విపక్ష పార్టీల్లా తాము కుటుంబ రాజకీయాలు చేయడం లేదంటూ ప్రధాని మోదీ విపక్షాలపై విరుచుకు పడ్డారు. లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఓ జాతీయా మీడియాకు మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో బీజేపీ పార్టీ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో వివరించారు.
మా పార్టీ ‘కుటుంబం ద్వారా, కుటుంబం కోసం’అనే విధానాన్ని అనుసరించడం లేదు. కార్యకర్త నుంచి నేత వరకు ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడమే బీజేపీ ఎజెండా. మాకు కుటుంబ ఆధారిత పార్టీలు లేవు. ప్రతిపక్షాల తరహాలో కుటుంబం ద్వారా, కుటుంబం కోసం అని కాకుండా ఇక్కడ (బీజేపీలో) ప్రతి ఒక్కరికీ అవకాశం లభిస్తుంది’ అని స్పష్టం చేశారు.
రాజకీయంగా కుటుంబాన్ని, కుటుంబ మూలాలను ఎలా బలోపేతం చేయాలనే సంస్కృతి ఉందని మోదీ వ్యాఖ్యానించారు. ‘అయితే, నేను, నా ప్రభుత్వం దేశాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో పని చేస్తుంది. దేశం బలంగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ దాని ప్రయోజనాలు పొందుతారు. మేం అందుకోసమే పనిచేస్తున్నామని మోదీ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో దేశంలోని యువ ఓటర్ల ఆకాంక్షలను విఫలం చేసిందని ప్రధాని మోదీ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment