beard shaving
-
బార్బర్ షాపులో రాహుల్!
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని బార్బర్ షాపులో గడ్డం ట్రిమ్మింగ్ చేయించుకున్నారు. తనకు ట్రిమ్మింగ్ చేసిన దుకాణం యజమాని అజిత్‌తో మాట్లాడారు. నిత్య జీవితంలో ఆయన ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. తనకు మిగిలిందేమీ లేదంటూ అజిత్ కన్నీరు పెట్టుకున్నాడని రాహుల్ ఆవేదన చెందారు. పెరుగుతున్న ద్రోవ్యోల్బణం, తగ్గుతున్న ఆదాయాలు పేద, మధ్య తరగతి ప్రజల సొంత దుకాణం, సొంతిల్లు కలిగి ఉండాలని, ఆత్మగౌరవంతో బతకాలన్న వారి కలలను కల్లలు చేశాయన్నారు. ‘ఇటువంటి వారి సమస్యలకు ఆధునిక పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఉంది. వీరి ఆదాయం, పొదుపులను పెంచాలి. నైపుణ్యం కలవారికి తగు ప్రతిఫలం దక్కాలి’అని రాహుల్ పేర్కొన్నారు. – న్యూఢిల్లీ -
గడ్డం కావాలా? గర్ల్ ఫ్రెండ్ కావాలా? రోడ్డెక్కిన కాలేజీ అమ్మాయిలు
ఎలాంటి భర్త కావాలి? లేదా ఎలాంటి భార్య కావాలి? అని పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెద్దలు అడగడం సాధారణం. అలాగే నాకు ఎర్రగా, బుర్రగా ఉన్న అమ్మాయి కావాలి అని అబ్బాయిలు, ఆరడుగులుంటాడా? ఆరెంకెల జీతం ఉందా? అని అమ్మాయిలు ఆశపడటం చాలా కామన్. కానీ ఇపుడు ట్రెండ్‌మారింది అంటున్నారు ఇండోర్ యువతులు. అంతేకాదు ఏకంగా ‘మాకొద్దీ గడ్డం బూచోళ్లు’,‘నో క్లీన్ షేవ్.. నో గర్ల్‌ఫ్రెండ్' అంటూ రోడ్డుమీద కొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడమే కాదు. ఫ్యాషన్‌గా గెడ్డం పెంచుకుంటున్న పెళ్లి కాని ప్రసాదుల గుండెల్లో బాంబు పేల్చింది.ఇండోర్‌లో కొందరు కాలేజీ యువతులు 'గడ్డం తొలిగించండి.. ప్రేమను కాపాడండి' అనే నినాదంతో యువతులు ర్యాలీ తీశారు. ముఖాలకు గడ్డం మేకప్ వేసుకొని మరీ అబ్బాయిల గడ్డం విషయమై ర్యాలీ తీయడం హాట్ టాపిక్‌గా నిలిచింది., ‘గడ్డం రఖో యా జిఎఫ్ రఖో’(గడ్డం కావాలా? గర్ల్‌ఫ్రెండ్‌కావాలా), 'గడ్డం హటావో ప్యార్ బచావో' నినాదాలతో వీధుల్లోకి వచ్చారు. 'నో క్లీన్ షేవ్.. నో లవ్', 'నో క్లీన్ షేవ్.. నో గర్ల్‌ఫ్రెండ్' అనే ప్లకార్డులతో తీసిన ర్యాలీ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను ఓ 'ఎక్స్' (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు.వారి డిమాండ్ కరెక్టేగా కనీసం వారానికి ఒకసారైనా క్లీన్ షేవ్ కాకున్నా కనీసం ట్రీమ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మనం ఎలుగుబంటిలా కాకుండా జెంటిల్మెన్లా ఉంటాం అంటూ కామెంట్ చేయడం విశేషం. మరికొందరు దీని వెనుకున్న మతలబు ఏంటి భయ్యా అంటూ దీర్ఘాలోచనలో పడిపోయారు.ఇదీ చదవండి: నిద్రపోనివ్వని కల అంటే ఇదే! శభాష్ మల్లవ్వ! కాగా పురుషులు గడ్డాలతో అందంగా కనిపిస్తారా లేదా గడ్డం లేకపోతే అందంగా కనిపిస్తారా? అనేది పెద్ద చర్చే. గడ్డాలున్న పురుషులనే మహిళలు ఇష్టపడతారని అనేక అధ్యయనాలు చెబుతున్నప్పటికీ, క్లీన్ షేవ్ మెన్ మరింత ఆకర్షణీయంగా ఉంటారని మరికొందరి వాదన.Clean shave ke liye ladkiyon ne kiya kalesh🤯 pic.twitter.com/QkmIROdDyk— Ghar Ke Kalesh (@gharkekalesh) October 17, 2024 -
గడ్డం తీయాలని వరుడు తండ్రి.. తీయొద్దని వధువు!
పెరిగిన గడ్డం ఓ వరుడి పాలిట శాపంగా మారింది. కొన్ని గంటలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ వరుడికి అతడి తండ్రే విలన్ అయ్యాడు. తాను నీట్‌గా షేవింగ్ చేసుకుని రమ్మంటే, వధువు మాటలు విని గడ్డం ట్రిమ్ చేసుకుని వచ్చిన తనయుడిపై కన్నెర్ర చేసిన ఆ తండ్రి ఏకంగా వివాహాన్ని ఆపేశాడు. సంచలనం కలిగించిన ఈ వినూత్న వివాదాన్ని మీరూ చదవండి.. సాక్షి, చైన్నె: కోయంబత్తూరు నగరం పరిధిలోని సూలూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త తన కుమారుడికి వివాహ ఏర్పాట్లు చేశాడు. మూడు నెలల క్రితం పొల్లాచ్చి ప్రాంతానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. ఇరు వర్గాల పెద్దలు మూడు నెలలుగా పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తనకు కాబోయే భార్యతో ఆ పారిశ్రామికవేత్త తనయుడు నిత్యం ఫోన్లో బీజీ కూడా అయ్యాడు. ఈ పరిస్థితుల్లో ఆ వరుడు నిత్యం గడ్డంతో కనిపించే వాడు. పెళ్లి సమయానికి గడ్డం తీసి వేసి నీట్‌గా షేవింగ్ చేసుకోవాలని తండ్రి సూచిస్తూ వచ్చాడు. ఆ మేరకు పెళ్లి గడియల సమయం ఆసన్నమైంది. సోమవారం వివాహం బ్రహ్మాండంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం తండ్రి ఆదేశాల మేరకు బ్యూటీ ఫార్లర్కు వెళ్లి తన గడ్డం తొలగించి నీట్‌గా షేవింగ్ చేసుకునేందుకు వరుడు వెళ్లాడు. అయితే బ్యూటీ ఫార్లర్లో ఏమి జరిగిందో ఏమోగానీ, గడ్డంను ట్రిమ్ చేసుకుని ఇంటికి వచ్చిన తనయుడిని చూసిన తండ్రి ఆగ్రహానికి లోనయ్యాడు. షేవింగ్ ఎందుకు చేసుకోలేదంటూ ప్రశ్నించాడు. వధువుకు నచ్చినందుకేనా. తనకు కాబోయే భర్త గడ్డంతోనే పెళ్లి పీటలు ఎక్కాలని, కాస్త ట్రీమ్ చేసుకుంటే చాలని వధువు సూచించినట్లు తండ్రికి.. వరుడు సమాధానం చెప్పాడు. ఈ సమాధానం తండ్రిని చిర్రెత్తుకొచ్చింది. ఇప్పుడే నాకు గౌరవం ఇవ్వడం మానేసినట్టున్నావ్..? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గడ్డం తీస్తేనే పెళ్లి అని తేల్చి చెప్పేశాడు. దీంతో ఎవరి మాట వినాలో అయోమయంతో తల్లడిల్లిన ఆ తనయుడు చివరకు తండ్రిని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. అయితే, ఏమాత్రం వెనక్కి తగ్గని ఆ తండ్రి తన సామాజిక మాధ్యమాల్లో సోమవారం జరగాల్సిన తన కుమారుడి వివాహం ఆగిందని, ఎవ్వరూ రావాల్సిన అవసరం లేదని ప్రకటించేశాడు. ఇది వధువు కుటుంబం దృష్టికి చేరడంతో వరుడి ఇంటికి పరుగులు తీశారు. తాను చెప్పినట్టుగా గడ్డం తొలగించకుండా వధువు చెప్పినట్టుగా ట్రిమ్ చేసుకొచ్చిన తనయుడు పరిస్థితిని వారికి వివరించాడు. బంధువులు, వధువు కుటుంబం బుజ్జగించినా ఆ తండ్రి ఏమాత్రం తగ్గక పోవడం ఉదయం జరగాల్సిన వివాహం ఆగిపోయింది. కాగా తన కంపెనీలోని కార్మికులే గడ్డం పెంచితే తాను ఒప్పుకోనని.. అలాంటిది కొడుకే ఈ నియమాన్ని ఉల్లంఘించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సదరు తండ్రి చెప్పడం కొసమెరుపు. ఈ విషయం మీడియాకి తెలియడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
Beard Shaving: రోజూ షేవింగ్ చేసుకునే అలవాటు ఉందా? అయితే..
ప్రస్తుత కాలంలో నున్నగా షేవ్ చేసుకునే వారికంటే నిండుగా గడ్డం పెంచుకునే వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. గడ్డం పెంచుకోవడం... లేదా రెగ్యులర్‌గా షేవింగ్ చేసుకోవడం... ఎవరిష్టం వాళ్లది. అయితే రోజూ షేవింగ్ చేసుకోవడం వల్ల కొన్ని లాభాలున్నాయి. అవేంటో చూద్దాం.. కొన్ని ఇంటర్వ్యూలకు హాజరయ్యేటప్పుడు నీట్‌గా షేవింగ్ చేసుకుని రమ్మనడం మామూలే. మిలటరీలో అయితే రెగ్యులర్ షేవింగ్ తప్పనిసరి. ఇంతకీ రెగ్యులర్ షేవింగ్ లాభాలేమిటంటారా... అక్కడికే వస్తున్నాం.... ►షేవింగ్ చేసుకోవడం వల్ల యంగ్‌గా... ఎనర్జిటిక్‌గా కనిస్తారు. ముఖంపై ఉండే జుట్టు శుభ్రపడుతుంది. ►ఇది చర్మ సమస్యలను కొన్నింటిని తగ్గిస్తుంది. అలాగే చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది. ►షేవింగ్‌కు సంబంధించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఉదయం నిద్రలేచి షేవింగ్ చేసుకునే వారు మరింత ఉత్సాహంగా ఉంటారట. బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి.. ►అలాగే పనులకు వెళ్లే వారు ఉదయాన్నే షేవ్ చేసుకోవడం వల్ల ఆ పనిని సక్రమంగా.. మరింత సామర్థ్యంతో పనిచేస్తారని కొన్ని పరిశోధనలలో తేలింది. ►గడ్డంలో ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఇది చర్మాన్ని పాడుచేస్తుంది. దీంతో ముఖంపై మచ్చలు ఏర్పతాయి. రోజూ షేవింగ్ చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా తొలగిపోతుంది. ►షేవింగ్ చేసేటప్పుడు ఉపయోగించే ప్రీషేవ్ ఆయిల్, షేవింగ్ క్రీమ్, జెల్ లేదా బామ్ వంటివన్నీ మీ చర్మ పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. చదవండి: Hair Fall Control: అల్లం, ఆవాలు, లవంగాలతో.. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా! Health Tips: తరచు ఒళ్లు నొప్పులా? కారణాలు తెలుసుకోండి.. అంతేగానీ వెంటనే టాబ్లెట్ వేసుకుంటే! -
Anand Mahindra: తాలిబన్ల ఇలాకాలో ఆ ఛాన్స్ వస్తేనా..
కఠిన ఆంక్షలు, నిషేధాజ్క్షలతో ఒకప్పుడు తాలిబన్లు అఫ్గన్లకు ప్రత్యక్ష నరకం చూపించారు. మళ్లీ వాళ్ల పాలనలో భయంభయంగానే గడపాల్సి వస్తోంది అక్కడి ప్రజలు. పైకి అంతర్జాతీయ సమాజానికి మాత్రం ఒకలా సందేశం ఇస్తూ.. అంతర్గతంగా అసలు రంగును బయటపెట్టుకుంటున్నారు తాలిబన్లు ఇప్పుడు. మాట కాదన్నా.. ఎదురు తిరిగినా ఉరి తీసి వేలాడేస్తున్నారు. తాజాగా మగాళ్లు గడ్డం గీసుకోవడం నేరమంటూ ఫత్వా జారీ చేసిన తాలిబన్లు, బార్బర్లు, సెలూన్ నిర్వాహకుల జీవనోపాధిపై పెద్దదెబ్బే వేశారు. ఈ నేపథ్యంలో కొందరు దుకాణాలు మూసేసుకుంటుండగా.. తెగిస్తున్న కొందరికి చావు బెదిరింపులు అందుతున్నాయట. అయితే సమకాలీన అంశాలపై నిత్యం స్పందించే మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. ఈ సీరియస్ పరిణామంపై తనదైన శైలిలో ఓ ట్విటర్ పోల్ నిర్వహించారు. ఒకవేళ మీరు గనుక అఫ్గనిస్తాన్‌లో ఓ షేవింగ్ రేజర్ కంపెనీ సేల్స్ పర్సన్ అయ్యి ఉంటే.. ప్రస్తుత పరిణామాలలో ఏం చేస్తారు? అంటూ నాలుగు ఆఫ్షన్లు ఇచ్చారాయన. ఒకటి.. బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఎయిర్‌పోర్ట్‌కు తిరుగు టపా కట్టడం, రెండు.. ఆ ఆదేశాల్ని మార్చేలా లాబీయింగ్ చేయడం, మూడు.. గడ్డం సంరక్షణ కోసం కొత్త ప్రొడక్ట్‌ను కనుగొనడం, నాలుగు.. మీ ముందు ఇంకేమైనా మార్గం ఉందా? అని అడిగారు. అఫ్కోర్స్.. దానికి నెటిజన్స్ కూడా అంతే ఫన్నీగా రిప్లైలు ఇస్తున్నారనుకోండి. Imagine you’re a salesperson in Afghanistan for a Shaving Razor company, which of the following options would you pursue? 1) Pack your bags, head for the Airport 2) Lobby for a modification in this order 3) Invent a disruptive new product for beard-care 4) Other? https://t.co/MVIO9wUShu — anand mahindra (@anandmahindra) September 27, 2021 I will introduce new range of Beard care and essential… like Gillett did from sword to razor 🪒 — Saurabh Jain (@mrsaurabhj) September 27, 2021 Color for Beard -- time for Godrej to put up Hair Dye color factory :-) — Equiideas (@Equiideas09) September 27, 2021 Will take over and start manufacturer of gun 😃 — InduKalpa (ইন্দুকল্প) (@indukalp) September 27, 2021 Here we have options to choose But their they don't have any option They only have rules to follow 😜 — Sumit Koushik (@sumitkoushik1) September 27, 2021 ‘Others’ option includes hand cutting, limbs cutting & death by hanging from crane. So choose your option carefully if opting for OTHERS. — Devesh Dhingra (@Dev_Dh14) September 27, 2021 ఇదిలా ఉంటే అఫ్గన్ హెల్మండ్ ప్రావిన్స్‌లో మగవాళ్లు స్టైల్‌గా క్రాఫ్ చేయించుకోవడం, గడ్డం తీసేయడాన్ని