![Once Again Modi Words Of Only Bjp Workers, But All Indians: B Y Vijayendra - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/23/bjp.jpg.webp?itok=YZ0gW-Rc)
సాక్షి, బెంగళూరు : ‘వన్స్ ఎగైన్ మోదీ’ అని బీజేపీ కార్యకర్తలే కాదు, దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీ వై విజయేంద్ర.
లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని విజయేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు. మరోసారి మోదీ పీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు.
‘బీజేపీ గెలవాలి.. మోదీ పీఎంగా మరోమారు బాధ్యతలు చేపట్టాలని కోరుకునేది పార్టీ నేతలే కాదు. దేశ ప్రజల ఆకాంక్ష. దేశంలో మోదీ పాపులారిటీ రోజురోజుకి పెరిగిపోతుంది. ఆయన విజన్, అభివృద్ధిని ప్రజలు నమ‍్ముతున్నారని ప్రశంసలు’ కురిపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ అభ్యర్ధులే కరువయ్యారన్న విజయేంద్ర..బీజేపీకి సౌత్ ఇండియా గేట్‌వే కర్ణాటక అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment