Ram Vilas Paswan
-
ఇల్లు ఖాళీ చేయండి.. లోక్‌సభ ఎంపీకి షాక్!
సాక్షి,న్యూఢిల్లీ: దివంగత ఎంపీ రామ్ విలాస్ పాశ్వాన్‌కు కేటాయించిన 12 జన్‌పథ్ బంగ్లాలో నివసిస్తున్న ఆయన కుమారుడు, లోక్‌సభ ఎంపీ చిరాగ్ పాశ్వాన్‌ను ఆ ఇంటి నుంచి ఖాళీ చేయాల్సిందిగా కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ ఇంటినే ప్రస్తుతం లోక్‌జనశక్తి పార్టీ తమ పార్టీ కార్యకలాపాల కోసం ఉపయోగించుకుంటోంది. దాదాపు 30 ఏళ్ల క్రితం నుంచి చిరాగ్ తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఈ ఇంట్లో నివసించారు. ఆయన గతేడాది అక్టోబర్‌లో మరణించారు. కాగా ఇల్లు మారాల్సిందిగా ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై చిరాగ్ పాశ్వాన్ స్పందించలేదు. ప్రస్తుతం ఈ ఇంట్లో రామ్ విలాస్ భార్య, చిరాగ్‌పాశ్వాన్ కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. -
‘నువ్వు నా రక్తం కావు; ఇక మీ బాబాయ్ చచ్చిపోయాడు’
వెబ్‌డెస్క్: మనం ఇతరులకు ఏం ఇస్తామో అదే తిరిగి వస్తుంది.. మంచి చేస్తే మంచి.. చెడు చేస్తే చెడు.. అవమానానికి అవమానం.. ప్రతీకారానికి ప్రతీకారం.. రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బాబాయ్ పశుపతి పరాస్తో తన వ్యవహార శైలి వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో ముందు వెళ్లి చేజేతులా తానే తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకునే విధంగా ప్రవర్తించాడని పేర్కొంటున్నారు. తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మరణించిన తర్వాత చిరాగ్ పూర్తిస్థాయిలో ‘లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)’ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, అప్పటివరకు తండ్రి నీడలో ఉన్న చిరాగ్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల(2020) సమయంలో తమతో పాటు ఎన్డీయేలో భాగస్వామి అయిన సీఎం నితీశ్ కుమార్‌తో విభేదించారు. కూటమి సమీకరణాలు పట్టించుకోకుండా సొంతంగా ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీతో సఖ్యతగా మెలుగుతూనే అధికార జేడీయూకు వ్యతిరేకంగా అభ్యర్థులను రంగంలోకి దింపారు. అయితే, ఈ ఎన్నికల్లో ఎల్జేపీ ఘోరంగా విఫలమైనప్పటికీ, జేడీయూ ఓట్లను మాత్రం చీల్చగలిగింది. దాదాపు 35 స్థానాల్లో సీట్లకు గండికొట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి పరిణామాల వెనుక కచ్చితంగా జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హస్తం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. తమను దెబ్బకొట్టిన చిరాగ్‌కు తమ సత్తా ఏంటో చూపించాలనే ఉద్దేశంతోనే పశుపతి పరాస్తో తిరుగుబాటు చేయించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పశుపతి మాత్రం ఈ వార్తలను కొట్టిపడేశారు. ఎల్జేపీని పరిరక్షించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. తనతో సహా ఐదుగురు ఎంపీల తమ బృందం ఎన్డీయేలో కొనసాగుతుందని కుండబద్దలుకొట్టారు. నువ్వు నా రక్తం కావు.. ఈ నేపథ్యంలో... చిరాగ్‌కు, పశుపతికి మధ్య చెలరేగిన విభేదాలు తారస్థాయికి చేరడంతోనే ఎల్జేపీలో చీలిక వచ్చిందన్న విషయం సుస్పష్టమవుతోందని వారి సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా తండ్రి మృతి తర్వాత చిరాగ్, బాబాయ్ పశుపతిని తీవ్రంగా అవమానించారని పేర్కొంటున్నారు. ఒకానొక సమయంలో.. తన తల్లి రీనా పాశ్వాన్, కజిన్ ప్రిన్స్ రాజ్, అతడి అనుచరుడు సౌరభ్ పాండే ముందే.. ‘‘నువ్వు నా రక్తం కానేకాదు’’ అంటూ వ్యాఖ్యానించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. చిరాగ్ మాటలతో మనోవేదనకు గురైన పరాస్.. ‘‘ఈరోజు నుంచి మీ బాబాయ్ నీకు లేడు. చచ్చిపోయాడు’’ అంటూ అదే స్థాయిలో అతడికి బదులిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన చిరాగ్ తల్లి రీనా పాశ్వాన్, పరాస్‌కు ఫోన్ చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారని, అయితే, ‘‘అన్నదమ్ముల అనుబంధం గురించి మీకు బాగా తెలుసు. కానీ దీపు(చిరాగ్‌ను ఉద్దేశించి) నన్ను పార్టీ నుంచి వెళ్లగొడతానని బెదిరించినపుడు మీరు తనను చెంపదెబ్బకొట్టలేదు. కనీసం తన మాటలు వెనక్కు తీసుకోవాలని చెప్పలేదు. మరి ఇప్పుడు ఇలా ఎందుకు’’ అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను చిరాగ్ తెగేదాకా లాగడంతోనే పరాస్ తిరుగుబాటుకు ఉపక్రమించారని ఆ కుటుంబ పరిస్థితుల గురించి తెలిసిన వారు అభిప్రాయపడుతున్నారు. ‘‘చిరాగ్ ఎప్పుడూ తన తండ్రి, బాబాయ్‌ల మధ్య అనుబంధం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. వారికి ఎటువంటి కష్టం రాకుండా కనిపెట్టుకుని ఉన్న తీరును గమనించలేదు. బహుశా అందుకేనేమో ప్రతీసారి దూకుడుగా ప్రవర్తించి పరిస్థితి ఇంతదాకా తెచ్చుకున్నాడు’’ అని వారు వ్యాఖ్యానించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. గంటన్నర సేపు వెయిట్ చేయించారు రామ్ విలాస్ పాశ్వాన్‌కు అత్యంత సన్నిహితుడైన పశుపతి పరాస్... తెరవెనుక ఉంటూనే ఆయన రాజకీయ జీవితంలో తన వంతు పాత్ర పోషించారు. మరో సోదరుడు రామచంద్ర పాశ్వాన్‌కు సైతం అన్ని విధాలా అండగా నిలబడ్డారు. అయితే, రామ్‌విలాస్ మరణం తర్వాత చిరాగ్ మాత్రం ఆయనను ఖాతరు చేయలేదు.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా ఉన్న పరాస్ సలహాలు, సూచనలు పట్టించుకోకపోవడం, కించపరిచే విధంగా వ్యవహరించడం సహా... ఒంటెద్దు పోకడలతో పార్టీని మొత్తంగా ముంచివేసే విధంగా అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడంతో ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే చిరాగ్ సోమవారం స్వయంగా ఢిల్లీలోని పరాస్ నివాసానికి వెళ్లి, గంటన్నర సేపు ఎదురుచూసినా ఎటువంటి సమాధానం ఇవ్వకుండా తనకు ఎదురైన అవమానాలకు బదులు తీర్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎంపీలు పరస్, ప్రిన్స్ రాజ్, చందన్ సింగ్, వీణాదేవి, మెహబూబ్ అలీ కైజర్ల తిరుగుబాటు నేపథ్యంలో మంగళవారం ఎల్జేపీ జాతీయాధ్యక్ష పదవి నుంచి చిరాగ్ పాశ్వాన్‌ను తొలగించిన విషయం తెలిసిందే. ఇందుకు బదులుగా తానే తిరుగుబాటు ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చిరాగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో తదుపరి ఆయన ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నారన్న అంశం చర్చనీయాంశమైంది. చదవండి: ఎల్జేపీలో ముసలం.. నితీశ్ చాణక్యం! -
కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత రాం విలాస్ పాశ్వాన్ (74) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం పాలైన ఆయనకు ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి చనిపోయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పాశ్వాన్ హఠాణ్మరణంపై పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మృతిచెందడం ఎల్జేపీకి తీరని లోటుగా నేతలు భావిస్తున్నారు. ఆయన మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాశ్వాన్ ప్రస్తుత వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా ఉన్నారు. 2010 నుండి 2014 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్న తరువాత 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో హాజీపూర్ నియోజకవర్గం నుండి 16వ లోక్‌సభ తిరిగి ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగున్నారు. మొత్తం ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1946 జూలై 5న బిహార్‌లో జన్మించిన పాశ్వాన్.. 2000లో లోక్ జనశక్తి పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగంగా కేంద్రమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. కాగా రామ్ విలాస్ పాశ్వాన్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు తమ సంతాం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మరణంతో దేశం దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయింది. పార్లమెంటులో అత్యంత చురుకైన మరియు ఎక్కువ కాలం పనిచేసిన సభ్యులలో ఆయన ఒకరు. అతను అణగారిన వర్గాలవారికి స్వరం, అట్టడుగున ఉన్నవారికి విజయాన్ని అందించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నా - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రామ్‌విలాస్ పాశ్వాన్ ఇక లేరన్న వార్త నన్ను దిగ్ర్బాంతికి గురిచేసింది. పాశ్వాన్ మృతితో ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను. పేదల కోసం అహర్నిశలు శ్రమించారు. ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగానూ లోటుగా అనిపిస్తుంది. తాను ఓ మంచి స్నేహితుడిని, సహచరుడిని పేదల కోసం ఆలోచించే వ్యక్తిని కోల్పోయాను. - ప్రధాని నరేంద్ర మోదీ రామ్ విలాస్ పాశ్వాన్ జీ అకాల మరణం బాధాకరం. పేదలు, అణగారిన వర్గాలు ఆయన మృతితో ఈ రోజు ఒక బలమైన రాజకీయ గొంతును కోల్పోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. పాశ్వాన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం ప్రకటిస్తున్నాను. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత -
కరోనా.. కేంద్ర మంత్రి కార్యాలయం మూసివేత
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. తాజాగా కరోనా సెగ.. కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కార్యాలయాన్ని తాకింది. సెంట్రల్ ఢిల్లీలోని కృషి భవన్లో ఆయన ఆధ్వర్యంలోని ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మత్స్య, పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. (చదవండి : భారత్‌లో లక్ష దాటేసిన కరోనా కేసులు) పూర్తి స్థాయిలో శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టడం కోసం మే 19, 20 తేదీల్లో కార్యాలయాన్ని మూసివేయనున్నట్టుగా తెలిపారు. కాగా, ప్రస్తుతం రాంవిలాస్ పాశ్వాన్ ఆధ్వర్యంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖలు ఉన్న సంగతి తెలిసిందే. గత నెల 28న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో నీతి ఆయోగ్ కార్యాలయాన్ని మూసివేసి.. శానిటైజన్ ప్రక్రియ చేపట్టారు. మే 5న న్యాయశాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కరోనా సోకడంతో శాస్త్రి భవన్ బిల్డింగ్‌లోని ఒక ఫ్లోర్‌ను మూసివేశారు. -
కేంద్ర మంత్రికి ట్రిమ్మింగ్ చేసిన తనయుడు
-
కేంద్ర మంత్రికి ట్రిమ్మింగ్ చేసిన తనయుడు
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో సామాన్యులే కాకుండా ప్రముఖులు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. తమలోని కొత్త కొత్త కళలను బయట పెడుతున్నారు. కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు, లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ కూడా తనలో ఉన్న కొత్త కళను బయటపెట్టారు. లాక్డౌన్ వేళ సెలూన్ షాపులు మూతపడటంటో ఇంట్లోనే తన తండ్రికి టిమ్మింగ్ చేశారు. ట్రిమర్ సాయంతో గడ్డం తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరాగ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘లాక్డౌన్ అనేది కష్టమైనదే.. కానీ ఇందులో కూడా కొన్ని వెలుగులు ఉన్నాయి. నాలో ఈ నైపుణ్యం ఉందని నాకు తెలియదు. కరోనాపై పోరాడి.. అందమైన జ్ఞాపకాలను ఏర్పరుచుకుందాం’అని చిరాగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. తండ్రికి సాయం చేసిన చిరాగ్‌పై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. -
ఎఫ్‌సీఐ బకాయిల విడుదలకు వినతి
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నుంచి ఏపీకి రావాల్సిన రూ. 4 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఆ శాఖ కమిషనర్ కోన శశిధర్ కేంద్ర వినియోగదారుల, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌కు విన్నవించారు. మంగళవారం ఢిల్లీలో వారు మంత్రిని కలిశారు. అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీకి ఎఫ్‌సీఐ నుంచి రావాల్సిన రూ.4 వేల కోట్లు ఇవ్వాలని కోరాం. కేంద్రం 92 లక్షల కార్డులనే గుర్తించింది. మొత్తం కోటి 30 లక్షల కార్డులను గుర్తించాలని కోరాం. ఎఫ్‌సీఐ గోడౌన్లలో ధాన్యం నిల్వలను ఖాళీ చేయాలని కోరాం. రైతుల నుంచి కొన్న బియ్యాన్ని భద్రపరిచేందుకు గిడ్డంగుల అవసరం ఉంది. ఈ సమస్యలను పరిష్కరిస్తామని పాశ్వాన్ చెప్పారు’ అని వివరించారు. ‘రేషన్ కార్డుల జారీకి గత మార్గదర్శకాలను సడలించి మరింత ఎక్కువ మందికి కార్డులు వచ్చేలా నిబంధనలు సరళీకృతం చేశాం. ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ కార్డులు ఇచ్చినందువల్ల వల్ల తమకు రేషన్ అవసరం లేదని స్వచ్ఛందంగా 9 లక్షల మంది కార్డులను వెనక్కి ఇచ్చేశారు’ అని చెప్పారు. చంద్రబాబుకు శిక్ష తప్పదు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అక్రమాలకు శిక్ష తప్పదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబు ఇచ్చారు. కేంద్రం, రాష్ట్రానికి మధ్య రాజ్యాంగ పరంగా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు శాసనమండలి వద్దని అసెంబ్లీ తీర్మానించిందని, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన శాసనమండలి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తప్పులు చేసి ఇప్పుడు ఢిల్లీకి వస్తే లాభం లేదని, కేంద్రం పెద్దలు కూడా వీరి మాట వినే అవకాశం లేదని చెప్పారు. -
కేంద్రమంత్రిని కలిసిన మంత్రి కొడాలి నాని
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ఎఫ్‌సిఐ నుంచి రావాల్సిన నాలుగు వేల కోట్లు బకాయిలు త్వరితగతిన విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు.మంగళవారం ఢిల్లీలో ఆయన కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం 92 లక్షల కార్డులను మాత్రమే గుర్తించిందని.. మొత్తం 1.30 కోట్ల కార్డులను గుర్తించాలని కేంద్రమంత్రిని కోరామని వెల్లడించారు.ఎఫ్‌సిఐ గోడౌన్లలో ధాన్యం నిల్వలను ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని నిల్వ చేయడానికి గోడౌన్ల అవసరముందని చెప్పారు. ప్రస్తావించిన పలు సమస్యలపై కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ సానుకూలంగా స్పందించారని మంత్రి కొడాలి నాని వెల్లడించారు. మార్గదర్శకాలు సడలింపు.. రేషన్‌కార్డుల జారీకి గతంలో మార్గదర్శకాలను సడలించి మరింత ఎక్కువ మందికి వచ్చేలా నిబంధనలను సరళీకృతం చేశామని మంత్రి నాని చెప్పారు. ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ కార్డులు ఇవ్వడం వల్ల తమకు రేషన్ అవసరం లేదని స్వచ్ఛందంగా 9 లక్షల మంది కార్డులను వెనక్కి ఇచ్చేశారని పేర్కొన్నారు. ‘ఆరు లక్షల కార్డులపై ఎంక్వయిరీ జరుగుతోంది. వాటిపై తనిఖీ చేసి అర్హులందరికీ ఇస్తాం. ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండాలని లక్ష్యంతో నిబంధనలు సడలించాం. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ’ అని పేర్కొన్నారు. చంద్రబాబుకు శిక్ష తప్పదు.. చంద్రబాబు అవినీతి బాగోతంపై మంత్రి నాని మాట్లాడుతూ.. రెండు వేల కోట్ల రూపాయల డబ్బును ఎవరు ఇంట్లో పెట్టుకుని కూర్చోరని, వేల కోట్ల అక్రమ సంపాదన చేశారు కాబట్టి.. వాటికి సంబంధించిన ఆస్తులు, నగదు, డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలు దొరికాయన్నారు. రెండు వేల కోట్లు దొరికాయని ఎవరు చెప్పలేదన్నారు. కోట్ల రూపాయలు పీఏ ఇంట్లో పెట్టుకోవడానికి చంద్రబాబు పిచ్చోడు కాదని.. ఆయన చెప్పిన మేరకు డబ్బులు ఇచ్చిన విషయాన్ని పీఏ శ్రీనివాస్ తన డైరీలో రాసుకున్నారన్నారు. చంద్రబాబు చేసిన అక్రమాలకు శిక్ష తప్పదని పేర్కొన్నారు.(అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అడ్డంగా దొరికారు..) శాసనమండలి అభివృద్ధికి అడ్డుపడుతోంది.. కేంద్రం, రాష్ట్రానికి మధ్య రాజ్యాంగ సంబంధాలు ఉన్నాయని.. తమకు మండలి వద్దని ఫార్వర్డ్ చేశామని మంత్రి నాని పేర్కొన్నారు. రెండు,మూడు నెలల లోపు కేంద్రం నిర్ణయం అమలవుతుందన్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన శాసనమండలి అభివృద్ధి అడ్డుపడుతుందని..రాజకీయాలకు వేదికగా మారుతోందని విమర్శించారు. అందుకే మండలిని రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. -
జూన్ నుంచి ఒకే దేశం–ఒకే రేషన్
న్యూఢిల్లీ: వలస కార్మికులకు, దినసరి కూలీలకు ప్రయోజనకర పథకంగా భావిస్తున్న ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ పథకం వచ్చే జూన్ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం, అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ రేషన్ కార్డు ద్వారా దేశంలోని ఏదైనా చౌక ధరల దుకాణం(ఎఫ్‌పీఎస్) నుంచి తమ కోటా ఆహార ధాన్యాలను పొందగలుగుతారు. బయోమెట్రిక్ లేదా ఆధార్ ధ్రువీకరణ తర్వాత ఇది అందుబాటులోకి వస్తుందని ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. ‘ఉపాధి కోసం లేదా దేశవ్యాప్తంగా తమ నివాస చిరునామా మార్చుకునే వలస కార్మిక లబ్ధిదారులు, దినసరి కూలీలు, ఇతర రంగాల కార్మికులకు ఈ వ్యవస్థ ప్రయోజనం చేకూరుస్తుంది’అని ఆయన చెప్పారు. లబ్ధిదారుల ధ్రువీకరణను సమన్వయం చేయడానికి ప్రభుత్వం ‘వన్ నేషన్ వన్ స్టాండర్డ్’పై కృషి చేస్తోందని చెప్పారు. -
కేంద్ర మంత్రి ఇంట్లో విషాదం..
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి, ఎల్జేపీ నాయకుడు రాంవిలాస్ పాశ్వాన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు, లోక్‌సభ సభ్యుడు రామచంద్ర పాశ్వాన్(56) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామచంద్ర పాశ్వాన్ నేడు రామ్ మనోహార్ లోహియా ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ప్రస్తుతం రామచంద్ర పాశ్వాన్ బిహార్‌లోని సమస్తిపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. రామచంద్ర పాశ్వాన్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్, బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ సంతాపం తెలిపారు. ఆయన మరణం బాధ కలిగించిందని మోదీ పేర్కొన్నారు. ప్రజలకు ఆయన చేసిన సేవ వెల కట్టలేనిదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రామచంద్ర పాశ్వాన్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంవిలాస్ పాశ్వాన్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. Shri Ram Chandra Paswan Ji worked tirelessly for the poor and downtrodden. At every forum he spoke unequivocally for the rights of farmers and youngsters. His social service efforts were noteworthy. Pained by his demise. Condolences to his family and supporters. Om Shanti. — Narendra Modi (@narendramodi) July 21, 2019 -
కుటుంబ కథా చిత్రం!
పట్నా: ఒక కుటుంబం నుంచి ఒకరు ఎంపీ కావడమే గొప్ప. అలాంటిది ఏకంగా నలుగురు ఒకేసారి పార్లమెంట్‌కు ఎన్నిక కావడమంటే విశేషమే. బిహార్‌లోని లోక్‌జన్ శక్తి పార్టీ (ఎల్జీపీ) నేత రాంవిలాస్ పాశ్వాన్(73) ఈ ఘనత సాధించనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీయే పొత్తుల్లో భాగంగా ఎల్జేపీకి ఆరు సీట్లు దక్కాయి. వాటిలో మూడు చోట్ల.. పాశ్వాన్ కుమారుడు చిరాగ్, సోదరులు పశుపతి, రామచంద్రలు పోటీ చేసి నెగ్గారు. ఈ ఎన్నికల్లో పాశ్వాన్ పోటీ చేయలేదు. అయితే, ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. ఎన్డీయేలో ముందుగా కుదిరిన అవగాహన ప్రకారం ఆయన రాజ్యసభకు ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో పాశ్వాన్‌తో కలిపి ఆయన కుటుంబంలో నలుగురు ఒకేసారి ఎంపీలుగా ఉన్నట్లవుతుంది. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఏకకాలంలో ఎంపీలు కానుండటం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి కానుంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి గిన్నిస్ కెక్కడం సహా పాశ్వాన్ రాజకీయంగా ఎన్నో రికార్డులు సృష్టించారు. ఇప్పటివరకు ఆయన లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు నెగ్గారు. 1977 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. -
‘కాలం చెల్లిన పార్టీలవి.. ఇవే చివరి ఎన్నికలు’
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఎస్పీ, బీఎస్పీలు కూటమి కట్టాయని, ఎన్నికలు ముగియడంతో కూటమి విచ్చిన్నమైందని లోక్‌జనశక్తి చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు. 2020లోపు ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ పార్టీలు తలుపులు మూసుకోక తప్పదని, ఆ పార్టీలకు కాలం చెల్లిపోయిందని అభిప్రాయపడ్డారు. కుమ్ములాట కోసమే వారు కూటమి కట్టినట్లుందని, ప్రజాసంక్షేమం వారికి పట్టదని ఆరోపించారు. యూపీ, బిహార్‌తో పాటు దేశ వ్యాప్తంగా కూడా విపక్షాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయని పాశ్వాన్ అన్నారు. ఆ పార్టీలకు ఇవే చివరి ఎన్నికలను జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడిన ‘మహాఘఠ్ బంధన్’ చీలిపోయిన విషయం తెలిసిందే. దీంతో అధికారం బీజేపీ ఎస్పీ,బీఎస్పీపై విమర్శల వర్షం కురిపిస్తోంది. ఓట్ల కోసమే భూటకపు కూటమి కట్టారని ఆరోపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు సాధించకపోవడంతో రానున్న ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఎస్పీ, బీఎస్పీ నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ చీఫ్ మాయావతి మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. యూపీ ఉప ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ ఒంటరిగా పోటీ చేయాలనుకున్నట్లు వెల్లడించారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
‘స్వీట్లు, పూలదండలు రెడీగా ఉన్నాయి’
న్యూఢిల్లీ : ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడించిన వాటి ఎక్కువ సీట్లు గెలుస్తామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఓటమికి సాకులు వెదుక్కునే క్రమంలో విపక్షాలు ఈవీఎంలపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం రాత్రి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన విందుకు లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఈవీఎంలపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ‘ఓటమి ఖాయమని వారికి అర్థమైంది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఈవీఎంలపై కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు ఈవీఎంలను నిందించలేదు ఎందుకు. కనీసం పంజాబ్‌లో గెలిచినప్పుడైనా వారు ఈవీఎంలపై ఉన్న సందేహాలను లేవనెత్తాల్సింది. కానీ అలా చేయలేదు. వాళ్లు ఎన్ని నిందలు వేసినా ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క మాట అనలేదు. కానీ ప్రతిపక్షాలకు నేనొక విషయం చెప్పదలచుకున్నాను. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదు. అర్థమైందా’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ విజయం ఖాయమని, కార్యకర్తలంతా స్వీట్లు, పూలమాలతో సంబరాలు చేసుకునేందుకు సిద్ధమైపోయారని వ్యాఖానించారు. ఇక తన తనయుడు చిరాగ్ పాశ్వాన్ గురించి మాట్లాడుతూ.. ‘ నాయకుడిగా ఎదిగే అన్ని లక్షణాలు తనకు ఉన్నాయి. ఏ తండ్రి అయినా కొడుకు ప్రయోజకత్వాన్నే కోరుకుంటారు. నేను కూడా అంతే. ముందు ఫలితాలైతే రానివ్వండి. బహుశా తను కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటాడేమో అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దళితులు మరింత అభివృద్ధి చెందుతారని ప్రశంసలు కురిపించారు. కాగా చిరాగ్ పాశ్వాన్ బిహార్‌లోని జమాయి నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా పోటీ చేశారు. కేంద్ర మంత్రిగా రామ్ విలాస్ బిజీగా ఉండగా పార్టీ పగ్గాలు చేపట్టిన చిరాగ్ గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం నిర్వహించారు. -
‘ఓటమి నైరాశ్యంతోనే ఈవీఎంలపై వివాదం’
సాక్షి, న్యూఢిల్లీ : ఓటమి తప్పదనే నిరాశతోనే విపక్షాలు వీవీప్యాట్లపై రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి, ఎల్జేపీ చీఫ్ రాం విలాస్ పాశ్వాన్ అన్నారు. ఈవీఎంలపై విపక్షాలు గగ్గోలు పెట్టడం వారి ఓటమికి సంకేతమని ఎద్దేవా చేశారు. ఓటమికి చేరువైనప్పుడు విపక్షాలు ఈవీఎంలపై ఫిర్యాదు చేస్తాయని తాను గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. ఈవీఎంలను వ్యతిరేకిస్తున్న వారు ఎన్నికలను అర్ధ, అంగబలం శాసించే పాత రోజులకు దేశాన్నితీసుకువెళుతున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఇప్పటికే ఈవీఎం, వీవీప్యాటర్లపై విస్పష్ట ఉత్తర్వులు ఇచ్చినా ఓటమి భయంతో విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని పాశ్వాన్ మండిపడ్డారు. విపక్షాలు గెలిస్తే ఈవీఎంలు సరిగా పనిచేసినట్టు, ఓడిపోతే మాత్రం ఈవీఎంలను తారుమారు చేసినట్టు గగ్గోలు పెట్టే వైఖరి రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య ప్రక్రియకు చేటు అని వ్యాఖ్యానించారు. కాగా ఎన్డీయే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ కేంద్ర మంత్రిగా ముందుకొస్తారని ఆయన సంకేతాలు పంపారు. చిరాగ్ పాశ్వాన్‌కు కేంద్ర మంత్రి కాగల సామర్ధ్యాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. -
50% అడ్డంకి కాబోదు: జైట్లీ
జనరల్ కేటగిరీలో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రకటించాయి. సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించినందున మరో 10 శాతం రిజర్వేషన్ కల్పించడం కోర్టు తీర్పుకు ధిక్కరించినట్లవుతుందన్న వాదన అర్థ రహితం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం సుప్రీంకోర్టు విధించిన 50శాతం పరిమితి కులాల ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లకు మాత్రమే వర్తిస్తుంది. అంతేతప్ప, జనరల్ కేటగిరీకి కాదు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు మార్లు నోటిఫికేషన్ల ద్వారా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించిన కారణంగా విఫలమయ్యాయి. ఆర్టికల్ 368 పార్ట్ 3 ప్రకారం..ప్రాథమిక హక్కుల సవరణకు రాష్ట్రాల అంగీకారం పొందాల్సిన అవసరం కూడా లేదు. ఉదాహరణకు..ప్రమోషన్లకు సంబంధించి ఆర్టికల్ 15(5)కు చేపట్టిన సవరణ పార్లమెంట్ ఆమోదం ద్వారానే జరిగింది. ఇప్పటివరకు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే రాజ్యాంగం రిజర్వేషన్ కల్పిస్తోంది. ప్రస్తుత 124వ రాజ్యాంగ సవరణ–2019 ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కొన్ని నిబంధనలను చేరుస్తున్నాం. కులం, ఆర్థికత ఆధారంగా పౌరులకు సమాన అవకాశాలు కల్పించాలి. అయితే, సమానులను అసమానంగా చూడరాదు. అసమానులను కూడా సమానంగా భావించరాదు. రాజ్యాంగ మూల స్వరూపాన్ని మార్చకుండా మేం చేపట్టిన ఈ ప్రయత్నం సఫలమవుతుందని ఆశిస్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజరేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ..మాటపై నిలబడి బిల్లుకు ఆమోదం తెలపాలి. ప్రతిపక్షాలు నిరసనలు తెలపడం మాని, మనస్ఫూర్తిగా బిల్లుకు ఆమోదం ప్రకటించాలి. అనుప్రియా పటేల్, అప్నాదళ్ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో మాదిరిగా కాకుం డా ఆర్థికంగా వెనుకబడిన వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. 2021 లో కుల ప్రాతిపదికన జన గణన చేపట్టి స్పష్టత తీసుకువస్తాం. ప్రైవేట్ రంగానికి కూడా ఈ రిజర్వేషన్లు వర్తింప జేసే విషయాన్ని పరిశీలిస్తున్నాం. రాం విలాస్ పాశ్వాన్, కేంద్రమంత్రి జనరల్ కేటగిరీలో 60శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. తద్వారా సుప్రీంకోర్టులో సవాల్ చేసే వీలుండదు. ప్రైవేట్ రంగంలో కూడా 60శాతం రిజర్వేషన్లు కల్పించాలి. దీంతోపాటు ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ ఏర్పాటు చేయాలి. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. -
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చొద్దు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అత్యచార నిరోధక చట్టాన్ని నీరుగార్చొద్దని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) ఎంపీ రాం విలాస్ పాశ్వాన్ కోరారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగమవుతోందని, దాన్ని పునఃపరిశీలించాలంటూ మార్చి 20న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా కేంద్రం వెంటనే ఆర్డినెన్స్ తీసుకు రాకుంటే తాము ఉద్యమబాట పడతామన్నారు. ఆగస్టు 9లోగా జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ ఆదర్శ్ గోయెల్‌ను తొలగించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రయోజనాలను కాపాడుతారనే 2014లో బీజేపీకి మద్దతిచ్చామని పాశ్వాన్ అన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పునరుద్ధరించి యథావిధిగా అమలు చేయాలన్నారు. ఆగస్టు 9లోగా తమ డిమాండ్లను గనుక కేంద్రం నెరవేర్చకపోతే ఎన్డీయే నుంచి వైదొలగుతామన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చొద్దని కోరుతూ దేశవ్యాప్తంగా దళిత, గిరిజన సంఘాలు దేశవ్యాప్తంగా ఆగస్టు 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. -
త్వరలోనే చిరాగ్ పాశ్వాన్ పెళ్లి..!!
పాట్నా, బిహార్ : బిహార్‌లో మరో రాజకీయ నేత తనయుడి పెళ్లికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు, లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ తాను పెళ్లికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, వధువును మాత్రం తల్లిదండ్రులే వెదికిపెట్టాలని చెప్పారు. జముయ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న చిరాగ్ ప్రస్తుతం తనపై నియోజవకవర్గ ప్రజల బాధ్యత ఉందన్నారు. పెళ్లి కొంచె ఆలస్యం అయినా ఫర్వాలేదని చెప్పారు. తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి సందర్భంగా ఆయన తమ్ముడు తేజస్వీ యాదవ్ తనకంటే వయసులో పెద్దవారైన చిరాగ్, నిశాంత్ కుమార్(నితీశ్ కుమార్ తనయుడు)ల వివాహం తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని పేర్కొన్నారు. దీనిపై మాట్లాడిన చిరాగ్.. తేజస్వి కోరికను తప్పకుండా నేరవేర్చుతానని అన్నారు. -
‘అగ్రవర్ణ పేదలకు 15 శాతం రిజర్వేషన్’
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్ వర్తింపచేయాలనే డిమాండ్‌కు సానుకూల స్పందన లభిస్తోంది. అగ్రవర్ణ పేదలకు 15 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ చీఫ్ రాం విలాస్ పాశ్వాన్ అన్నారు. సెక్యులరిజం, మత సామరస్యంతో పాటు పేదలకు అధికార ఫలాలు దక్కాలనేది తమ పార్టీ అభిమతమని చెప్పారు. ‘అగ్రవర్ణాల్లో పెద్దసంఖ్యలో పేదలున్నారు..వారు చేసేందుకు ఎలాంటి పని దొరకడం లేదు..అందుకే వారికి 15 శాతం కోటా కల్పించాలని తాను డిమాండ్ చేస్తున్నా’నన్నారు. పార్టీ కార్మిక విభాగం భేటీ నేపథ్యంలో పాశ్వాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పని లభించని వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పోస్టుల అవుట్‌సోర్సింగ్‌తో ఆయా వర్గాలకు కల్పించిన రిజర్వేషన్ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని పాశ్వాన్ ఆందోళన వ్యక్తం చేశారు. -
బిహార్‌లోనూ మూడో ఫ్రంట్!
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లో రెండు అసెంబ్లీ, ఒక లోక్‌సభ సీటుకు జరిగిన ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు రాష్ట్ర బీజేపీ సంకీర్ణ కూటమిలో చిచ్చు పెట్టాయి. బీజేపీ ప్రాభవం పడిపోతున్న విషయాన్ని ఈ ఫలితాల ద్వారా గ్రహించిన నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ, రామ్ విలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీలు రాష్ట్రంలో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారం నాడు నితీష్ కుమార్, రామ్ విలాస్ పాశ్వాన్లు గంటకుపైగా చర్చలు జరిపారు. ఆ తర్వాత నితీష్ కుమార్ జన్ అధికార పార్టీ నాయకుడు, మధేపుర పార్లమెంట్ సభ్యుడు పప్పు యాదవ్‌తో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే తమ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా కావాలంటూ జేడీయూ బుధవారం నాడు పార్లమెంట్లో డిమాండ్ చేసింది. ఆ మేరకు ఓ నోటీసును కూడా అందజేసింది. ఆ డిమాండ్‌కు మద్దతు తెలియజేస్తూ లోక్ జన్‌శక్తి పార్టీ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరిస్థితిని గ్రహించిన బీజేపీ సీనియర్ నాయకులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్‌లు పాశ్వాన్‌ను, బీజేపీ ముస్లిం నాయకుడు షా నవాజ్ హుస్సేన్ నితీష్ కుమార్‌ను కలుసుకొని సంప్రదింపులు జరిపారు. బీహార్‌లో మతసామరస్యాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారికి బీజేపీ నేతలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయినప్పటికీ నితీష్, పాశ్వాన్లు శాంతించలేదు. బిహార్ ఉప ఎన్నికల్లో హిందూ అగ్రవర్ణాల ఓట్ల కోసం బీజేపీ నాయకులు మత విద్వేషాలను రెచ్చగొట్టారు. ఇది నితీష్, పాశ్వాన్లకు ఎక్కువ కోపం తెప్పించింది. ఎందుకంటే వెనకబడినవారు, దళితులు, మైనారిటీలు వారి సంప్రదాయ ఓటర్లు. బిజేపీ కూటమిలో కొనసాగడం వల్ల అనవసరంగా ఈ వర్గాలను దూరం చేసుకోవాల్సి వస్తుందన్న ఆలోచనతోనే ఈ ఇరువురు నాయకులు 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. -
కేంద్రం వార్నింగ్ : ఆ డేటా షేర్ చేస్తే ఇక అంతే
న్యూఢిల్లీ : వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత డేటాను వాణిజ్య ప్రయోజనాల కోసం కంపెనీలకు షేర్ చేస్తే, తీవ్ర చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇది అన్యాయమైన వాణిజ్య విధానమని, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లా కింద చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ-కామర్స్ కంపెనీలు వాణిజ్య ప్రయోజనాల కింద వ్యక్తిగత డేటాను కంపెనీలకు షేర్ చేస్తున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న క్రమంలో వినియోగదారుల సంరక్షణ బిల్లులో ప్రభుత్వం దీన్ని ప్రతిపాదించింది. ప్రజలు ఈ అన్యాపూర్వకమైన వాణిజ్య విధానాన్ని వినియోగదారుల కోర్టుల్లో ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ వీటిపై చర్యలు తీసుకునే హక్కులను కలిగి ఉంది. ఈ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశముందని వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వన్ తెలిపారు. సౌత్ ఈస్ట్ ఏసియా ప్రాంతంలో ప్రతి దేశం వినియోగదారులను కాపాడటానికి అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను షేర్ చేసుకుంటున్నాయన్నారు. ఇతర దేశాల నుంచి నేర్చుకున్న అంశాలతో తమ పాలసీ విధానాల్లో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. వినియోగదారుల ప్రైవసీని కాపాడాలంటూ అంతకముందు కూడా వినియోగదారుల హక్కుల కార్యకర్తలు, ఎన్సీడీఆర్సీ సభ్యులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
బంకుల్లో అక్రమాలకు ప్రభుత్వం చెక్
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, గ్యాస్ బంకుల్లో అక్రమాలు చోటుచేసుకుంటూ ప్రతిరోజు లక్షలాదిమంది వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంధనం, గ్యాస్ నింపడాన్ని తనిఖీ చేసేందుకు హై-సెక్యురిటీ డివైజ్‌లను ఇన్స్టాల్ చేస్తోంది. ఈ మేరకు డివైజ్‌లను ఏర్పాటుచేసేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఆమోదించాయని ప్రభుత్వం తెలిపింది. కొత్త సెక్యురిటీ డివైజ్‌లను ఏర్పాటుచేసేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వచ్చే వరకు ప్రభుత్వం గడువు విధించింది. ప్రస్తుతం పెట్రోల్, గ్యాస్ స్టేషనలలో సెక్యురిటీ డివైజ్‌లను ఉన్నాయి. కానీ వాటిల్లో తారుమారుకు ఎక్కువగా అవకాశం ఉండటం, అక్రమాలు ఎక్కువగా చోటుచేసుకుంటుండటంతో కొత్త వాటితో ఈ డివైజ్‌లను మార్చుతున్నారు. '' హైసెక్యురిటీ డివైజ్‌లను ఏర్పాటుచేయడానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆమోదించాయి. వచ్చే వారం వరకు వారికి గడువు ఇచ్చాం'' అని వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి రాం విలాస్ పాశ్వాన్ చెప్పారు. మూడు డివైజ్‌లు ఎలక్ట్రానిక్ ఫ్లో మెటర్స్, టాంపర్-ప్రూఫ్ ఎలక్ట్రానిక్ సీల్స్, పల్సర్లను లీగల్ టెట్రోలజీ డిపార్ట్మెంట్ పరీక్షించిందని సీనియర్ అధికారులు చెప్పారు. -
‘ఆధార్‌తో రూ.14 వేల కోట్ల ఆదా’
న్యూఢిల్లీ: రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా రూ.14 వేల కోట్లను ఆదా చేసినట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వెల్లడించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 18 కోట్ల రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించి నకిలీ వాటిని తొలగించామని తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రారంభమైన ‘ఇండియా ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ సమావేశం–2017’లో మంత్రి ప్రసంగించారు. అవినీతిని అరికట్టడానికి ఈ–పీఓఎస్‌లను ఏర్పాటు చేసి అన్ని చౌక ధరల దుకాణాలను కంప్యూటరీకరిస్తామని చెప్పారు. ఆహార ధాన్యాలు పాడవకుండా ఉండటానికి, అవి సమయానికి మార్కెట్ చేరడానికి సమర్థవంతమైన రవాణా వ్యవస్థ ఉండాలని సూచించారు. జాతీయ ఉమ్మడి మార్కెట్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. రైలు, రోడ్డు, జల మార్గాల మధ్య అనుసంధానత ఏర్పడితే రైతు తన పంటను సమయానికి మార్కెట్‌కు చేర్చి, మెరుగైన ధర పొందుతాడని అన్నారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ, రోడ్డు, రవాణా శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయ తదితరులు పాల్గొన్నారు. -
‘కోర్టుతోనే రామమందిరం.. మోదీ సునామీ’
పాట్నా: ఆయోధ్యలోని రామమందిర నిర్మాణ అంశం చట్టపరంగా పరిష్కారం కావాల్సిందేనని కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. ‘కోర్టు తీర్పు ద్వారా మాత్రమే ఆయోధ్య సమస్య పరిష్కారం కావాలి’ అని ఆయన ఆదివారం విలేకరులతో చెప్పారు. రామమందిరం, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని నిబంధన 370వంటి అంశాలను కూడా ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌తోసహా పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఓట్లకోసం ఆలోచించి మోదీ కూడా ఈ అంశాలను ప్రస్తావించలేదని, దానికి బదులుగా అభివృద్ధి, అవినీతి నిర్మూలనవంటివాటినే ప్రస్తావించారని చెప్పారు. పేద ప్రజల శక్తియుక్తులను మరింత పటిష్టం చేసేందుకు మోదీ నడుంకట్టారని అన్నారు. అభివృద్ధిని సాధించుకుంటూ అవినీతిని అంతమొందిస్తూ మోదీ చూపించిన మార్గంలోనే యోగి ఆదిత్యనాథ్ వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మోదీ సునామీతో ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలన్నీ కొట్టుకుపోయాయని ఎద్దేవా చేశారు. -
ఔనా! నిజమా! కేరళ సీఎం పన్నీర్ సెల్వం!
'కేరళ ముఖ్యమంత్రి శ్రీ పన్నీర్ సెల్వం, ఆయన అధికార బృందంతో భేటీ అయ్యాను' అంటూ ఏకంగా కేంద్రమంత్రి ట్వీట్ చేయడంతో నెటిజన్లు బిత్తరపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి, జయలలిత వీరవిధేయుడైన పన్నీర్ సెల్వం కేరళకు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారంటూ తికమకపడ్డారు. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారు వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఇలా పొరపాటున ట్వీట్ చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్ ఆయనను కలువగా.. పాశ్వాన్ మాత్రం తనను కలిసింది కేరళ సీఎం పన్నీర్‌సెల్వం అంటూ పోస్టు చేశారు. కేంద్రమంత్రి అయి ఉండి ఆయన ఇలా పొరపాటు చేయడంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. పాశ్వాన్ రాహుల్ గాంధీతో పోటీపడుతున్నారా? అంటూ సెటైర్లు వేశారు. తాను స్వయంగా ఎవర్ని కలిసింది కూడా ఆయనకు తెలియకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ క్రమంలో పొరపాటును గుర్తించిన పాశ్వాన్ పాత ట్వీట్‌ను డిలీట్ చేసి.. కేరళ సీఎం పినరయి విజయన్ అంటూ కరెక్ట్ పోస్టుపెట్టారు. -
ఆస్పత్రి నుంచి కేంద్ర మంత్రి డిశ్చార్జి
కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వ్యవహారాల మంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. శ్వాస సంబంధిత సమస్య కారణంగా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో రెండు రోజుల క్రితం ఆయనను పట్నాలపోని ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. అక్కడి ఐసీయూలో చేర్పించి ఆయనకు చికిత్స అందించారు. చికిత్స అనంతరం పూర్తిగా కోలుకోవడంతో పాశ్వాన్‌ను శనివారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. తనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పడంతో గురువారం రాత్రి 8:30 గంటలకు పాశ్వాన్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు ఆయన సోదరుడు పశుపతి కుమార్ తెలిపారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పట్నా, కగారియా, బెగుసరాయ్, మొకమ ప్రాంతాల్లో మంత్రి పర్యటించాల్సి ఉంది. రాంవిలాస్ పాశ్వాన్ ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలిసిన ఎల్జేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆస్పత్రికి వెళ్లారు. రెండు రోజుల పాటు ఆస్పత్రి మొత్తం సందడిగా మారింది. -
ఐసీయూలో కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్
-
ఐసీయూలో కేంద్రమంత్రి
పట్నా: కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వ్యవహారాల మంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ శ్వాస సంబంధింత వ్యాధితో ఆసుపత్రిలో చేరారు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా మారడంతో డాక్టర్లు ఆయన్ను ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పడంతో గురువారం రాత్రి 8:30 గంటలకు ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు రాంవిలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి కుమార్ తెలిపారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పట్నా, కగారియా, బెగుసరాయ్, మొకమ ప్రాంతాల్లో మంత్రి పర్యటించాల్సి ఉంది. రాంవిలాస్ పాశ్వాన్ ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న ఎల్జేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. మంత్రి భార్య, కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఆసుపత్రి చేరుకున్నారని ఎల్జేపీ అధికార ప్రతినిధి అష్రఫ్ అన్సారీ తెలిపారు. -
ఈనెల నుంచి దేశమంతా ఆహార భద్రత
న్యూఢిల్లీ: ఆహార భద్రత చట్టం కింద దేశంలోని 80 కోట్ల మందికి బియ్యం, గోధుమలను సబ్సిడీపై అందించడానికి ఏటా రూ. 1.4 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. 2013లో ఆమోదం పొందిన ఈ చట్టాన్ని కేరళ, తమిళనాడు మినహా దేశమంతటా ఈనెల నుంచే అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద ప్రతీ మనిషికి బియ్యం, గోధుమలను 5 కేజీల చొప్పున అందించనున్నారు. బియ్యం కేజీ రూ. 3, గోధుమలు కేజీ రూ. 2కు ఇవ్వాలని నిర్ణయించారు. -
దిగొచ్చిన పప్పు ధాన్యాల ధరలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లలో పప్పు ధాన్యాల ధరలు దిగొచ్చాయి. పలు ప్రధాన నగరాల్లో ప్రస్తుతం పప్పు ధాన్యాల ధరలు కిలోకు రూ.115-170 మధ్య ఉన్నాయి. అయినా నిల్వలపై పరిమితిని ఎత్తివేసేందుకు ప్రభుత్వం విముఖత చూపింది. ధరలు ఇలాగే తగ్గుతాయో లేదో మరికొంత కాలం పరిశీలిస్తామని ఆహార శాఖ రాంవిలాస్ మంత్రి పాశ్వాన్ చెప్పారు. పప్పు ధాన్యాల ధరలు దేశీయంగా కనీస మద్దతు ధర కన్నా తగ్గితే, ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి రైతుల నుంచి ప్రభుత్వమే ధాన్యాలను నేరుగా కొంటుందని ఆయన వెల్లడించారు. -
పాశ్వాన్‌కు ప్రధాని పుట్టినరోజు శుభాకాంక్షలు
న్యూఢిల్లీ : కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వ్యవహారాల మంత్రి, లోక్ జనశక్తి పార్టీ నేత రాంవిలాస్ పాశ్వాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ రాంవిలాస్ పాశ్వాన్ 69వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్లో అభినందనలు తెలుపుతూ ఆయన ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాంవిలాస్ పాశ్వాన్...ప్రధానికి రీట్విట్ చేశారు. 'వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ రిగార్డ్ టూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ జీ' అంటూ పాశ్వాన్ ట్విట్ చేశారు. -
మంత్రులతో హరీశ్‌రావు భేటీ
-
'బీహార్‌లో మళ్లీ 'జంగల్ రాజ్ వచ్చేసింది'
న్యూఢిల్లీ: బిహార్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస హత్యల నేపథ్యంలో నితీశ్‌కుమార్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి, ఎల్జేపీ రాంవిలాస్ పాశ్వాన్ ధ్వజమెత్తారు. గతంలో ఎన్డీయే చెప్పినవిధంగానే బిహార్‌లో మళ్లీ 'జంగల్ రాజ్' (ఆటవిక రాజ్యం) వచ్చేసిందని మండిపడ్డారు. వరుస హత్యలు జరుగుతున్నా నితీశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిష్క్రియగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. 'బిహార్‌లో మళ్లీ జంగల్ రాజ్ వచ్చేసింది. నితీశ్-లాలూ జోడీకడితే బిహార్‌లో మళ్లీ ఆటవిక రాజ్యం వస్తుందని మేం ఎన్నికల ప్రచారంలో చెప్పాం. జంగల్‌రాజ్ కాదు 'మంగళ్ రాజ్' (మంగళకరమైన రాజ్యం) వస్తుందంటూ నితీశ్-లాలూ చెప్పారు. ఇది ఆటవిక రాజ్యామా? లేక మంగళకర రాజ్యమా? అన్నది ఇప్పుడు ప్రజలే చెప్పాలి' అని ఆయన మంగళవారం విలేకరులతో పేర్కొన్నారు. బిహార్‌లో వరుసగా ఇంజినీరింగ్ విద్యార్థుల మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
'బిహార్‌లో మధ్యంతర ఎన్నికలు రావొచ్చు'
పట్నా: బిహార్‌లో నితీశ్‌కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం రెండేళ్లకు మించి పనిచేయకపోవచ్చునని, కచ్చితంగా మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందని కేంద్రమంత్రి, ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై శనివారం ఆయన లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాకూటమి ఎన్నికల్లో కులంకార్డును ప్రయోగించిందని, ఇది దీర్ఘకాలంలో పనిచేయబోదని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలువగా, జేడీయూ రెండోస్థానంలో నిలిచిందని, ఈ నేపథ్యంలో రెండు పార్టీలు ఆధిపత్యం కోసం కొట్లాడుతాయని, దీంతో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందని పాశ్వాన్ జోస్యం చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో జట్టు కట్టిన ఎల్జేపీ 40 సీట్లలో పోటీచేసి.. ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుపొందింది. ఎజ్జేపీ రాష్ట్ర అధ్యక్షుడు పశుపతికుమార్ ప్రాస్‌తోపాటు పాశ్వాన్ సోదరుడు, ఆయన ఇద్దరు అల్లుళ్లు, మేనల్లుడు, పలువురు బంధువులు ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. -
'దళిత నాయకుడిగా ఉండాలని లేదు'
పాట్నా: తనకు దళిత నాయకుడిగా ఉండాలని లేదని లోక్ జన శక్తి పార్టీనేత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రోజులు మారాయని చెప్పారు. ఇప్పటి వరకు దళిత నాయకుడిగానే చెప్పుకుంటూ పాశ్వాన్ గొప్ప నాయకుడిగా ఎదగగా.. హీరో నుంచి నాయకుడిగా మారిన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. 'నాకు దళిత నాయకుడిగా తెలియడం ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటి రోజులు వేరు ప్రస్తుత రోజులు వేరు. ఇప్పుడంతా మారిపోయింది' అని చిరాగ్ అన్నాడు. బీహార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. -
వేడెక్కుతున్న బిహార్ రాజకీయాలు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. తొలి దశలో 49 స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వేగంగా మారుతున్న పరిణామాలతో బిహార్ రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. బిజేపీ కూటమి, దళిత నాయకులకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దళిత సీనియర్ నేత నరేంద్రసింగ్ కుమారుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే సుస్మిత్ సింగ్‌కు సీటు నిరాకరించడంతో కూటమిలో వివాదాలకు తెర లేచినట్లైంది. పలు స్థానాల్లో బీజేపీ కూటమి విజయ అవకాశాలను దళిత నేతలు దెబ్బతీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారాలతో కూటమికి, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ, ఎల్జేపీ నేత రామ్‌విలాస్ పాశ్వాన్ లకు మధ్య దూరం పెరిగిపోయింది. దళిత నేతలను శాంతింపజేయడంలో మాంఝీ పూర్తిగా విఫలమయ్యాడని తెలుస్తోంది. విజయాన్ని కైవసం చేసుకోవడానికి ప్రత్యర్ధి పార్టీలతో చేతులు కలపడానికి సైతం ఇరు వర్గాల నేతలు వెనకాడటం లేదని తెలుస్తోంది. -
బరిలో బాబాయి vs అబ్బాయి!
కళ్యాన్పూర్: ఇటు బాబాయి- అటు అబ్బాయి. గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దూకారు. పోటాపోటీగా తలపడుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ బాబాయి-అబ్బాయి పోరు ఆసక్తికరంగా మారింది. ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్‌కు బంధువులైన ప్రిన్స్ రాజ్ (26), మాజీ ఎంపీ మహేశ్వర్ హజారి (44) కళ్యాన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి దిగారు. ప్రిన్స్ రాజ్ ఎల్జేపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుడగా, హజారి జేడీయూ నుంచి పోటీకి దిగారు. కళ్యాన్పూర్ జేడియూ ఇలాకా అయినప్పటికీ, వరుసకు బాబాయి- అబ్బాయిలు అయిన ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. ప్రిన్స్ రాంవిలాస్ పాశ్వాన్ తమ్ముడు రాంచంద్ర పాశ్వాన్ కొడుకు. రాంచంద్ర పాశ్వాన్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో హజారిని చిత్తుగా ఓడించారు. ఇప్పుడు ఆయన కొడుకుతో తలపడుతున్న హజారి విజయం కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. -
బరిలో బాబాయి vs అబ్బాయి!
