ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ సోషల్ మీడియాలో పలువురు నేతల ప్రకటనలు, ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇదే కోవలో తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌హచల్ చేస్తున్నాయి. ఆ ఫొటోలలో రాహుల్ రోడ్డు పక్కనున్న ఒక సాధారణ సెలూన్‌లో హెయిర్ కటింగ్‌తో పాటు షేవింగ్ చేయించుకోవడం కనిపిస్తుంది.
కాంగ్రెస్ తన అధికారిక హ్యాండిల్‌లో రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేసింది. దానితోపాటు క్యాప్షన్‌లో 'ఎన్నికల సన్నాహాలు పూర్తయ్యాయి. అయితే జుట్టు కత్తిరించుకోవడం కూడా అవసరం. నైపుణ్యం కలిగిన యువత హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. దేశ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కావాలని డిమాండ్ చేస్తున్నాం’ అని రాసివుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు దశల ఎన్నికలు పూర్తికాగా, ఇక మూడు దశల ఎన్నికలు మిగిలివున్నాయి. ఐదో దశ ఎన్నికలు మే 20న, ఆరో దశ ఎన్నికలు మే 25న, చివరి దశ అంటే ఏడో దశ ఎన్నికలు జూన్ ఒకటిన జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
चुनाव की तैयारी पूरी है, लेकिन हेयर कटिंग भी जरूरी है।
हम ऐसे ही हुनरमंद नौजवानों के हक के लिए लड़ रहे हैं, देश के विकास में इनकी हिस्सेदारी मांग रहे हैं।
📍 रायबरेली, उत्तर प्रदेश pic.twitter.com/iTfEzkDGsh— Congress (@INCIndia) May 13, 2024
Comments
Please login to add a commentAdd a comment