దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు దశల పోలింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రస్తుతం దేశంలో 96.8 కోట్ల మందికి పైగా అర్హులైన ఓటర్లు ఉన్నారు.
1951 నుంచి చూసుకుంటే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. ఓటింగ్ శాతం పెరగడం లేదా తగ్గడం వెనుక అనేక కారణాలున్నాయి. అధికార పార్టీతో పాటు ఆ పార్టీ అభ్యర్థుల పనితీరు, ప్రతిపక్ష పార్టీల స్థానం, మతం, కులం మొదలైనవి ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతున్నాయి. 1951లో జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతూ వస్తోంది.
2014 లోక్‌సభ ఎన్నికలు చారిత్రాత్మకంగా నిలిచాయి. 1984 తర్వాత ఒక పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించడం అదే తొలిసారి. ఈ ఎన్నికల్లో 66.4 శాతం ఓటింగ్ నమోదైంది. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో సీనియర్ విజిటింగ్ ఫెలో మిలన్ వైష్ణవ్ నాడు ఓటింగ్ శాతం పెరగడానికి బీజేపీ సాధించిన విజయాలే కారణమన్నారు. ఈ పెరిగిన ఓటింగ్‌లో యువ ఓటర్ల పాత్ర పెరిగిందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రం డైరెక్టర్ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం యువ ఓటర్ల సంఖ్య పెరిగిన రాష్ట్రాల్లో బీజేపీకి ఓటింగ్ శాతం కూడా పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment