ఉద్యోగాల రూప కల్పన విషయంలో బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ యువత ఇదే విషయంపై తమని ప్రశ్నిస్తోందని అన్నారు. ఎన్నికల ముందు యువతకు చేసిన వాగ్ధానం ‘యువ న్యాయ్’ ద్వారా ఉపాధి విప్లవానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టిందని ఆయన హామీ ఇచ్చారు.
‘ప్రధాని మోదీ జీ యువతకు ఉపాధి కోసం మీ వద్ద ఏదైనా ప్రణాళికలు ఉన్నాయా? అనే ప్రశ్న ప్రతి యువతీ యువకుల్లో ఉంది. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని అబద్ధం ఎందుకు చెప్పారు’ అని ప్రశ్నించారు.
'యువ న్యాయ్ ఆధ్వర్యంలో ఉపాధి విప్లవం చేపట్టాలని కాంగ్రెస్ సంకల్పించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ‘పెహ్లీ నౌక్రి పక్కీ’ పథకాన్ని అమలు చేయడం ద్వారా పేపర్ లీకేజీలు కాకుండా చూస్తామని రాహుల్ గాంధీ ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment