
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని బార్బర్ షాపులో గడ్డం ట్రిమ్మింగ్ చేయించుకున్నారు. తనకు ట్రిమ్మింగ్ చేసిన దుకాణం యజమాని అజిత్‌తో మాట్లాడారు. నిత్య జీవితంలో ఆయన ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. తనకు మిగిలిందేమీ లేదంటూ అజిత్ కన్నీరు పెట్టుకున్నాడని రాహుల్ ఆవేదన చెందారు.
పెరుగుతున్న ద్రోవ్యోల్బణం, తగ్గుతున్న ఆదాయాలు పేద, మధ్య తరగతి ప్రజల సొంత దుకాణం, సొంతిల్లు కలిగి ఉండాలని, ఆత్మగౌరవంతో బతకాలన్న వారి కలలను కల్లలు చేశాయన్నారు. ‘ఇటువంటి వారి సమస్యలకు ఆధునిక పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఉంది. వీరి ఆదాయం, పొదుపులను పెంచాలి. నైపుణ్యం కలవారికి తగు ప్రతిఫలం దక్కాలి’అని రాహుల్ పేర్కొన్నారు.
– న్యూఢిల్లీ