![24 Karat Gold Ice Cream In Hyderabad Trending In Social media - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/14/24-Karat-Gold-Ice-Cream.jpg3_.jpg.webp?itok=T_lR_5Ge)
Viral: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచం మన అర చేతుల్లో ఇమిడి పోయింది. దునియా నలుమూలల జరుగుతున్న విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. అలా మరోసారి వెలుగులోకి వచ్చింది బంగారు ఐస్‌క్రీం. అది దొరికేది మరెక్కడో కాదు మన భాగ్యనగరంలోనే.. ఆ వివరాలు ఓ సారి చూద్దాం..
బంజారాహిల్స్‌లో
వ్యాపారం ఏదైనా వినియోగదారులను ఆకట్టుకోవడమే ప్రధానం. క్వాలిటీ, క్వాంటిటీతో పాటు ప్రత్యేకను నిలుపుకునే వ్యాపారాలు ప్రజల్లోకి ఇట్టే చొచ్చుకుపోతాయి. అదే క్రమంలో తమ ఐస్‌క్రీం పార్లర్‌కు ప్రత్యేకత తెచ్చేందుకు ఓ ఐక్‌క్రీం పార్లర్ 24 క్యారెట్ గోల్డ్ కోటెడ్ ఐస్‌క్రీంని అందిస్తోంది. ఈ ఐస్‌క్రీం పార్లర్ అదేక్కడో కాదు మన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కి చెందిన హుబర్ అండ్ హల్లీ ఐస్‌క్రీమ్ పార్లర్.
మినీ మిడాస్
బంజారాహిల్స్‌లోని హుబర్ అండ్ హల్లీ ఐస్‌క్రీం పార్లర్‌లో వందలాది రకాలైన ఐస్‌క్రీమ్‌లు లభిస్తాయి. కానీ ఈ పార్లర్‌కి ప్రత్యేకతను తీసుకొచ్చింది మినీ మిడాస్ ఐస్ ఐస్‌క్రీం. వివిధ ప్లేవర్లలో రుచికరంగా ఐస్‌క్రీం తయారు చేసిన తర్వాత చివరకు 24 క్యారెట్ గోల్డ్ ఫాయిల్‌ను అలంకరణగా అమరుస్తారు. దీంతో ఒక్కసారిగా ఐస్‌క్రీం కొత్త అందాన్ని సంతరించుకుంటుంది. అద్భుతమైన రుచి అందమైన రూపు కలిగిన ఈ ఐస్‌క్రీం ఈ పార్లర్ ఇప్పుడు నెట్టింట ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.
ఈ బంగారం తీనేయొచ్చట
ఈ ఐస్‌క్రీం అలంకరణలో ఉపయోగించే గోల్డ్ ఫాయిల్ పేపర్ ఇడిబుల్ అని పార్లర్ నిర్వాహకులు అంటున్నారు. ఈ ఐస్‌క్రీం ఐదువందల రూపాయల దగ్గర నుంచి లభిస్తోంది. నాలుగేళ్లుగా ఈ ఐస్‌క్రీంని ఇక్కడ అందిస్తున్నారు. కాగా మరోసారి సోషల్ మీడియాలో ఈ ఐస్‌క్రీం ట్రెండవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment