2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. అదే సమయంలో ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 200 మార్కును కూడా దాటలేదని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్, సీపీఐ(ఎం)లు రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. అయితే బీజేపీకి లబ్ధి చేకూర్చే టీఎంసీయేతర పార్టీలకు ఓటు వేయొద్దని మమతా బెనర్జీ ఓటర్లను కోరారు.
ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని గోఘాట్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి బెనర్జీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి పేరు పెట్టింది నేనే. బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమి నేతలు పనిచేస్తున్నారు. అదే ఇండియా కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు టీఎంసీ తన వంతు ప్రయత్నాలు చేస్తోందన్నారు.
మోదీ 400 పై చీలూకు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అవన్నీ సాధ్యమయ్యేవి కావు. 200 సీట్లు దాటడం గగనమేనని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment