కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో సామాన్యులే కాకుండా ప్రముఖులు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. తమలోని కొత్త కొత్త కళలను బయట పెడుతున్నారు. కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు, లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ కూడా తనలో ఉన్న కొత్త కళను బయటపెట్టారు. లాక్‌డౌన్ వేళ సెలూన్ షాపులు మూతపడటంటో ఇంట్లోనే తన తండ్రికి టిమ్మింగ్ చేశారు. ట్రిమర్ సాయంతో గడ్డం తొలగించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను చిరాగ్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘లాక్‌డౌన్ అనేది కష్టమైనదే.. కానీ ఇందులో కూడా కొన్ని వెలుగులు ఉన్నాయి. నాలో ఈ నైపుణ్యం ఉందని నాకు తెలియదు. కరోనాపై పోరాడి.. అందమైన జ్ఞాపకాలను ఏర్పరుచుకుందాం’అని చిరాగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. తండ్రికి సాయం చేసిన చిరాగ్‌పై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.