వెంటాడి.. వేటాడి...
యువకుడి దారుణ హత్య
► బార్బర్ షాపులోనే దారుణం
► తాడిపత్రిలో కలకలం
తాడిపత్రి: తాడిపత్రిలో కలకలం రేగింది. ఓ యువకుడ్ని ప్రత్యర్థులు వెంటాడి.. వేటాడారు. మంగళిషాపులోకి వెళ్లి తలదాచుకున్నా వదల్లేదు. అక్కడే కత్తులతో కసితీరా పొడిచి పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం... తాడిపత్రి టైలర్స్‌కాలనీలో నివాసం ఉండే నరసింహ(28)ను ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి ఆదివారం సాయంత్రం హత్య చేశారు. జులాయిగా తిరిగే నరసింహ నంద్యాల రోడ్డులో వెళ్తుండగా వెనుక వైపు నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు అతనిపై మొదట రాడ్‌లతో దాడి చేశారు.
వారి నంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి ఓ మంగళషాపులోకి వెళ్లినా వదల్లేదు. షాపులోనే అతనిపై కత్తుల తో దాడి చేసి పరారయ్యరు. తీవ్రంగా యపడిన నరసింహాను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా కాసేపటికే మరణించాడు. హత్యకు గల కారణాలు, హంతకులు ఎవరనే విషయం తెలియడం లేదు. డీవైఎస్పీ చిదానందరెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తమ సిబ్బందితో కలసి నరసింహ మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.