నిషేధిస్తూ ఫత్వా జారీ చేసింది తాలిబన్ సంస్థ. అంతేకాదు ఇస్లామిక్ ఓరియెంటేషన్ మంత్రిత్వ శాఖ సెలూన్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి.. కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాదు ఆ ఆదేశాల్ని ఎదురు ప్రశ్నించడానికి వీల్లేదని కూడా పేర్కొంది. ఇక ఆ ఆదేశాల్లో సెలూన్లలో పాటల్ని ప్లే చేయకూడదనే నిబంధన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: మరో బాంబు పేల్చిన తాలిబన్లు -
వైరల్: గడ్డం గీయించుకోవాలని ప్రధాని మోదీకి రూ. 100 పంపాడు
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఎంతో మంది జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చింది. లాక్‌డౌన్‌తో ఇంట్లో కూర్చొని హాయిగా తింటూ కాలాన్ని గడిపేవారు కొందరైతే.. తినడానికి తిండి కూడా దొరక్క అల్లాడిపోతున్నవారు కోకొల్లలు. పేదవాడి పూట గడవడమే కష్టతరంగా మారింది. లాక్డౌన్ కష్టాలను ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలియజేయాలని ఆలోచించాడు. లాక్‌డౌన్‌తో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మహారాష్ట్రలోని బారామతికి చెందిన అనిల్ మోరే అనే వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రి ఎదురుగా టీ కొట్టు నడుపుతున్నాడు. లాక్‌డౌన్‌పై తన అసంతృప్తిని ప్రధానికి తెలియజేయాలని ఓ లేఖ రాశారు. అందులో గడ్డం గీసుకోమని సూచిస్తూ ప్రధాని మోదీకి రూ.100 పంపించాడు.‘ప్రధాని మోదీ గడ్డం బాగా పెంచుతున్నారు.. ఆయన ఇకపై ఏదైనా పెంచాలనుకుంటే, అది ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉండాలి.. దేశంలో వీలైనంత వేగంగా వ్యాక్సిన్ వేయించడానికై ఉంటే మంచిది.. వైద్య సదుపాయాలను పెంచడానికి ప్రయత్నాలు చేయాలి. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లాక్డౌన్లతో కలిగిన కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపై దృష్టి పెట్టాలి’ అని లేఖలో పేర్కొన్నాడు మోరే. అయితే దేశంలో ప్రధానమంత్రి స్థానం ఎంతో అత్యున్నతమైనదని, ప్రధాని మోదీ అంటే తన ఎంతో గౌరవం, అభిమానం అని చెప్పుకొచ్చాడు. తనును దాచుకున్న డబ్బుల్లో నుంచి ఆయనకు వంద రూపాయలు పంపుతున్నట్లు తెలిపాడు.. దానితో ఆయన గడ్డం గీయించుకోవాలి అని పేర్కొన్నాడు. అయితే. ప్రధానిని అవమానించడం, బాధపెట్టడం తన ఉద్దేశం కాదని, కరోనాతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు తెలియజేసేందుకే ఇలా చేసినట్టు తెలిపారు.అంతేగాక కోవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ .5 లక్షలు, లాక్దెడౌన్తో దెబ్బతిన్న కుటుంబాలకు రూ .30000 ఆర్థిక సహాయం అందించాలని పీఎంకు రాసిన లేఖలో మోర్ కోరాడు. ఈ విషయం ప్రస్తుతం వైరల్‌గా మారింది. చదవండి: ఆమెను చీరలో చూడాలి.. ఫేర్వెల్ చేసుకోనివ్వండి.. ప్రధానికి ట్వీట్ జూన్ 23లోగా జీవో అమల్లోకి తీసుకురావాలి: హైకోర్టు -
కేంద్ర మంత్రికి ట్రిమ్మింగ్ చేసిన తనయుడు
-
కేంద్ర మంత్రికి ట్రిమ్మింగ్ చేసిన తనయుడు
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో సామాన్యులే కాకుండా ప్రముఖులు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. తమలోని కొత్త కొత్త కళలను బయట పెడుతున్నారు. కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు, లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ కూడా తనలో ఉన్న కొత్త కళను బయటపెట్టారు. లాక్డౌన్ వేళ సెలూన్ షాపులు మూతపడటంటో ఇంట్లోనే తన తండ్రికి టిమ్మింగ్ చేశారు. ట్రిమర్ సాయంతో గడ్డం తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరాగ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘లాక్డౌన్ అనేది కష్టమైనదే.. కానీ ఇందులో కూడా కొన్ని వెలుగులు ఉన్నాయి. నాలో ఈ నైపుణ్యం ఉందని నాకు తెలియదు. కరోనాపై పోరాడి.. అందమైన జ్ఞాపకాలను ఏర్పరుచుకుందాం’అని చిరాగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. తండ్రికి సాయం చేసిన చిరాగ్‌పై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. -
గెడ్డం గీయించుకున్న హీరోయిన్
హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఏ చిన్న లోపం కూడా కనిపించకుండా తెరమీద వీలైనంత అందంగా కనిపించాలని చూస్తారు. అందుకోసం మేకప్ నుంచి మేకోవర్ వరకు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తుంటారు. హీరోయిన్లలో ఎవరికి వాళ్లకు వ్యక్తిగత మేకప్ మెన్ ఉంటారు. వాళ్లతో తమకు కావల్సినట్లుగా మేకప్ చేయించుకుంటూ ఉంటారు. బుజ్జిగాడులో సెకండ్ హీరోయిన్గా చేసి, నిన్న మొన్నటి సర్దార్ గబ్బర్‌సింగ్‌లో విలన్‌కు భార్యగా నటించిన సంజనా గల్రానీ కూడా ఇలాగే మేకప్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది. అయితే.. అందరిలా కేవలం మేకప్‌తోనే సరిపెట్టకుండా ఆమె గెడ్డం కూడా గీయించుకుంది!! అదేంటి, హీరోయిన్లు గెడ్డం గీయించుకోవడం ఏంటని మీకు అనుమానంగా వచ్చిందా? పురుషులకే కాదు, మహిళలలో కూడా కొంతమందికి ముఖం మీద అవాంఛిత రోమాలు వస్తుంటాయి. మామూలు వాళ్లు వాటిని పెద్దగా పట్టించుకోరు గానీ, సినిమా హీరోయిన్లు మాత్రం స్క్రీన్ మీద మెరిసిపోవాలనుకుంటారు కాబట్టి వాటిని పూర్తిగా తీయించేసుకుంటారు. కొంచెం పెరిగినా సరే.. వెండితెరమీద బాగోదన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు నీట్‌గా షేవ్ చేయించుకుంటారు. అలాగే సంజన కూడా తన వ్యక్తిగత మేకప్ మన్తో గెడ్డం గీయించుకుంది. ఎక్కడా చిన్న గాటు కూడా పడకుండా.. అలాగే రోమాలు ఏవీ మిగలకుండా జాగ్రత్తగా గీయాలంటూ అతడికి సూచనలు కూడా ఇచ్చింది. అంతా అయిపోయిన తర్వాత మరోసారి జాగ్రత్తగా చూసుకుని అప్పుడు సంతృప్తి పడింది. అయితే.. షేవింగ్ క్రీమ్ ఏదీ పూసుకోకుండానే ఆమె ఈ షేవింగ్ చేయించుకోవడం విశేషం.