
దేశంలో ఓ వైపు ఎన్నికలు జరుగుతుండగా, మరోవైపు ఎండ వేడిమి జనాలకు చెమటలు పట్టిస్తోంది. ఈ పరిస్థితుల నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో మోదీ కూలర్‌కు డిమాండ్ ఏర్పడింది.
వారణాసిలోకి చెందిన ఎలక్ట్రీషియన్ రాకేష్ గుప్తాకు ‘మోదీ కూలర్’ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. దీంతో అతను వివిధ పరికరాలతో మోదీ కూలర్ తయారుచేసి షాపు ముందు ఉంచాడు. దీనిని చూసిన వినియోగదారులు మోదీ కూలర్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాను రూపొందించిన కూలర్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తున్నదని రాకేష్ గుప్తా తెలిపారు. ఈ కూలర్ కోసం ఎవరైనా ఆర్డర్ ఇస్తే మూడు నాలుగు రోజుల్లో తయారు చేసి, వారికి అందజేస్తున్నానని ఆయన తెలిపారు.
వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గంలో చివరి దశలో అంటే జూన్ ఒకటిన పోలిగ్ జరగనుంది. ఈ పార్లమెంట్ స్థానం నుంచి ప్రధాని మోదీ సహా మొత్తం ఏడుగురు ప్రధాన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్, బీఎస్పీ నుంచి అథర్ జమాల్ లారీ ఎన్నికల బరిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment