ఉత్తర్ ప్రదేశ్ అమోథీ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి కిషోరి లాల్ శర్మ (కేఎల్ శర్మ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమోథీ నియోజక వర్గం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల వారసత్వమని అభివర్ణించారు.
ముసాఫిర్ఖానాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కిషోరి లాల్ శర్మ తనని తాను రాహుల్ గాంధీ కుటుంబానికి సేవకునిగా పేర్కొన్న ఆయన.. అమోథీ.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అమానత్ (సందర్భాన్ని బట్టి ఆస్తి, సందప) అని, వారు ఎప్పుడు అడిగితే అప్పుడు దానిని తిరిగి ఇచ్చేస్తానని అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని అమోథీ నియోజకర్గం కాంగ్రెస్ కంచుకోట. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి కిషోరి లాల్ శర్మ.. బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై పోటీ చేస్తున్నారు.
ఈ తరుణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కిషోరి లాల్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కుటుంబం అమోథీని రాజకీయాల పరంగా చూడలేదు. వారు తమ సొంత ఇల్లులా, కుటుంబంగా భావించారు. 1983 నుండి ఈ కుటుంబంతో అనుబంధం కలిగి ఉన్నాను. చివరి నిమిషంలో పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. అందుకే నేను గాంధీ కుటుంబానికి సేవకుడిగా, అమోథీ నియోజవర్గానికి సేవకునికిగా భావిస్తున్నారు. అందుకే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment