బీజేపీ ఎంపీ హేమా మాలినీపై కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉప్రమించింది. సూర్జేవాలా 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీఐ ఏప్రిల్ 16న నిషేధం విధించింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 తరపున అనుమతించే అన్ని ఇతర అధికారాల ప్రకారం సుర్జేవాలా బహిరంగ సభలు, బహిరంగ ఊరేగింపులు, బహిరంగ ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటర్వ్యూలు, మీడియాలో (ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా) బహిరంగ ప్రసంగాలు మొదలైనవి నిర్వహించకుండా నిషేధించింది. ఏప్రిల్ 16 సాయంత్రం 6 గంటల నుండి 48 గంటల పాటు ఆయనపై వేటు వేసింది.
కొద్ది రోజుల క్రితం హర్యానాలో చేసిన ఎన్నికల ప్రచారంలో రణ్‌దీప్ సూర్జేవాలా బాలీవుడ్ నటి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ హేమమాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈసీఐ సూర్జేవాలాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హేమమాలినిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు ఏప్రిల్ 9న షోకాజ్ నోటీసు జారీ చేసింది .
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ఉల్లంఘించింనదుకు గాను ఎన్నికల సంఘం ఎలాంటి పక్షపాతం లేకుండా హర్యానాలో ఎన్నికల ప్రచారంలో సూర్జేవాలా చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది. దుష్ప్రవర్తనపై మందలించింది.
Comments
Please login to add a commentAdd a comment