Humorous video: ఈ హెయిర్‌ స్టైల్‌తో నా అందం రెట్టింపవ్వాలి.. జాగ్రత్త! | Monkey Visiting Barber Shop To Get Shave Video Gone Popular On Social Media | Sakshi
Sakshi News home page

Humorous video: ఓసి నీ యాసాలు.. కోతిలాగే ఉన్నావులె!

Published Sun, Dec 19 2021 1:56 PM | Last Updated on Thu, Jan 20 2022 1:01 PM

Monkey Visiting Barber Shop To Get Shave Video Gone Popular On Social Media - Sakshi

అసలేంటో ఈ యేడాది మొత్తం షాకులమీద షాకులు ఎదురౌతున్నాయి. యేడాది చివరిలో కూడా వీటి ఉధృతి ఏమాత్రం తగ్గేదేలే! అనే విధంగా ఉంది చూడబోతే. లేకపోతే ఏంటండీ.. ఎక్కడైనా కోతి బార్బర్‌ షాప్‌కి వెళ్లడం, షేవ్‌ చేయించుకోవడం, దర్జాగా కూర్చుని హెయిర్‌ కటింగ్‌ చేయించుకోవడం కనీవినీ ఎరుగునా? అందుకే ఈ నిష్ఠూరమంతానూ!

కాలం మారిపోయింది. అభిరుచులు మారిపోయాయి. ప్రస్తుతం స్త్రీలే కాదు పురుషుల డ్రస్‌ స్టైల్స్‌, ఆహార్యం, అభిరుచుల్లోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఐతే రొటీన్‌కు భిన్నంగా కోతిగారికి తన అందం గురించి డౌట్‌ కొట్టినట్టుంది. స్టైల్‌ మార్చాలనుకుంది.సెలూన్‌కు వెళ్లింది. హెయిర్‌ డ్రెస్సర్స్‌ చైర్‌లో కూర్చుని, మెడ చుట్టూ షీట్‌ చుట్టించుకుంది. తర్వాత బార్బర్‌ వచ్చి దువ్వెనతో దువ్వుతూ ఎలక్ట్రిక్‌ ట్రింబర్‌తో షేవ్‌ చేయడం ప్రారంభించాడు. ఇక కోతిగారేమో బుద్ధిగా కూర్చుని చక్కగా షేవ్‌ చేయించుకోవడం, బార్బర్‌ చెప్పినట్లు సూచనలు పాటించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. దీంతో నెట్టింట కోతి బార్బర్‌ షాప్‌ విజిటింగ్‌ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఇంకేముంది ఈ క్యూట్‌ వీడియోను చూసిన నెటిజన్లంతా ఫిదా అయిపోయి, కామెంట్ల రూపంలో ఫన్నీగా రియాక్ట్‌ అవుతున్నారు. మీరు ఓ లుక్కెయ్యండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement