Barber Shop
-
బార్బర్ షాపులో రాహుల్!
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని బార్బర్ షాపులో గడ్డం ట్రిమ్మింగ్ చేయించుకున్నారు. తనకు ట్రిమ్మింగ్ చేసిన దుకాణం యజమాని అజిత్‌తో మాట్లాడారు. నిత్య జీవితంలో ఆయన ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. తనకు మిగిలిందేమీ లేదంటూ అజిత్ కన్నీరు పెట్టుకున్నాడని రాహుల్ ఆవేదన చెందారు. పెరుగుతున్న ద్రోవ్యోల్బణం, తగ్గుతున్న ఆదాయాలు పేద, మధ్య తరగతి ప్రజల సొంత దుకాణం, సొంతిల్లు కలిగి ఉండాలని, ఆత్మగౌరవంతో బతకాలన్న వారి కలలను కల్లలు చేశాయన్నారు. ‘ఇటువంటి వారి సమస్యలకు ఆధునిక పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఉంది. వీరి ఆదాయం, పొదుపులను పెంచాలి. నైపుణ్యం కలవారికి తగు ప్రతిఫలం దక్కాలి’అని రాహుల్ పేర్కొన్నారు. – న్యూఢిల్లీ -
ఇస్మార్ట్ రాహుల్ గాంధీ
-
బంజారాహిల్స్: మసాజ్ చేస్తూ గొలుసు కొట్టేశారు...
బంజారాహిల్స్: బార్బర్ షాప్‌కు మసాజ్‌కు వెళ్లిన యువకుడి మెడలో నుంచి బంగారు గొలుసు చోరీకి గురైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... టోలిచౌకి ఎండీ లైన్స్‌లో నివసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆదిత్య తొడలపల్లి టోలిచౌకి ఐఏఎస్ కాలనీలో ఉన్న అవిద్స్ బార్బర్ షాప్‌కు మసాజ్ కోసం వెళ్లారు. మసాజ్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి చూడగా మెడలో ఉన్న బంగారు గొలుసు కనిపించలేదు. సుమారు రూ. 80 వేల విలువ చేసే బంగారు గొలుసును మసాజ్ చేస్తున్న సమయంలో సదరు వ్యక్తి దొంగిలించి ఉంటాడని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘బయటకు వెళ్లి సిగరెట్ కాల్చుకో’ అన్నాడని..
హెయిర్ కటింగ్ కోసం సెలూన్‌కు వెళ్లి ఒక వ్యక్తి సెలూన్ యజమాని కుమారునితో ‘బయటకు వెళ్లి సిగరెట్ కాల్చుకో’ అని అన్నాడు. ఈ మాట విన్న ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోవడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జరుగున్న సంఘటనను అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయి చూశారు. దేశరాజధాని ఢిల్లీలో సిగరెట్ తాగే విషయంలో చోటు చేసుకున్న వివాదం దారుణానికి దారితీసింది. ఈ ఉదంతం ఢిల్లీలోని కిషన్గఢ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తిపై దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం మత్తులో సెలూన్‌కు వచ్చిన ఒక యువకుడు అక్కడే ఉంటున్న 38 ఏళ్ల వ్యక్తిపై కత్తెరతో పలుమార్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అభయ్ కుమార్ అనే వ్యక్తి హెయిర్ కంటింగ్ కోసం సెలూన్‌కు వెళ్లాడు. అదే సమయంలో దుకాణం యజమాని కుమారుడు మెహిత్ మహలావత్(22) అక్కడికి వచ్చాడు. అతను మద్యం మత్తులో ఉండి, సిగరెట్ కాలుస్తున్నాడు. దీంతో అభయ్ అతనితో ‘బయటకు వెళ్లి సిగరెట్ కాల్చుకో’అని అన్నాడు. ఈ మాట విన్న వెంటనే మోహిత్ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడేవున్న కత్తెర తీసుకుని పలుమార్లు అభయ్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో అభయ్ శరీరంపై 9 చోట్ల గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్టు చేశారు. ఇది కూడా చదవండి: హెల్మెట్లు చాలావరకూ నలుపు రంగులోనే ఎందుకుంటాయంటే.. -
బార్బర్ షాపులో పనిచేసి, ఎన్ని వేల కోట్ల ఖరీదైన కార్లు కొన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు
-
సెలూన్ షాప్‌నకు ‘కరెంట్ షాక్’.. అమ్మో ఇంత బిల్లా!
సాక్షి,మధిర(ఖమ్మం): నాయీబ్రాహ్మణులు, రజకులు సెలూన్, ల్యాండ్రీ షాపుల్లో నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా వాడుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉచితంగానే మీటర్లు కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఆయా వర్గాలతో పాటు ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. మధిర పట్టణంలోని సీపీఎస్ రోడ్డులో గల ఒక సెలూన్ షాపునకు విద్యుత్ బిల్లు ఏకంగా రూ.19,671 వచ్చింది. దీంతో షాపు నిర్వాహకుడు అవాక్కయ్యాడు. తాను నెలకు కనీసం 100 యూనిట్లు కూడా వాడడం లేదని, ఇంత బిల్లు రావడమేంటని లబోదిబోమంటున్నాడు. మధిరకు చెందిన నాగులవంచ అప్పారావు అనే నాయీ బ్రాహ్మణుడు సీపీఎస్ రోడ్డులో ఆరేళ్లుగా సెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు. నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పథకం కింద మీటర్ మంజూరు చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించడంతో మీ సేవ కేంద్రం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అంతకు ముందే బడ్డీకొట్టులో వీరయ్య అనే వ్యక్తి పేరున ఉన్న సర్వీస్ నంబర్ 75ను ఉచిత విద్యుత్ మీటర్‌గా మార్చి అప్పారావుకు అందించారు. ఈ పథకం కింద నెలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అయితే అప్పారావు నెలకు కనీసం 100 యూనిట్ల విద్యుత్ కూడా వాడలేదు. (చదవండి: సెక్యూరిటీ గార్డు గౌస్, సాజియా ఒంటిపై దుస్తులు లేకుండా.. ) 2021 నవంబర్‌లో కరెంట్ బిల్లు జీరోగా వచ్చింది. డిసెంబర్లో మాత్రం రూ.19,671.92 బిల్లు రావడంతో ఆందోళనకు గురయ్యాడు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోక పోగా, ఆదివారం ఆ శాఖ సిబ్బంది వచ్చి బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేస్తామని చెప్పారు. దీంతో ఈ విషయాన్ని ఆయన ‘సాక్షి’ దృష్టికి తీసుకొచ్చాడు. తాను రోజంతా కష్టపడినా రూ.300 కూడా రావడం లేదని, కుటుంబాన్ని పోషించడమే కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఇంత బిల్లు ఎలా చెల్లించాలని మనోవేదనకు గురువుతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాడు. ఈ విషయమై విద్యుత్ శాఖ ఏఈ, లైన్మెన్లను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు. -
పట్టింపులకు ..‘కత్తెర’
సాక్షి, సిద్దిపేట: ఒకప్పుడు మహిళలు అంటే ఇంటికే అంకితమనేవారు. తర్వాత కాలం మారినా.. కొన్ని రకాల ఉద్యోగాలు, కొన్ని రంగాలకే పరిమితమయ్యారు. కొన్ని రకాల కుల వృత్తులు అయితే పూర్తిగా పురుషులే ఉండే పరిస్థితి. ఇలాంటి ఆలోచనల్లో మార్పు తెస్తోంది సిద్దిపేటకు చెందిన కొత్వాల్ లావణ్య. పట్టింపులన్నీ పక్కన పెట్టి.. విజయవంతంగా క్షౌరవృత్తిని నిర్వహిస్తోంది. అటు భర్తకు చేదోడుగా ఉండటంతోపాటు కుటుంబానికి ఆసరానూ ఇస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో.. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన కొత్వాల్ లావణ్య, నంగనూరు మండలం దేవుని నర్మెట గ్రామానికి చెందిన శ్రీనివాస్‌లకు 13 ఏళ్ల కింద వివాహమైంది. మొదట్లో వారు వ్యవసాయం చేసేవారు. అది గిట్టుబాటు కాకపోవడంతో పనికోసం 8 ఏళ్ల కింద సిద్దిపేటకు వచ్చారు. పట్టణంలో పలు సెలూన్లలో శ్రీనివాస్ రోజువారీ పనికివెళితే.. లావణ్య కూలీపనులకు వెళ్లేది. ఇన్నాళ్లూ ఎలాగోలా గడిచినా.. కరోనా సమయంలో సెలూన్లు మూతపడటం, గిరాకీ తగ్గడంతో శ్రీనివాస్‌కు పనిలేకుండా పోయింది. ఇద్దరూ కూలిపనులకు వెళ్లినా వచ్చే అరకొర సంపాదన సరిపోక అప్పుల పాలయ్యారు. ఈ క్రమంలోనే భర్తతో కలిసి తానూ కత్తెర పట్టాలనుకుంది. ఆ ఆలోచనకు శ్రీనివాస్ అండగా నిలిచాడు. 4 నెలల పాటు వివిధ స్టయిళ్లలో కటింగ్ చేయడం నేర్చుకుంది లావణ్య. ఇద్దరూ కలిసి గతేడాది నవంబర్ 25న స్థానిక కేసీఆర్ నగర్ (డబుల్ బెడ్రూమ్ కాలనీ)లో హరీశన్న హెయిర్ కటింగ్ పేరుతో సెలూన్ ప్రారంభించారు. లావణ్య రోజూ ఇంటిపనులు చూసుకోవడంతోపాటు.. పొద్దంతా షాప్‌లో కటింగ్ చేస్తోంది. ముఖ్యంగా కటింగ్‌కు వచ్చే పిల్లలు ఏడుస్తుంటారు. లావణ్య వారిని బుజ్జగిస్తూ, కబుర్లు చెప్తూ కటింగ్ చేస్తుండటం అందరినీ ఆకట్టుకుంది. చాలా మంది తమ చిన్నారులను హెయిర్ కటింగ్ కోసం లావణ్య వద్దకు తీసుకురావడం మొదలుపెట్టారు. మా ఆయన దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నా మా కులంలో మగవాళ్లు చాలావరకు కులవృత్తిలోనే కొనసాగుతున్నారు. మా కుటుంబంలో ఆడవాళ్లు ఎవరూ కటింగ్ షాప్‌లో అడుగు పెట్టలేదు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల మా ఆయనకు సపోర్ట్‌గా నిలవాలనుకున్నా. కటింగ్ చేస్తానంటే మా ఆయన సపోర్ట్ చేశారు. ఆయన దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నా. ఎవరేమైనా అనుకోనీ అని క్షౌరవృత్తి మొదలుపెట్టిన. పిల్లలు, పెద్దలు ఎవరికైనా కటింగ్, షేవింగ్ చేస్తున్నా. మా ఆర్థిక ఇబ్బందులకు కొంత పరిష్కారం దొరికింది. – లావణ్య -
Humorous video: ఈ హెయిర్ స్టైల్‌తో నా అందం రెట్టింపవ్వాలి.. జాగ్రత్త!
అసలేంటో ఈ యేడాది మొత్తం షాకులమీద షాకులు ఎదురౌతున్నాయి. యేడాది చివరిలో కూడా వీటి ఉధృతి ఏమాత్రం తగ్గేదేలే! అనే విధంగా ఉంది చూడబోతే. లేకపోతే ఏంటండీ.. ఎక్కడైనా కోతి బార్బర్ షాప్‌కి వెళ్లడం, షేవ్ చేయించుకోవడం, దర్జాగా కూర్చుని హెయిర్ కటింగ్ చేయించుకోవడం కనీవినీ ఎరుగునా? అందుకే ఈ నిష్ఠూరమంతానూ! కాలం మారిపోయింది. అభిరుచులు మారిపోయాయి. ప్రస్తుతం స్త్రీలే కాదు పురుషుల డ్రస్ స్టైల్స్, ఆహార్యం, అభిరుచుల్లోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఐతే రొటీన్‌కు భిన్నంగా కోతిగారికి తన అందం గురించి డౌట్ కొట్టినట్టుంది. స్టైల్ మార్చాలనుకుంది.సెలూన్‌కు వెళ్లింది. హెయిర్ డ్రెస్సర్స్ చైర్లో కూర్చుని, మెడ చుట్టూ షీట్ చుట్టించుకుంది. తర్వాత బార్బర్ వచ్చి దువ్వెనతో దువ్వుతూ ఎలక్ట్రిక్ ట్రింబర్తో షేవ్ చేయడం ప్రారంభించాడు. ఇక కోతిగారేమో బుద్ధిగా కూర్చుని చక్కగా షేవ్ చేయించుకోవడం, బార్బర్ చెప్పినట్లు సూచనలు పాటించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. దీంతో నెట్టింట కోతి బార్బర్ షాప్ విజిటింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంకేముంది ఈ క్యూట్ వీడియోను చూసిన నెటిజన్లంతా ఫిదా అయిపోయి, కామెంట్ల రూపంలో ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. మీరు ఓ లుక్కెయ్యండి.. अब लग रहे SMART☺️☺️☺️👌👌👌 BEAUTY_PARLOUR☺️☺️😊@ParveenKaswan @susantananda3 @SudhaRamenIFS @NaveedIRS @arunbothra @TheJohnAbraham pic.twitter.com/lCiy0tmqN0 — Rupin Sharma IPS (@rupin1992) November 29, 2021 -
మరో బాంబు పేల్చిన తాలిబన్లు.. ఇక స్టైలిష్ కటింగ్స్ బంద్!
కాబుల్: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు తమ నియంతృత్వ పాలనను కొనసాగిస్తూ ప్రజలను భయభ్రాంతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే అవకాశం లేకుండా విదేశాలు తమ అంతర్గత పాలన విషయంలో జోక్యం చేసుకోకూడదని తాలిబన్ నేతలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే తాజాగా మరో అవసరపై కూడా నిషేదం విధిస్తున్నట్లు వారు ప్రకటించారు. దక్షిణ అఫ్గనిస్తాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్స్‌లో స్టైలిష్ హెయిర్‌స్టైల్స్, క్లీన్ షేవ్‌ను చేసుకోవడాన్ని తాలిబన్లు నిషేదించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇస్లామిక్ ఓరియంటేషన్ మంత్రిత్వ శాఖ అధికారులు, ప్రావిన్షియల్ రాజధాని లష్కర్ గాహ్‌లో పురుషుల సెలూన్ల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో స్టైలిష్‌గా హెయిర్ కట్టింగ్, గడ్డం షేవింగ్ చేయకూడదని స్పష్టం చేశారు. దాంతోపాటు షాపులలో ఆధ్యాత్మిక పరమైనవి కాకుండా ఇతర సంగీతం వినిపించకుడదని హకుం జారీ చేశారు. తాలిబన్ల పాలానా విధానం చూస్తే వారు పాత ధోరణినే కొనసాగిస్తున్నట్లు ఆ మీడియా పేర్కొంది. ఓ పక్క మారిపోయామంటూనే తమ పాత ధోరణిని పాటిస్తున్న తాలిబన్లు అఫ్గన్‌లో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల పశ్చిమ నగరం హెరాత్‌లో కిడ్నాప్‌కు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను చంపి ఆ మృతదేహాలను తాలిబన్లు బహిరంగంగా వేలాడదీసిన సంగతి తెలిసిందే. చదవండి: Afghanistan: తాలిబన్ల వికృత చర్య.. చంపేసిన వాళ్లని.. -
దళితులకు హెయిర్ కట్ : ఆత్మహత్యే శరణ్యం
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా పలు వ్యాపారాలు, చిన్న, చిన్న దుకాణాలు కూడా మూతపడ్డాయి. దీంతోపాటు అనేక వృత్తి కార్మికులు కూడా ఉపాధిలేక సంక్షోభంలోకి కూరుకుపోయారు. అయితే ఇపుడిపుడే సాధారణ పరిస్థితులతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఒక బార్బర్‌షాపు యజమాని పట్ల గ్రామ పెద్దలు అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ సామాజివర్గాలకు హెయిర్ కట్ చేశారన్న అక్కసుతో మైసూరు జిల్లాలోని నంజనాగుడు తాలూకాలోని బార్బర్ కుటుంబాన్ని బాయ్‌కాట్ చేసిన ఉదంతం కర్నాటకలో చోటుచేసుకుంది. హల్లారే గ్రామానికి చెందిన మాల్లికార్జున శెట్టి కుటుంబం కటింగ్ సెలూన్ నడుపుకుంటోంది. చెప్పినా వినకుండా ఎస్టీ, ఎస్సీ సభ్యులకు జుట్టు కత్తిరించారంటూ కొందరు కుల దురహంకారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరిస్తున్నట్టు గ్రామ పెద్దలు ప్రకటించారు. అంతేకాదు ఏకంగా 50 వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. గతంలో కూడా రెండుసార్లు కుల వివక్షకు గురయ్యామని జరిమానా కూడా చెల్లించామంటూ బార్బర్ మాల్లికార్జున ఆవేదన వ్యక్తం చేశారు. తమ షాపును సందర్శించిన చన్నా నాయక్ తదితరులు దళితులకు ఎక్కువ చార్జ్ వసూలు చేయాలని గతంలో ఆదేశించారని ఆరోపించారు. దీనికి తాము అంగీకరించకపోవడంతో తమ కుమారుడిని కొట్టి, బెదిరించి మరీ అతడినుంచి 5 వేల రూపాయలను లాక్కుపోయారని తెలిపారు. దళితుడికి హెయిర్ కట్ చేయడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ ఘటనపై అధికారులకు పిర్యాదు చేశామన్నారు. ఈ హింస ఆపకపోతే, తమకు న్యాయం జరగకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని పేర్కొన్నారు. మరోవైపు దీనిపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆధునిక నాగరిక సమాజంలో జాతి, కుల, మతం అటూ విద్వేషాన్ని వెళ్లగక్కడం శోచనీయమని మండిపడుతున్నాయి. ఇంకా దళితులు, అంటరాని వారు అంటూ వివక్ష, సంఘ బహిష్కారం లాంటి ఘటనలు అమానవీయమైవనవీ, అధికారులు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. -
‘ఎన్నాప్పా.. సౌక్కియమా’..
సాక్షి, చెన్నై: పదో తరగతి కూడా చదవలేదు. బతుకు బండి లాగేందుకు అతను చేసేది క్షవరవృత్తి. అయితేనేం ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ అతడితో సంభాషించారు. ప్రశంసల వర్షం కురిపించారు. అతని జీవితంలోని భిన్నమైన కోణానికి మరింత స్పూర్తి నింపారు. వివరాల్లోకి వెళితే... తూత్తుకూడికి చెందిన పొన్ మారియప్పన్ జీవనోపాధి కోసం మిల్లర్‌పురంలో సెలూన్ ప్రారంభించాడు. కానీ లోలోపలే ఉన్నతవిద్య చదువుకోలేదనే అంతర్మధనంతో సతమతమయ్యేవాడు. చదువంటే పాఠ్యపుస్తకాలే కాదు లోకజ్ఞానం కూడా అని భావించాడు. పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. తనలాంటి వారి కోసం తన సెలూన్‌ను ఒక గ్రంథాలయంగా మార్చేశాడు. ఈ ప్రయత్నం స్థానికులనే కాదు ప్రధాని నరేంద్రమోదీనే ఆకర్షించింది. “మన్‌కీ బాత్’ కార్యక్రమంలో మారియప్పన్‌తో ఇటీవల పధాని మోదీ సంభాషించి మెచ్చుకోవడంతో అతని ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఈ ఆనందానుభూతి అతడి మాటల్లోనే... ‘తూత్తుకూడి ఆలిండియా రేడియో స్టేషన్ వారు ఒక రోజు నన్ను అకస్మాత్తుగా తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. నా గురించి అప్పటికే అందరికీ తెలిసి ఉండడంతో అరుదైన పుస్తకాలు ఇస్తారేమోననే ఆలోచనతో వెళ్లాను. అయితే రేడియో స్టేషన్ ఉన్నతాధికారులు నా వద్దకు వచ్చి ప్రధాని మోదీ మీతో మాట్లాడుతారని చెప్పడంతో బిత్తరపోయాను. మన్‌కీ బాత్ ద్వారా ప్రధాని మోదీ ముందుగా నా క్షేమ సమాచారాలు తమిళంలోనే అడిగి తెలసుకుని సంభాషించడంతో ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. సెలూన్‌ను పుస్తకాలతో గ్రంథాలయంగా మార్చడం ద్వారా ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్నాను. అయితే ప్రధానితో మాట్లాడిన తరువాత ఇంకా ఎంతో సాధించాలనే తపన పెరిగింది. నీకు బాగా నచ్చిన గ్రంథం ఏదని మోదీ అడిగినప్పుడు తిరుక్కురల్ అని చెప్పాను. (విషమంగా వ్యవసాయశాఖ మంత్రి ఆరోగ్యం) 8వ తరగతితో చదువు మానేసి 2014లో సెలూన్‌ను ప్రారంభించాను. పుస్తక పఠనాన్ని పెంచాలనే ఉద్దేశంతో 2015లో సెలూన్లో గ్రంథాలయం పెట్టాను. గ్రంథాల్లోని ముఖ్యమైన అంశాలను వివరిస్తూ హెయిర్ కటింగ్, షేవింగ్ చేయడం ద్వారా పలు సామాజిక విషయాలపై ఎంతో మందిలో చైతన్యం తీసుకొచ్చాను. ప్రస్తుతం నా గ్రంథాలయంలో 1,500లకు పైగా పుస్తకాలున్నాయి. సెలూన్‌కు వచ్చే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగంగా మారింది. విద్యార్థులకు రాయితీపై సెలూన్ సేవలు అందిస్తున్నాను. నాకు అమ్మ, నాన్న, భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఉమ్మడి కుటుంబంగా అందరం ఒకే చోట ఉంటాం. నేను చేసిన ఒక సాధారణ ప్రయత్నానికి ప్రధాని ప్రశంస లభించడం ఎంతో ఆనందంగా ఉందని’ తెలిపాడు. -
సొంతంగా క్షవరాలు.. ఉపాధి పాయే..
ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు వలస కూలీలు. ఇతర రాష్ట్రం నుంచి భువనగిరికి మూడు నెలల క్రితం వలస వచ్చారు. క్షౌరశాలలు మూత పడడంతో తోటి కూలీకి సహచరుడే కటింగ్ చేశాడు. రాజాపేట : లాక్డౌన్ నేపథ్యంలో జిల్లాలోని నాయీబ్రాహ్మణుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్షౌరశాలలు మూతపడడంతో జీవనోపాధి కోల్పోయి కుటుంబాలు గడవడమే గగనంగా మారింది. ఇళ్లలోకి వెళ్లి క్షౌరం చేద్దామన్నా కరోనా వైరస్ వ్యాప్తి భయంతో ఎవరూ రానించే పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నా ఎక్కడా పని దొరకడం లేదు. దాదాపు నలబై రోజులుగా షాపులు మూతపడడంతో కరెంట్ బిల్లు, అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఇలా.. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో సుమారు రెండు వేల వరకు చిన్న, పెద్ద క్షౌరశాలలు ఉన్నాయి. వీటిలో 3,500 వరకు నాయీ బ్రాహ్మణులు పని చేస్తున్నారు. వీరిపై ఆధారపడి మరో 10వేల మంది జీవనం సాగిస్తున్నారు. ఒక్కో నాయీ బ్రాహ్మణుడు పట్టణ ప్రాంతాల్లోనైతే రూ.500నుంచి రూ.700 వర కు సంపాదిస్తుంటాడు. మండల కేంద్రాల్లో ఒక్కరి సంపాదన రూ.300 వరకు ఉంటుంది. ఇక షాప్ యజమానికి.. వర్కర్స్కు రోజువారీ కూలి సగం పోను మిగతా ఆదాయమంతా మిగులుతుంది. క్షౌరశాలలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆయా కుటుంబాలు లౌక్‌డౌన్‌తో సెలూన్లు మూతపడడంతో ఒక్కసారిగా ఉపాధి కోల్పోయారు. లాక్‌డౌన్‌ను మరికొంతకాలం పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో జీవనోపాధిపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు చేయూతనిచ్చేవారు కరువయ్యారని, ప్రభుత్వం దయతలచి ఆదుకోవాలని నాయీబ్రాహ్మణులు వేడుకుంటున్నారు. సొంతంగా క్షవరాలు.. లాక్డౌన్ కారణంగా క్షౌరశాలలు మూతపడడంతో జనం జుట్టు, గడ్డాలు పెంచుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చాలా మందికి ఇళ్లలోనే గడ్డం చేసుకునే అలవాటు ఉండడంతో ఆ సమస్యమీ లేదు. కానీ, జుట్టు పెరగడంతో బయటకు రాలేకపోతున్నారు. కరోనా వైరస్ భయంతో నాయీబ్రాహ్మణులను ఇళ్లకు పిలిపించుకోలేని పరిస్థితి. దీంతో కొందరు గత్యంతరం లేక ఇళ్లలోనే తమతో పాటు తమ పిల్లల కు అడ్డదిడ్డంగా హెయిర్ కటింగ్ చేసుకుంటున్నారు. దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నాం కరోన ప్రభావంతో క్షౌ రశాలలు మూతపడ్డాయి. ఉపాధి లేక నాయీబ్రాహ్మణులు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్ర త్యామ్నాయ పనులు దొరకడం లేదు. కుటుంబపోషణ భారంగా మారింది. నెల తిరిగేసరికి షాపులు అద్దె మీద పడుతుంది. ఉన్న పరిస్థితుల్లో అద్దె చెల్లించలేకపోతున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి.–ఎన్.కరుణాకర్, సింగారం -
ఉత్తమం చెట్టు కింద క్షవరం
కర్ణాటక: కరోనా వైరస్ మానవ జీవన శైలిని మార్చేస్తోంది. లాక్డౌన్ నిత్యకృత్యమైంది. పరాయివారితో పలకరింపులు, కరచాలనాలు బంద్ అయ్యాయి. సినిమాలు, షికార్లు లేవు. కేశ సంస్కారానికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. క్షౌరశాలల వైపు జనం వెళ్లడం లేదు. ఈ తరుణంలో కలబురిగి నగర శివార్లలో ఓ క్షురకుడు చెట్టు కిందే సేవలందిస్తున్న దృశ్యం. తమ వంతు కోసం వేచిచూస్తున్న మరికొందరు కస్టమర్లు -
ఎక్కువ కాలం బార్బర్ షాపుల మూత!
న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా హేర్ డ్రెస్సర్స్, బ్యూటీ పార్లర్లు ఏడాది పాటు తెరచుకోకుండా మూత పడినట్లయితే హాలీవుడ్ చిత్రాలైన క్యాప్టెన్ కేవ్మెన్, క్యాస్ట్ అవేలో హీరోల్లాగా పాశ్చాత్య ప్రజలకు జుట్లు, మీసాలు, గడ్డాలు బారుగా పెరగి పోతాయి. భారత్‌లో సాధువులు, సన్యాసుల్లాగా కనిపిస్తారు. ఈ ప్రమాదం కచ్చితంగా పొంచి ఉందని లండన్‌లోని ‘గవర్నమెంట్స్ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీస్ (సేజ్) హెచ్చరించింది. కరోనా వైరస్ మంగళి షాపుల ద్వారా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్నందున వాటిపైన నిషేధం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉందని సేజ్ వెల్లడించింది. లాక్‌డౌన్‌ను హఠాత్తుగా ఒకేసారి కాకుండా ప్రాథమ్యాలను బట్టి ఒక్కొక్కటి చొప్పున క్రమంగా ఎత్తివేయాలని సూచించింది. లాక్డౌన్ ఎత్తివేతలో భాగంగా మంగళి షాపులను కూడా తెరచినట్లయితే మరోసారి కరోనా వైరస్ దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఇంగ్లండ్ ప్రజారోగ్య నిపుణులు, మంత్రులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ కాలం హేర్ డ్రెస్సర్స్ షాపులను మూసి ఉంచాల్సిన అవసరం వస్తే వారిని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవాలని, షాప్‌లను తెరచినట్లయితే తమ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని నేషనల్ హేర్ అండ్ బ్యూటీ ఫెడరేషన్ సీఈవో హిలరీ హాల్ తెలిపారు. -
కత్తెర పడితేనే కడుపు నిండేది..
జనగామ: కరోనా మహమ్మారి రోజువారి కూలీలు, చిరు వ్యాపారులతో పాటు పేద, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పనిచేస్తేనే పూటగడిచే పరిస్థితుల్లో లాక్డౌన్ కష్టాల పాలు చేస్తుంది. 23 రోజులుగా దుకాణాలు మూసి వేసుకుని, ఇంటిపట్టునే ఉంటున్న నాయీ బ్రాహ్మణుల దీన స్థితిపై కథనం. జిల్లాలోని 281 గ్రామాల్లో సుమారుగా వెయ్యికి పైగా కుటుంబాలు ఉన్నాయి. ఇందులో జిల్లా కేంద్రంలో 300, 12 మండలాల పరిధిలో మరో 700 కుటుంబాలు హెయిర్ కటింగ్ సెలూన్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఒక్క జిల్లా కేంద్రంలోనే 120 కటింగ్ షాపులు ఉన్నాయి. పల్లె నుంచి పట్టణం వరకు రోజువారి సంపాధనతో బతుకుతున్న వీరిపై కరోనా పిడుగు కోలుకో లేకుండా చేస్తుంది. లాక్డౌన్లో కిరాణా, మెడికల్ దుకాణాలు మినహా మిగతా వ్యాపార సముదాయాలన్నీ లాక్డౌన్ పరిధిలోకి రావడంతో హెయిర్ కటింగ్ సెలూన్లు మూతబడ్డాయి. దీంతో రోజువారి సంపాధనను కోల్పోయిన కార్మికులు, కుటుంబాల పోషణ దేవుడెరుగు, దుకాణాల అద్దె కూడా చెల్లించలేని దయనీయ స్థితిలో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. రూ.200 నుంచి రూ.1000 వరకు సంపాధించే నాయీబ్రాహ్మణ కార్మికులు...ఆపన్న హస్త కోసం ఎదురు చూస్తున్నారు. కటింగ్, గడ్డాలు చేసుకునే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో హెయిర్ కటింగ్ సెలూన్లకు మినహాయింపు ఇవ్వడం లేదు. ప్రైవేటు పని దొరక్క.. తెల్లవారింది లేచింది మొదలుకుని రాత్రి 11గంటల వరకు కత్తెర ఆడిస్తూ, బతుకు బండిని లాగిన నాయీ బ్రాహ్మణులు నేడు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. కులవృత్తి లాక్డౌన్ కాగా, మరో పనికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా కరోనా వైరస్ కట్టడి చేస్తుంది. ఈ నెల 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం, మే 3వ తేదీ వరకు కేంద్రం లాక్డౌన్ పొడగించడంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నా రు. ప్రభుత్వం తమ ను ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి కరోనా కట్టడికి జిల్లాలో నాయీ బ్రాహ్మణులు నిబద్ధతతో లాక్‌డౌన్‌ను విజయ వంతం చేస్తున్నాం. రోజువారి సంపాధన కోల్పోవడంతో కుటుంబాలు గడిచే పరిస్థితి లేకుండా పోయింది. ఇంటి, దుకాణం అద్దెలు చెల్లించేందుకు మూడు మాసాల గడువు ఇప్పించాలి. కరెంటు బిల్లు కూడా భారంగా మారుతుంది. – కొత్తపల్లి అభినాష్,నాయీ బ్రాహ్మణ కార్మికుడు, బాణాపురం అద్దె చెల్లించలేని దుస్థితి లాక్డౌన్లో దుకాణం అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రతిరోజూ పని చేస్తే వచ్చే సంపాధనతోనే కుటుంబాలను పోషించుకున్నాం. 23 రోజులుగా దుకాణాలు మూసి వేయడంతో ఇబ్బందిగా ఉంది. – కొండూరి కుమారస్వామి,కార్మికుడు, జనగామ -
ఆర్ధిక ఇబ్బందుల్లో ఆర్టీసీ కార్మికులు
-
ఆ రికార్డు ఈరోజు బద్దలైంది: సచిన్
ముంబై: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘బార్బర్ షాప్ గాల్స్’ జ్యోతికుమారి, నేహలను కలుసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. కుటుంబాన్ని పోషించేందుకు అబ్బాయిల్లా మారి సెలూన్ నడిపిస్తున్న వీరికి జిల్లెట్ స్కాలర్షిప్ను సచిన్ అందజేశారు. అంతేకాదు వారితో స్వయంగా షేవింగ్ చేయించుకుని మురిసిపోయారు. ఈ ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. (చదవండి: నాన్నకు వారసులు) ‘ఎవరి ముందు షేవింగ్ చేయించుకోవడానికి నేను ఇష్టపడను. కానీ ఈరోజు రికార్డు చెరిగిపోయింది. జ్యోతికుమారి, నేహలను కలుసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. వీరికి జిల్లెట్ స్కాలర్షిప్ అందజేశాన’ని సచిన్ ట్వీట్ చేశారు. గోరఖ్‌పూర్ నగరానికి సమీపంలోని భన్వారీతోలి గ్రామానికి చెందిన జ్యోతి, నేహ జీవన పోరాటం గురించి మీడియాలో ప్రముఖంగా రావడంతో జిల్లెట్ సంస్థ వీరిని ఆదుకునేందుకు వచ్చింది. వీరిద్దరిపై లఘు చిత్రాన్ని కూడా రూపొందించింది. A First for me! You may not know this, but I have never gotten a shave from someone else before. That record has been shattered today. Such an honour to meet the #BarbershopGirls and present them the @GilletteIndia Scholarship.#ShavingStereotypes#DreamsDontDiscriminate pic.twitter.com/DNmA8iRYsb — Sachin Tendulkar (@sachin_rt) May 3, 2019 -
వెంటాడి.. వేటాడి...
యువకుడి దారుణ హత్య ► బార్బర్ షాపులోనే దారుణం ► తాడిపత్రిలో కలకలం తాడిపత్రి: తాడిపత్రిలో కలకలం రేగింది. ఓ యువకుడ్ని ప్రత్యర్థులు వెంటాడి.. వేటాడారు. మంగళిషాపులోకి వెళ్లి తలదాచుకున్నా వదల్లేదు. అక్కడే కత్తులతో కసితీరా పొడిచి పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం... తాడిపత్రి టైలర్స్‌కాలనీలో నివాసం ఉండే నరసింహ(28)ను ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి ఆదివారం సాయంత్రం హత్య చేశారు. జులాయిగా తిరిగే నరసింహ నంద్యాల రోడ్డులో వెళ్తుండగా వెనుక వైపు నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు అతనిపై మొదట రాడ్లతో దాడి చేశారు. వారి నంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి ఓ మంగళషాపులోకి వెళ్లినా వదల్లేదు. షాపులోనే అతనిపై కత్తుల తో దాడి చేసి పరారయ్యరు. తీవ్రంగా యపడిన నరసింహాను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా కాసేపటికే మరణించాడు. హత్యకు గల కారణాలు, హంతకులు ఎవరనే విషయం తెలియడం లేదు. డీవైఎస్పీ చిదానందరెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ రామకృష్ణారెడ్డి తమ సిబ్బందితో కలసి నరసింహ మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.