
సాక్షి,బెంగళూరు : ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తన కొడుకే స‍్వతంత్ర్య అభ్యర్ధిగా బరిలోకి దిగి విజయం సాధిస్తారని కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి తన మనసు మార్చే ప్రయత్నం చేసినా ఫలితం ఉండదన్నారు. స్వతంత్రంగా పోటీ చేసి ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా కొద్ది రోజుల క్రితం బీజేపీ మొత్తం 20 మంది అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. అంతకంటే ముందే హవేరి-గడగ్ లోక్‌సభ సీటును తన కుమారుడు కే.ఈ.కాంతేష్ సీటు కావాలని అదిష్టానంతో చర్చలు జరిపారు.
కాంతేష్‌కు హవేరి లోక్‌సభ సీటు వస్తుందంటూ మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సైతం హామీ ఇచ్చారు. కాంతేష్ గెలుపు కోసం ప్రచారం చేస్తానని యడ్యూరప్ప చెప్పినట్లు ఈశ్వరప్ప తెలిపారు. అయితే అనూహ్యంగా హవేరీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని బీజేపీ పోటీకి దింపింది.
దీంతో అధిష్టానం నిర్ణయంపై కేఎస్. ఈశ్వరప్ప అసంతృప్తికి గురయ్యారు. ఈ తరుణంలో శివమొగ్గలో జరిగిన బహిరంగ సభలో ఈశ్వరప్ప మాట్లాడుతుండగా.. ఈశ్వరప్ప మద్దతుదారులు స్వంతంత్ర్య అభ్యర్ధిగా బరిలో దిగడంపై ప్రశ్నించారు. మోదీ ఒప్పిస్తే పోటీ చేయకుండా ఆగిపోతారా? అన్న ప్రశ్నకు ఈశ్వరప్ప స్పందించారు.‘మోదీ నిర్ణయం ఎలా ఉన్నా వెనక్కి తగ్గేది లేదు. నా మద్దతుదారులను, కార్యకర్తలను నేను అగౌరవపరచను. నేను మీకు హామీ ఇస్తున్నాను. విజయవంతంగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది’. అని సమాధానం ఇచ్చారు.
అంతకుముందు ఓ సందర్భంలో.. ‘నేను 40 ఏళ్లుగా పార్టీకి నమ్మకంగా సేవ చేశా. సి.టి.రవి, సదానంద గౌడ, నళిన్‌కుమార్ కటీల్, ప్రతాప్ సింహాలు మద్దతుగా నిలిచారు. కానీ లోక్‌సభ సీట్ల కేటాయింపులో తనకు అన్యాయమే జరిగిందని కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం కేఈ ఈశ్వరప్ప వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment