దేశంలో ఏడు విడతలుగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఐదు దశల ఎన్నికలు ముగిశాయి. ఆరు, ఏడో దశ ఎన్నికలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ రెండు దశల్లోనూ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసిందని సమాచారం. ఢిల్లీ, హర్యానా, హిమాచల్, పంజాబ్ కాంగ్రెస్‌కు చాలా ముఖ్యమైనవి. ఈసారి ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు రాబడుతందని పార్టీ అంచనా వేస్తోంది.
ఈ నాలుగు రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగిలిన మూడు స్థానాల్లో పోటీ బీజేపీ, ఇండియా కూటమి మధ్యే నెలకొంది. హర్యానా, హిమాచల్‌లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఈ నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో మొత్తం 35 సీట్లు ఉన్నాయి. గతంలో వాటిలో 24 సీట్లు బీజేపీకి దక్కగా, రెండు సీట్లు ఎన్‌డీఏలో భాగమైన అకాలీదళ్‌కు దక్కాయి. కాంగ్రెస్‌కు ఎనిమిది సీట్లు, ఆప్‌కు ఒక సీటు వచ్చాయి. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ మెరుగైన పలితాలు సాధిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే ఈ రాష్ట్రాల్లో పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
ఢిల్లీలోని ఏడు స్థానాల్లో కాంగ్రెస్, ఆప్‌తో కలిసి పోటీకి దిగింది. దీంతో కాంగ్రెస్, ఆప్ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈసారి చీపురు గుర్తు బటన్‌ను నొక్కి, కేజ్రీవాల్‌కు ఓటు వేస్తానని రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో మోదీ ప్రభుత్వ హ్యాట్రిక్‌ను అడ్డుకునేందుకు ఇరు పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నాయి.
ఈ రెండు దశల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పాటు రైతుల సమస్యలు, అగ్నివీర్ అంశంపై దృష్టి పెడుతున్నదని సమాచారం. హర్యానాలో పొత్తులో భాగంగా కాంగ్రెస్ కురుక్షేత్ర సీటును ఆప్‌కి ఇచ్చింది. రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఇక్కడ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా గట్టి పునాదిని ఏర్పర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ జోరుగా ర్యాలీలు నిర్వహిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ రాష్ట్రంలోని మహేంద్రగఢ్, పచ్కుల, సోనిపట్‌లలో మూడు ర్యాలీలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment