా కాలమైంది. ఆమె ఇంతకుముందు నటించిన మూడు సినిమాలు ఫాంటమ్, ఫితూర్, బార్ బార్ దేఖో.. మూడూ బాక్సాఫీసు వద్ద ఫట్టయ్యాయి. తర్వాత ప్రస్తుతం తన మాజీ బోయ్‌ఫ్రెండు రణబీర్ కపూర్‌తో కలిసి జగ్గా జాసూస్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు కూడా ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పటి లెక్కప్రకారం అయితే ఏప్రిల్ 7వ తేదీన ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే.. ఈలోపు ఖాళీగా ఉండం ఎందుకని రకరకాల ఫొటోషూట్లు చేస్తోంది క్యాట్. అందులో భాగంగా సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అక్కడ ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ వాళ్ల బ్రైడల్ ఎడిషన్ కోసం ఫొటోషూట్‌లో పాల్గొంటోంది. అక్కడ వీళ్లిద్దరూ కలిసి దిగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండవుతున్నాయి. మరి కత్రినా ఫొటో షూట్ అంటే మామూలుగా ఉండదు కదా మరి.. నల్లటి బికినీ వేసుకుని, దానిపైన పసుపు రంగు కేప్ ధరించిన కత్రినా.. చక్కగా మనీష్ ఒళ్లో కూర్చుని మరీ ఓ ఫొటో తీయించుకుంది. ఆ ఫొటోను మనీష్ మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, దానికి 'పోజర్స్ ఇన్ మాల్దీవ్స్' అనే క్యాప్షన్ పెట్టాడు. అంతేకాదు.. కత్రినా, మిగిలిన టీం అంతా ఉంది కదా అని తన బర్త్‌డే కూడా అక్కడే చేసేసుకున్నాడు. ఇక కత్రినా కూడా మరో్ తెల్లటి దుస్తులతో కూడిన తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ తెగ ట్రెండవుతున్నారు.