ఏదైనా దుకాణం లేదా స్టోర్‌లో లూటీ జరినప్పుడు అక్కడ అలజడి నెలకొంటుంది. లేదా ఆగంతకుడి చేతిలో ఆయుధం ఉంటే ఆ ప్రాంతంలో మౌనం నెలకొంటుంది. అయితే ఇటీవల అట్లాంటాలో దీనికి భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఒక నెయిల్ సెలూన్‌లో లూటీ చేసేందుకు వచ్చిన ఆగంతకుని ఎటువంటి పరిస్థితి ఎదురయ్యిందంటే.. దానిని ఎవరూ ఊహించలేరు.
ఈ లూటీకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దానిని చూసిన జనం తెగ నవ్వుకుంటున్నారు. నెయిల్ సెలూన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్నదాని ప్రకారం అక్కడి సిబ్బంది కస్టమర్లకు సర్వీస్ చేస్తున్నారు. ఇంతలో ఒక ఆగంతకుడు అరుచుకుంటూ నెయిల్ సెలూన్‌లోకి ప్రవేశించి.. ‘అందరూ కింద కూర్చుని, నోరుమూసుకుని మీ దగ్గరున్న సొమ్ము ఇవ్వండి’ అని డిమాండ్ చేశాడు. ఆ ఆగంతకుని చేతిలో ఒక బ్యాగు ఉంది. దానిలో ఆ ఆగంతకుడు చేతులు పెట్టి, దీనిలో ఒక తుపాకీ ఉంది. బయటకు తీసి ఎవరినైనా కాల్చేస్తానని బెదిరించాడు.
అయితే ఆగంతకుని అరుపులకు, బెదిరింపులకు అక్కడున్న ఎవరూ కించిత్తు కూడా భయపడలేదు. వారంతా ఎంతో రిలాక్స్ అవుతూ, ఫోను చూసుకుంటూ కూర్చున్నారు. అక్కడున్నవారంతా ఈ విధంగా ప్రవర్తిస్తారని ఆ ఆగంతకుడు అస్సలు ఊహించలేదు. చివరికి సెలూన్ యజమాని కూడా ఏ మాత్రం స్పందించకపోవడాన్ని ఆ ఆగంతకుడు జీర్ణించుకోలేకపోయాడు. ఇంతలో ఒక మహిళ తన ఫోనును బయటకు తీయగా, ఆ ఆగంతకుడు దానిని లాక్కున్నాడు. అయితే ఆమె ఏమాత్రం రియాక్ట్ అవకుండా మెల్లగా బయటకు వెళ్లిపోయింది.
సెలూన్‌లో ఉన్న పరిస్థితులను చూసి ఆ ఆగంతకుడు ఉత్త చేతులతోనే బయటకు జారుకున్నాడు. ఆ సెలూన్ రెగ్యులర్ కస్టమర్ లీజా బోరె మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో సెలూన్ యజమాని కొద్దిగా భయపడ్డాడని, వినియోగదారులెవరూ స్పందించలేదని, దీంతో ఆ దొంగ పారిపోయాడని తెలిపారు.
ఇది కూడా చదవండి: బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది?
Comments
Please login to add a commentAdd a comment