తీయగా... చల్లగా! | Food and Beauty for health | Sakshi
Sakshi News home page

తీయగా... చల్లగా!

Published Sun, Apr 12 2015 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

తీయగా... చల్లగా!

తీయగా... చల్లగా!

ఫుడ్ n బ్యూటీ: మృదువుగా తీయగా రసపూరితంగా ఉండే పుచ్చకాయకు వేసవి తాపానికి తగ్గించే శక్తి పుష్కలంగా ఉంది. వేసవిలో విరివిగా దొరికే కాయను చల్లగా తినేయవచ్చు, సలాడ్‌లా మార్చేసుకొని కాస్త రుచిని కూడా దట్టించవచ్చు. ఇట్టే వండేసుకోగల అలాంటి సలాడ్‌లలో ఒకటి ఇది.
 
కావాల్సినవి:
 ఒక ఉల్లిపాయ, నాలుగు నిమ్మకాయలు, ఒకటిన్నర కిలో పరిమాణంలో పుచ్చకాయ,  కొత్తిమీర కట్ట ఒకటి, పుదీన కొంత, నాలుగు టీస్పూన్ల పరిమాణంలో ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, ఉప్పు.
 
 తయారీ విధానం:
 ముందుగా పుచ్చకాయను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొని ఒక గిన్నెలో ఉంచుకోవాలి. మరో గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడిని కలిపి ఉంచాలి. కొత్తిమీర, పుదీనాలను తరిగి ఉంచుకోవాలి, వీటన్నింటిని మిక్స్ చేస్తే సలాడ్ రెడీ!
 
 పోషక విలువలు:
 పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది. దీని ద్వారా సహజసిద్ధమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పుచ్చకాయల్లో కొవ్వుపదార్థాలేమీ ఉండవు.
 
 అరటితో అందంగా..!
ఆకలి తీర్చి శక్తినందించడమే కాదు అందాన్ని కాపాడటంలో కూడా అరటిపండు ఎంతో మంచి పాత్ర పోషించగలదు. సర్జరీలను తలదన్నే స్థాయిలో చర్మాన్ని అందంగా ఉంచగలదు అరటి. విటమిన్  ఏ, బి, ఇ పొటాషియంలు పుష్కలంగా ఉంటాయిందులో. ఇవి ముఖంలో డ్రై నెస్‌ను తగ్గించడం, చర్మ సున్నితత్వాన్ని సూర్య కిరణాల నుంచి కాపాడటం, చర్మకణాలను కాపాడటం చేస్తాయి. అరటి పండుతో వివిధ రకాల ప్యాక్‌లు తయారు చేసుకొని ముఖానికి అప్లై చేయవచ్చు. వాటిలో ముఖ్యమైనవి ఇవి...
 
 - బాగా పండిన అరటి పండును గుజ్జుగా చేసుకొని ముఖానికి పట్టించాలి. కాసేపు దాన్ని అలాగే ఉంచి తర్వాత కడిగేసుకోవాలి. దీని వల్ల నల్లమచ్చలను తగ్గి ముఖం ప్రకాశవంతం అవుతుంది.
 - అరటిపండు గుజ్జులోకే తేనె లేదా నిమ్మరసాన్ని కలుపుకొని కూడా ఫేస్‌ప్యాక్ చేసుకోవచ్చు. తేనెతో ముఖం కాంతిమంతం అవుతుంది, నిమ్మరసం కాంబినేషన్‌తో మొటిమలు తగ్గుతాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement