Salon
-
సెలూన్ ఓపెనింగ్‌లో బిగ్ బాస్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
విజయవాడ : అమ్జద్ హబీబ్ ప్రీమియం సలోన్ ని ప్రారంభించిన సినీనటి వర్ష (ఫొటోలు)
-
టిబిసి లగ్జరీ సెలూన్స్ లాంచ్ లో సినీ తారల సందడి (ఫోటోలు)
-
కల నెరవేర్చుకున్న బిగ్‌బాస్ విన్నర్
బిగ్‌బాస్ విన్నర్, హీరో వీజే సన్నీ తన కల నెరవేర్చుకున్నాడు. ఒక సెలూన్ ప్రారంభించాలన్న కలను నెరవేర్చుకున్నాడు. ద బార్బర్ క్లబ్ (టీబీస్) సెలూన్ ఫ్రాంచైజీని హైదరాబాద్‌లో ప్రారంభించాడు. ఈ ఓపెనింగ్‌కు బిగ్‌బాస్ సెలబ్రిటీలే మానస్, సోహైల్, ఆర్జే కాజల్, దీప్తి సునయన తదితరులు హాజరై సందడి చేశారు.ద బార్బర్ క్లబ్ సెలూన్‌ను ప్రవేశపెట్టిన జోర్డాన్ హైదరాబాద్‌లో ఫ్రాంచైజీ ఓపెనింగ్‌కు విచ్చేశాడు. అతడికి హారతి ఇచ్చి మరీ ఘన స్వాగతం పలికారు. ఈ వీడియోను సన్నీ షేర్ చేస్తూ నేటి నుంచి సెలూన్ అందుబాటులోకి వచ్చేసిందని తెలిపాడు. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సెలూన్ తెరిచి ఉంటుందని పేర్కొన్నాడు.ఇది చూసిన అభిమానులు మొత్తానికి బిగ్‌బాస్ షోలో చెప్పిన కలను సాధించేశావు.. నువ్వు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా యాంకర్‌గా కెరీర్ ఆరంభించిన సన్నీ తర్వాత నటుడిగా మారాడు. తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొని విజేతగా అవతరించాడు. చివరగా సౌండ్ పార్టీ సినిమాలో నటించాడు. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. View this post on Instagram A post shared by VJ Sunny (@iamvjsunny) View this post on Instagram A post shared by VJ Sunny (@iamvjsunny) చదవండి: సినీ‘వారం’: సాయితేజ్ ట్వీట్.. మంచు విష్ణు ఫైర్.. సారీ చెప్పిన సిద్ధార్థ్ -
చందానగర్ లో ఆటమ్న్ సెలూన్ ప్రారంభం (ఫొటోలు)
-
రోడ్డు పక్క సెలూన్లో రాహుల్ షేవింగ్.. ఫొటో వైరల్!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ సోషల్ మీడియాలో పలువురు నేతల ప్రకటనలు, ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇదే కోవలో తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్హచల్ చేస్తున్నాయి. ఆ ఫొటోలలో రాహుల్ రోడ్డు పక్కనున్న ఒక సాధారణ సెలూన్లో హెయిర్ కటింగ్‌తో పాటు షేవింగ్ చేయించుకోవడం కనిపిస్తుంది.కాంగ్రెస్ తన అధికారిక హ్యాండిల్లో రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేసింది. దానితోపాటు క్యాప్షన్‌లో 'ఎన్నికల సన్నాహాలు పూర్తయ్యాయి. అయితే జుట్టు కత్తిరించుకోవడం కూడా అవసరం. నైపుణ్యం కలిగిన యువత హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. దేశ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కావాలని డిమాండ్ చేస్తున్నాం’ అని రాసివుంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు దశల ఎన్నికలు పూర్తికాగా, ఇక మూడు దశల ఎన్నికలు మిగిలివున్నాయి. ఐదో దశ ఎన్నికలు మే 20న, ఆరో దశ ఎన్నికలు మే 25న, చివరి దశ అంటే ఏడో దశ ఎన్నికలు జూన్ ఒకటిన జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. चुनाव की तैयारी पूरी है, लेकिन हेयर कटिंग भी जरूरी है।हम ऐसे ही हुनरमंद नौजवानों के हक के लिए लड़ रहे हैं, देश के विकास में इनकी हिस्सेदारी मांग रहे हैं। 📍 रायबरेली, उत्तर प्रदेश pic.twitter.com/iTfEzkDGsh— Congress (@INCIndia) May 13, 2024 -
దోపిడీకి వచ్చి, అందరినీ చూసి.. ‘ఇదేందిది’ అంటూ తోక ముడిచిన దొంగ!
ఏదైనా దుకాణం లేదా స్టోర్‌లో లూటీ జరినప్పుడు అక్కడ అలజడి నెలకొంటుంది. లేదా ఆగంతకుడి చేతిలో ఆయుధం ఉంటే ఆ ప్రాంతంలో మౌనం నెలకొంటుంది. అయితే ఇటీవల అట్లాంటాలో దీనికి భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఒక నెయిల్ సెలూన్లో లూటీ చేసేందుకు వచ్చిన ఆగంతకుని ఎటువంటి పరిస్థితి ఎదురయ్యిందంటే.. దానిని ఎవరూ ఊహించలేరు. ఈ లూటీకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దానిని చూసిన జనం తెగ నవ్వుకుంటున్నారు. నెయిల్ సెలూన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్నదాని ప్రకారం అక్కడి సిబ్బంది కస్టమర్లకు సర్వీస్ చేస్తున్నారు. ఇంతలో ఒక ఆగంతకుడు అరుచుకుంటూ నెయిల్ సెలూన్‌లోకి ప్రవేశించి.. ‘అందరూ కింద కూర్చుని, నోరుమూసుకుని మీ దగ్గరున్న సొమ్ము ఇవ్వండి’ అని డిమాండ్ చేశాడు. ఆ ఆగంతకుని చేతిలో ఒక బ్యాగు ఉంది. దానిలో ఆ ఆగంతకుడు చేతులు పెట్టి, దీనిలో ఒక తుపాకీ ఉంది. బయటకు తీసి ఎవరినైనా కాల్చేస్తానని బెదిరించాడు. అయితే ఆగంతకుని అరుపులకు, బెదిరింపులకు అక్కడున్న ఎవరూ కించిత్తు కూడా భయపడలేదు. వారంతా ఎంతో రిలాక్స్ అవుతూ, ఫోను చూసుకుంటూ కూర్చున్నారు. అక్కడున్నవారంతా ఈ విధంగా ప్రవర్తిస్తారని ఆ ఆగంతకుడు అస్సలు ఊహించలేదు. చివరికి సెలూన్ యజమాని కూడా ఏ మాత్రం స్పందించకపోవడాన్ని ఆ ఆగంతకుడు జీర్ణించుకోలేకపోయాడు. ఇంతలో ఒక మహిళ తన ఫోనును బయటకు తీయగా, ఆ ఆగంతకుడు దానిని లాక్కున్నాడు. అయితే ఆమె ఏమాత్రం రియాక్ట్ అవకుండా మెల్లగా బయటకు వెళ్లిపోయింది. సెలూన్లో ఉన్న పరిస్థితులను చూసి ఆ ఆగంతకుడు ఉత్త చేతులతోనే బయటకు జారుకున్నాడు. ఆ సెలూన్ రెగ్యులర్ కస్టమర్ లీజా బోరె మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో సెలూన్ యజమాని కొద్దిగా భయపడ్డాడని, వినియోగదారులెవరూ స్పందించలేదని, దీంతో ఆ దొంగ పారిపోయాడని తెలిపారు. ఇది కూడా చదవండి: బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది? -
కార్పొరేట్ కత్తిరింపు మొదలైతే... వారి అస్తిత్వానికి ముప్పు!
పారిశ్రామికీకరణ కర్కశ పాదాల కింద ఎన్నో చేతివృత్తులు నలిగి పోయాయి. ఇంతకాలం మైల పనిగా భావించిన వృత్తుల్లో సైతం ఎన్నో మార్పులు వచ్చాయి. దాంతో సాంప్రదాయిక మంగలి (నాయీ బ్రాహ్మణ) వృత్తిపై కార్పొరేట్ కన్ను పడింది. కేశాలంకరణకు, రూప సౌందర్యానికి ఎంతైనా ఖర్చుపెట్టేవాళ్లు పెరుగుతున్న క్రమంలో వారి అవసరాలు తీర్చే రీతిలో కులవృత్తి మంగళ్ళు ఎదిగివచ్చే పరిస్థితులు లేవు. దీన్ని కార్పొరేట్లు చేజిక్కించుకొని, క్షుర కర్మ ఒక కుల వృత్తి అనే ముద్రని తుడిచేసే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం 45 శాతం కస్టమర్లు మాములు కటింగ్ చేయించుకోగా మిగతావారు చూడచక్కగా కనబడేందుకు సెలూన్లకు వస్తున్నారు. ఐదేళ్లలో ఈ ఫ్యాషన్ కస్టమర్ల సంఖ్య 60 శాతం పెరిగిందట. 2014లో రిలయన్స్ రిటైల్ తరపున హెయిర్ కటింగ్ షాపులు ఆరంభిస్తామన్న ప్రకటన రాగానే క్షురకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో ఆ ప్రతిపాదన వెనక్కి పోయింది. ఈ నవంబర్ మొదటివారంలో మరో వార్త వచ్చింది. నేచురల్స్ స్పా సంస్థలో 49 శాతం భాగస్వామ్యాన్ని కొనుగోలుకు ముకేశ్ అంబానీ సిద్ధపడినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన నేచురల్స్‌కి దేశంలోని ప్రముఖ నగరాల్లో 700 పైగా సెలూన్లు ఉన్నాయి. 2025 నాటికి ఆ సంఖ్యను 3,000కి పెంచాలనే ఆలోచనతో ముకేశ్ పావులు కదుపుతున్నారని వార్త. ఆయన సొంత సొమ్ముతో కొన్ని దుకాణాలు తెరిచినా కొంత కాలం తర్వాత ఫ్రాంచైజీ విధానాన్ని మొదలు పెడతారు. బ్రాండ్ పేరు కస్టమర్లలో చొచ్చుకు పోయాక ఆ పేరుతో షాపు తెరిచేందుకు వచ్చినవారి నుండి డిపాజిట్లు వసూలు చేసి రోజువారీ వ్యాపారంలో కమిషన్ తీసుకుంటారు. సొంత షాపుల బేరాలు దెబ్బ తింటే మంగలి కులంవారు ఈ సెలూన్లలో పనికి కుదరక తప్పదు. వారు తమ అస్తిత్వాన్ని కోల్పోవడంతో పాటు తమ వృత్తిలోనే కూలీలుగా మారే దుఃస్థితి వస్తుంది. అందుకే కార్పొరేట్లు ఈ వ్యాపారంలోకి రాకుండా ప్రభుత్వాలు అడ్డుకోవాలని నాయీబ్రాహ్మణ సంఘాలు కోరుతున్నాయి. (క్లిక్ చేయండి: ఆ వృత్తిని మాకు మాత్రమే పరిమితం చేయాలి) – బి. నర్సన్, రచయిత 94401 28169 -
Humorous video: ఈ హెయిర్ స్టైల్‌తో నా అందం రెట్టింపవ్వాలి.. జాగ్రత్త!
అసలేంటో ఈ యేడాది మొత్తం షాకులమీద షాకులు ఎదురౌతున్నాయి. యేడాది చివరిలో కూడా వీటి ఉధృతి ఏమాత్రం తగ్గేదేలే! అనే విధంగా ఉంది చూడబోతే. లేకపోతే ఏంటండీ.. ఎక్కడైనా కోతి బార్బర్ షాప్‌కి వెళ్లడం, షేవ్ చేయించుకోవడం, దర్జాగా కూర్చుని హెయిర్ కటింగ్ చేయించుకోవడం కనీవినీ ఎరుగునా? అందుకే ఈ నిష్ఠూరమంతానూ! కాలం మారిపోయింది. అభిరుచులు మారిపోయాయి. ప్రస్తుతం స్త్రీలే కాదు పురుషుల డ్రస్ స్టైల్స్, ఆహార్యం, అభిరుచుల్లోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఐతే రొటీన్‌కు భిన్నంగా కోతిగారికి తన అందం గురించి డౌట్ కొట్టినట్టుంది. స్టైల్ మార్చాలనుకుంది.సెలూన్‌కు వెళ్లింది. హెయిర్ డ్రెస్సర్స్ చైర్లో కూర్చుని, మెడ చుట్టూ షీట్ చుట్టించుకుంది. తర్వాత బార్బర్ వచ్చి దువ్వెనతో దువ్వుతూ ఎలక్ట్రిక్ ట్రింబర్తో షేవ్ చేయడం ప్రారంభించాడు. ఇక కోతిగారేమో బుద్ధిగా కూర్చుని చక్కగా షేవ్ చేయించుకోవడం, బార్బర్ చెప్పినట్లు సూచనలు పాటించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. దీంతో నెట్టింట కోతి బార్బర్ షాప్ విజిటింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంకేముంది ఈ క్యూట్ వీడియోను చూసిన నెటిజన్లంతా ఫిదా అయిపోయి, కామెంట్ల రూపంలో ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. మీరు ఓ లుక్కెయ్యండి.. अब लग रहे SMART☺️☺️☺️👌👌👌 BEAUTY_PARLOUR☺️☺️😊@ParveenKaswan @susantananda3 @SudhaRamenIFS @NaveedIRS @arunbothra @TheJohnAbraham pic.twitter.com/lCiy0tmqN0 — Rupin Sharma IPS (@rupin1992) November 29, 2021 -
ఆ ఆరుగురికి కరోనా పాజిటివ్
భోపాల్ : కరోనా వైరస్ సోకకుండా లాక్‌డౌన్‌ను పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తుప్పటికీ కొందరు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అనవసరమైన పనులకు బయటకు వెళ్లి కరోనా బారిన పడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో సెలూన్‌కు వెళ్లిన ఆరుగురు యువకులకు కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపింది. స్థానిక వైద్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇటీవల ఇండోర్ నుంచి స్థానికంగా ఉన్న సెలూన్లో హెయిర్ కట్ చేయించుకున్నాడు. అనంతరం రెండు రోజుల తరువాత అతనికి తీవ్ర అనారోగ్య సమస్య రావడంతో సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే అదే వారంలో మరో ఆరుగురు వ్యక్తులు అదే షాపులో కటింగ్ చేయించుకున్నారు. దీంతో వారందరికి తాజాగా పరీక్షలు నిర్వహించగా వారికి కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ యువకులను క్వారెంటైన్‌కు తరలించాగా.. ఆ గ్రామంలోని అందరినీ స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు ఆదేశించారు. కాగా జిల్లాలో ఇప్పటివరకు 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. ఆరుగురు మృత్యువాత పడ్డట్లు జిల్లా అధికారులు తెలిపారు. -
బుక్ చదివితే.. బిల్లులో 30 శాతం రాయితీ
సాధారణంగా ఏ సెలూన్‌లోనైనా అద్దాలు, కత్తెరలు, షాంపూలు, సబ్బులు తదితర సామగ్రి మాత్రమే ఉంటాయి. అయితే తమిళనాడుకు చెందిన పొన్‌మారియప్పన్ మెన్స్ బ్యూటీ హెయిర్ సెలూన్ మాత్రం పుస్తకాలతో నిండి ఉంటుంది. చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన పొన్‌మారియప్పన్ చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఇష్టం. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు కాస్తా మధ్యలోనే ఆగిపోయింది. బతుకుతెరువుకోసం ఓ క్షౌరశాల ప్రారంభించాడు. అయినప్పటికీ కంటపడిన ప్రతి పుస్తకమూ చదివేవాడు. ఈ అలవాటు క్రమేణా పుస్తకసేకరణపై ఆసక్తిని పెంచింది. మొదట స్క్రాప్ డీలర్ల నుంచి పుస్తకాలను సేకరించేవాడు. ఆ తర్వాత ప్రతి నెలా తన ఆదాయంలో కొంత మొత్తాన్ని వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేశాడు. వీటన్నింటిని తన దుకాణంలో అందంగా ఆల్మారాల్లో ఉంచాడు. దుకాణంలోకి వచ్చిన వినియోగదారులు కొంతమంది వాటిల్లో తమకు నచ్చినవి చదువుకునేవారు. దీనిని గమనించిన మారియప్పన్ తన దుకాణానికి వచ్చే ప్రతి ఒక్కరితో పుస్తకాలు చదివించాలని నిర్ణయించుకున్నాడు. ఇందు కు ఓ ఉపాయం ఆలోచించాడు. అదే రాయితీ. తీసుకున్న పుస్తకంలో పదిపేజీలు చదివితే బిల్లులో 30 శాతం రాయితీ వస్తుంది. అయితే రాయితీ ఇచ్చినంతమాత్రాన అంద రూ చదువుతారనే నమ్మకమేమీ లేదు. ఇందు కు కారణం ఇప్పుడు అందరూ సెల్ఫోన్లో మునిగితేలుతుండడమే. ‘సెల్‌ఫోన్ వాడరాదు’ అనే బోర్డు ఏర్పాటు చేశాడు. దీంతో అక్కడికి వచ్చినవారు సెల్ఫోన్లను జేబులో పెట్టుకుని పుస్తకాలు పట్టుకోవడంమొదలైంది. అంతరించిపోతున్న పుస్తక పఠనాన్ని పునరుద్ధరించడంలో కృతకృత్యుడైనందుకుగాను అందరూ మారియప్పన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాకుండా చాలా మంది పుస్తకాలను విరాళంగా అందజేస్తు న్నారు. ఓ ఎంపీ 50 పుస్తకాలను విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ క్షౌరశాలలో 900 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలోచన నచ్చడంతో మాజీ క్రికెటర్ హర్ష భోగ్లే... మారియప్పన్‌ను అభినందించారు. -
ఫ్యాషన్ హొయలు
-
సెలూన్లపై సెలబ్రిటీల కన్ను!
దేశంలో ‘నష్టం లేని వ్యాపారమేదైనా ఉందంటే అది సెలూన్ షాపే’ అనేది ఇదివరకటి జోకు. కానీ... అందానికి మెరుగులద్దే ఈ సెలూన్ వ్యాపారంలో అందనంత లాభాలున్నాయనేది నేటి వాస్తవం. అందుకే సెలబ్రిటీలు, కార్పొరేట్లూ అందరూ బ్యూటీ మార్కెట్‌పై దృష్టి సారించారు. దాదాపు రూ.40 వేల కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉండి... 34 లక్షల మందికి ఉపాధినిస్తున్న ఈ వ్యాపారంలోకి దిగటమే కాక జోరుగా విస్తరణకూ సన్నాహాలు చేస్తున్నారు. - బిజినెస్ బ్యూరో, హైదరాబాద్ • స్పా, సెలూన్, జిమ్, మేకోవర్ స్టూడియోలతో రంగంలోకి • దేశంలో అందం, ఆరోగ్యం పరిశ్రమ రూ.41,224 కోట్లు • ఏటా 20-23 శాతం వృద్ధి రేటు నమోదు • 2018 నాటికి రూ. 80,370 కోట్లకు చేరొచ్చని అంచనా • దక్షిణాది రాష్ట్రాలపై అంతర్జాతీయ సంస్థల దృష్టి సెలబ్రిటీలకు వ్యాపారాలు కొత్త కాదు. కాకపోతే సెలూన్, స్పా వ్యాపారమనేది ఇప్పటి ట్రెండ్. ఈ ట్రెండ్ ఇపుడు తెలుగు సినీ పరిశ్రమకు కూడా శరవేగంగా పాకింది. ఉదాహరణకు మెగాస్టార్ తనయుడు, హీరో రామ్‌చరణ్‌నే తీసుకుంటే... ఈయన జూబ్లీహిల్స్‌లో లాటిట్యూడ్స్ పేరుతో జిమ్, సెలూన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఇక ఒకప్పటి హీరోయిన్ రాశి... శ్రీనగర్‌కాలనీలో కలర్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట బ్యూటీ సెంటర్‌ను నిర్వహిస్తోంది. బరువు తగ్గటం, ఒబేసిటీ వంటివి తమ స్పెషాలిటీలుగా ఈ సంస్థ చెబుతోంది. గాయని స్మిత జూబ్లీహిల్స్‌లో బబూల్స్ పేరుతో బ్యూటీ సెలూన్ అండ్ స్పాను నడుపుతోంది. ఇక నటి రాజ్యలక్ష్మి బంజారా హిల్స్‌లో మిర్రర్ పేరిట సెలూన్, స్పా సెంటర్‌ను ప్రారంభించారు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. అంతెందుకు! బాలీవుడ్ హీరో ఫర్హాన్ అఖ్తర్ భార్య అధునా అఖ్తర్ సహ భాగస్వామిగా ప్రారంభించిన ‘బి:బ్లంట్’ కూడా ఇటీవలే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బ్రాంచి తెరిచింది. ఈ సంస్థలో గోద్రెజ్ కన్స్యూమర్ కేర్ 30% ఇన్వెస్ట్ చేసింది. ఏటా 20-23 శాతం వృద్ధి... భారతీయ సౌందర్య పరిశ్రమ ప్రధానంగా చర్మం, జుట్టు, రంగులు, సుగంధ ద్రవ్యాలు అనే విభాగాలుగా విస్తరిస్తోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో దేశంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో అందం, ఆరోగ్య సంరక్షణ వ్యాపారం రూ.41,224 కోట్లుగా నమోదైనట్లు ఇటీవల ఫిక్కీ, ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ కలిసి విడుదల చే సిన నివేదిక వెల్లడించింది. మొత్తం మార్కెట్లో పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల వాటా 25-35%. ఏటా 20-23 శాతం వృద్ధిని నమోదు చే స్తున్న ఈ పరిశ్రమ 2018 నాటికి రూ.80,370 కోట్లకు చేరుకుంటుందనేది నిపుణుల అంచనా. సర్వీస్ ట్యాక్స్ ప్రభావం... ‘‘గతంలో సగటున 45 రోజులకోసారి సెలూన్‌కు వచ్చేవారు ఇపుడు 30 రోజులకే వస్తున్నారు. సింగిల్ సర్వీస్ బదులు రెండు గంటలుండి మూడు సర్వీసులు చేయించుకుంటున్నారు. వ్యాపారం బాగా పెరుగుతోంది’’ అని హైదరాబాద్‌లో 7 బ్రాంచ్‌లు నడుపుతున్న ఎన్ఆర్బీ బ్యూటీ సెలూన్ నిర్వాహకుడు నందు చెప్పారు. సౌందర్య పోషణ పై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో ఖర్చుకు వెనకాడటం లేదన్నారు. ఏటా విదేశాల నుంచి మన దేశానికి 400 మిలియన్ డాలర్ల విలువైన సుగంధ ద్రవ్యాలు, తైలాలు దిగుమతి అవుతున్నాయని వీఎల్సీసీ గ్రూప్ ఫౌండర్, చైర్ పర్సన్ వందన లూథ్రా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు చెప్పారు. తాజాగా సర్వీస్ టాక్స్ పెంపుతో సేవలు ఖరీదయ్యే అవకాశం ఉందన్నారు. సెలూన్లలో మెనిక్యూర్, పెడిక్యూర్, వాకింగ్స్, థ్రెడింగ్, ఫేషియల్స్‌కు రూ.4,000 నుంచి రూ.6,000 వరకు... కేశ సంరక్షణకు రూ.12,000 వరకు ఖర్చవుతుంది. అంతర్జాతీయ కంపెనీలు దక్షిణాదిలో... ఇటాలియన్ కంపెనీ బొటెగా డి లుంగావిటా (బీడీఎల్) దేశంలో ఈ ఏడాది ముగిసేసరికి వంద ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉంది. ఈ నెలాఖరులోగా ఉత్తరప్రదేశ్‌లోని పలు నగరాల్లో 7-8 స్టోర్లను ప్రారంభించి, ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను తెరవనుంది. ఈ కంపెనీ ప్రస్తుతం 180కి పైగా సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఫ్రెంచ్ కాస్మోటిక్ కంపెనీ లోరియాలా పారిస్ ఈ ఏడాది చివరికి బెంగళూరు, చెన్నైల్లో, ఆపైన హైదరాబాద్‌లో స్టోర్లను ప్రారంభించనుంది. పీఈ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించేందుకు ప్రముఖ సెలూన్ చెయిన్ జావేద్ హబీబ్స్ ప్రయత్నిస్తోంది. షహనాజ్ హుస్సేన్, ఎన్రిచ్ బ్యూటీ సెలూన్స్, వైఎల్‌జీ వంటి కంపెనీల విస్తరణలో పడ్డాయి. ఆన్లైన్లో అమ్మకాలు 30,000 కోట్లు.. హై ఎండ్ కాస్మెటిక్స్, చర్మ సంరక్షణ ఉత్పత్తుల అమ్మకాలు ఆఫ్‌లైన్‌లో కంటే ఆన్లైన్లోనే ఎక్కువ. గూగుల్ అధ్యయనం ప్రకారం.. 2020 నాటికి ఆన్లైన్లో సౌందర్య సంరక్షణ ఉత్పత్తుల అమ్మకాలు సుమారు రూ. 30,000 కోట్లకు చేరుకుంటాయి. వచ్చే ఐదేళ్లలో ఎఫ్ఎంసీజీ సంస్థల అమ్మకాల్లో సుమారు 10 శాతం వాటా ఈ-కామర్స్ ద్వారానే జరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆన్లైన్ అమ్మకాలపై ఎఫ్ఎంసీజీ కంపెనీలు దృష్టి సారించాయి. లోరియల్‌కి సంబంధించి ప్రధాన బ్రాండ్స్ లోరియల్ ప్యారిస్, గార్నియర్ విక్రయాల్లో 1 శాతం వాటా ఆన్లైన్ అమ్మకాలదే. మేబెలీన్ బ్రాండ్ మేకప్ శ్రేణి టర్నోవరులో 3 శాతం వాటా ఆన్‌లైన్‌దే. దీంతో జార్జియో అర్మానీ, ఈవ్స్ సెయింట్ లారెంట్, ల్యాంకోమ్ వంటి లగ్జరీ సౌందర్య సాధనాలు, లా రోష్-పొసే, విషీ వంటి కాస్మొటిక్స్‌ను కూడా ఆన్‌లైన్‌లోకి తెస్తున్నాయి. షీసీడో తాజాగా జెడ్ఏ బ్రాండ్ కింద కొత్తగా మేకప్ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లోనూ ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మహిళలతో సమానంగా పురుషులూ.. సౌందర్య పోషణకు మహిళలతో పాటు పురుషులూ భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఇది దాదాపు 200 మిలియన్ డాలర్లని అసోచామ్ నివేదిక చెబుతోంది. ఆ నివేదిక ముఖ్యాంశాలు చూస్తే... ► 65 శాతం టీనేజర్లు తమ జేబులోని 75 శాతం సొమ్మును కాస్మొటిక్స్కే వెచ్చిస్తున్నారు. ► విదేశాల్లో 55 ఏళ్లు దాటినవారిని టార్గెట్ చేసే కాస్మొటిక్ కంపెనీలు ఇక్కడ 30 దాటిన వారిని టార్గెట్ చేస్తూ ఉత్పత్తులు తెస్తున్నాయి. ► 2004కు ముందు ఏటా సగటున 50 కొత్త సౌందర్య ఉ త్పత్తులు మార్కెట్లోకొచ్చేవి. ఇప్పుడీసంఖ్య 350 పైనే. -
తీయగా... చల్లగా!
ఫుడ్ n బ్యూటీ: మృదువుగా తీయగా రసపూరితంగా ఉండే పుచ్చకాయకు వేసవి తాపానికి తగ్గించే శక్తి పుష్కలంగా ఉంది. వేసవిలో విరివిగా దొరికే కాయను చల్లగా తినేయవచ్చు, సలాడ్‌లా మార్చేసుకొని కాస్త రుచిని కూడా దట్టించవచ్చు. ఇట్టే వండేసుకోగల అలాంటి సలాడ్లలో ఒకటి ఇది. కావాల్సినవి: ఒక ఉల్లిపాయ, నాలుగు నిమ్మకాయలు, ఒకటిన్నర కిలో పరిమాణంలో పుచ్చకాయ, కొత్తిమీర కట్ట ఒకటి, పుదీన కొంత, నాలుగు టీస్పూన్ల పరిమాణంలో ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, ఉప్పు. తయారీ విధానం: ముందుగా పుచ్చకాయను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొని ఒక గిన్నెలో ఉంచుకోవాలి. మరో గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడిని కలిపి ఉంచాలి. కొత్తిమీర, పుదీనాలను తరిగి ఉంచుకోవాలి, వీటన్నింటిని మిక్స్ చేస్తే సలాడ్ రెడీ! పోషక విలువలు: పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది. దీని ద్వారా సహజసిద్ధమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పుచ్చకాయల్లో కొవ్వుపదార్థాలేమీ ఉండవు. అరటితో అందంగా..! ఆకలి తీర్చి శక్తినందించడమే కాదు అందాన్ని కాపాడటంలో కూడా అరటిపండు ఎంతో మంచి పాత్ర పోషించగలదు. సర్జరీలను తలదన్నే స్థాయిలో చర్మాన్ని అందంగా ఉంచగలదు అరటి. విటమిన్ ఏ, బి, ఇ పొటాషియంలు పుష్కలంగా ఉంటాయిందులో. ఇవి ముఖంలో డ్రై నెస్‌ను తగ్గించడం, చర్మ సున్నితత్వాన్ని సూర్య కిరణాల నుంచి కాపాడటం, చర్మకణాలను కాపాడటం చేస్తాయి. అరటి పండుతో వివిధ రకాల ప్యాక్‌లు తయారు చేసుకొని ముఖానికి అప్లై చేయవచ్చు. వాటిలో ముఖ్యమైనవి ఇవి... - బాగా పండిన అరటి పండును గుజ్జుగా చేసుకొని ముఖానికి పట్టించాలి. కాసేపు దాన్ని అలాగే ఉంచి తర్వాత కడిగేసుకోవాలి. దీని వల్ల నల్లమచ్చలను తగ్గి ముఖం ప్రకాశవంతం అవుతుంది. - అరటిపండు గుజ్జులోకే తేనె లేదా నిమ్మరసాన్ని కలుపుకొని కూడా ఫేస్‌ప్యాక్ చేసుకోవచ్చు. తేనెతో ముఖం కాంతిమంతం అవుతుంది, నిమ్మరసం కాంబినేషన్‌తో మొటిమలు తగ్గుతాయి. -
అద్దంలో అందగత్తె
కొన్ని రోజులుగా తెలుగు ప్రేక్షకులు మిస్సవుతున్న నటి సంజన కొత్తగా బిజెనెస్ రంగంలోకి కాలుపెట్టింది. హెయిర్ స్టైల్స్, మేకప్, సౌందర్య సేవలందించే సెలూన్ వ్యాపారంలో అడుగిడింది. ప్రముఖ సెలూన్ సంస్థ మిర్రర్లో భాగస్వామ్యం తీసుకుని వ్యాపార విస్తరణలో మునిగిపోతోంది. మిర్రర్ బ్యూటీ అకాడమీ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో ఈ ముద్దుగుమ్మ మెరిపించింది. ఈ సందర్భంగా కాసేపు ‘సిటీప్లస్’తో ముచ్చటించింది. ‘తెలుగు అంటే చాలా ఇష్టం. ఇక్కడి పరిశ్రమ ఎంతో ప్రోత్సహించింది. టాలీవుడ్ అంతగా అచ్చిరాలేదు. కన్నడ, మళయాళంలో హిట్లున్నాయి. త్వరలో తెలుగులో ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో సరదా సినిమాలో నటించబోతున్నా. ఎప్పటికీ తెలుగు పరిశ్రమను వదలిపెట్టను. మంచి కథ దొరికితే తప్పకుండా నటిస్తా. బ్యూటీ అనేది క్రియేటివిటీకి అవకాశం ఉన్న రంగం. నాకు చాలా ఆసక్తి. హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టు రాబిన్ స్లేటర్ వద్ద బ్యూటీ టిప్స్ నేర్చుకున్నా. ఆ స్థాయి నిపుణులు మనకు అవసరం.