కళ్యాన్పూర్: ఇటు బాబాయి- అటు అబ్బాయి. గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దూకారు. పోటాపోటీగా తలపడుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ బాబాయి-అబ్బాయి పోరు ఆసక్తికరంగా మారింది. ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్‌కు బంధువులైన ప్రిన్స్ రాజ్ (26), మాజీ ఎంపీ మహేశ్వర్ హజారి (44) కళ్యాన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి దిగారు. ప్రిన్స్ రాజ్ ఎల్జేపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుడగా, హజారి జేడీయూ నుంచి పోటీకి దిగారు. కళ్యాన్పూర్ జేడియూ ఇలాకా అయినప్పటికీ, వరుసకు బాబాయి- అబ్బాయిలు అయిన ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. ప్రిన్స్ రాంవిలాస్ పాశ్వాన్ తమ్ముడు రాంచంద్ర పాశ్వాన్ కొడుకు. రాంచంద్ర పాశ్వాన్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో హజారిని చిత్తుగా ఓడించారు. ఇప్పుడు ఆయన కొడుకుతో తలపడుతున్న హజారి విజయం కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. -
కొడుకు vs అల్లుడు @ 12 జన్‌పథ్
10 జన్‌పథ్.. రాజకీయాల మీద ఎలాంటి ఆసక్తి లేనివారికైనా ఈ చిరునామా తెలిసే ఉంటుంది. మరి, ఆ బంగళాకు కొన్ని అడుగుల దూరంలో ఉన్న 12 జన్‌పథ్ గురించి ఎంతమందికి తెలసులు? అనే సందేహానికి 'ఎనిమిదిన్నర కోట్ల మంది' అని బదులు చెప్పొచ్చు. సెక్యూలరిజం, సోషలిజం, పాపులిజాలే ప్రధాన ఎజెండాగా ప్రారంభమై గడిచిన 15 ఏళ్లుగా బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన విలక్షణ పాత్ర పోషిస్తున్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ప్రధాన కార్యాలయం చిరునామా.. 12 జన్‌పథ్. ప్రస్తుతం వారసత్వ కుంపటి రాజేసిన వేడి గాలులు.. 12 జన్‌పథ్ నుంచి బీహార్ మారుమూల పల్లెల వరకు వీస్తున్నాయి. పార్టీపై ఆధిపత్యం విషయంలో రాంవిలాస్ తనయుడు చిరాగ్ పాశ్వాన్, అల్లుడు అనిల్ కుమార్ సాధూల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. చిరకాలంగా పార్టీలో దళిత విభాగానికి నేతృత్వం వహిస్తున్న అనిల్ సాధూకు ఈసారి ఎన్నికల్లో కనీసం టికెట్ కూడా దక్కకపోవడం 'కొడుకు- అల్లుళ్ల' విభేదాలకు పరాకాష్ట. చదువు పూర్తయిందనిపించిన వెంటనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిరాగ్ పాశ్వాన్ ఒకటీ అరా సినిమాల్లో నటించాడు. కనీసం బీహార్‌లో కూడా తన సినిమాలు ఆడకపోవడంతో రాజకీయాల వైపు దృష్టి సారించాడు. ఇటు ఢిల్లీలో ఎన్డీఏ, యూపీఏ పక్షాలు రెండింటితో టచ్‌లో ఉంటూ రాంవిలాస్ బిజీ కాగా, అటు సొంత రాష్ట్రంలో పార్టీని నడిపించే బాధ్యతను తలకెత్తుకున్నాడు చిరాగ్. ఆఫీస్ బేరర్ల నియామకం నుంచి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కేటాయింపుల వరకు అన్ని నిర్ణయాలూ ఆయనవే. ఈ క్రమంలోనే ఏళ్లుగా పాశ్వాన్నే నమ్ముకుని, పార్టీనే శ్వాసించిన కొందరు సీనియర్లు కూడా పదవులు కోల్పోవాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే చిరాగ్ చేతిలో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా చిన్నచూపునకు గురైనవారికి పెద్ద దిక్కుగా ఉంటూ 'మావయ్యతో అన్ని విషయాలు మాట్లాడతా' అంటూ సర్దిచెప్పుకొచ్చే రాంవిలాస్ అల్లుడు అనిల్ కుమార్ సాధూ కూడా ఇటీవల ఘోర అవమానాల పాలయ్యాడు. అసమ్మతి నేతలకు నాయకుడిగా ఉంటున్నాడనో మరే కారణమో తెలియదు గానీ అనిల్ సాధూకు టికెట్ నిరాకరించాడు చిరాగ్. అంతే.. సాధూ భగ్గున మండిపోయాడు. 'అసలా యువనేత నా గురించి ఏమనుకుంటున్నాడు? నాకున్న ప్రజాదరణ మర్చిపోయాడా? 2010 ఎన్నికల్లో మసౌరీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచానన్న విషయం గుర్తులేదా? 15 ఏళ్లుగా పార్టీ బాగు కోసం అహోరాత్రాలు కష్టపడటం చూడలేదా?' అంటూ చిరాగ్ పాశ్వాన్‌పై నిప్పులు కురిపించాడు. పార్టీ నుంచి బయటకు వచ్చేసి..ఈ ఎన్నికల్లో ఎల్జేపీ- బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ఆ మేరకు మామ పార్టీని దెబ్బకొట్టేలా సమాజ్ వాదీ పార్టీ, ఎన్సీపీలు కొత్తగా ఏర్పాటుచేసిన కూటమిలోకి చేరే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్‌లో ఎల్జేపీకి ఆరు స్థానాలు దక్కాయి. రాంవిలాస్ హజీపూర్ నుంచి, ఆయన తనయుడు చిరాగ్ జముయి నియోజకవర్గాల నుంచి గెలిచారు. కొడుకుకు ఉత్తమ రాజకీయ భవిష్యత్ ఇవ్వాలనుకున్న రాంవిలాస్.. చిరాగ్‌ను ఎల్జేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుణ్ని చేశారు. అది పార్టీలో చిరాగ్ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసింది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఎంపీలందరిపై చిరాగ్ చిందులేసేవారని విమర్శలు వచ్చాయి. ముంగర్ స్థానం నుంచి గెలిచిన మహిళా ఎంపీ వీణాదేవీ మీడియా ముందే చిరాగ్ పై విమర్శలు చేసి, ఆయన ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. ఇక వైశాలీ ఎంపీ రామ్ సింగ్ మరో అడుగు ముందుకేసి పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. టికెట్ల కేటాయింపుల్లో తాను సూచించిన పేర్లను చిరాగ్ పాశ్వాన్ కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోలేదన్నది సింగ్ ఆరోపణ. ఎంపీ, ఎమ్మెల్యే లేకాదు.. మండల, గ్రామ స్థాయి కార్యకర్తల్లోనూ చినబాబు చిరాగ్ పాశ్వాన్ తీరుపై అసంతృప్తి ఉన్నట్లు ఆ పార్టీ నేతనే చెబుతున్నారు. వారసులను నిలబెట్టుకోవడం కోసం అప్పటికే పేరుపొందిన నేతలు పొరపాట్లు చేస్తుండటం (ఆ పార్టీ కార్యకర్తల దృష్టిలో) సహజమే అయినప్పటికీ అవి మొత్తం పార్టీ మనుగడకే ముప్పు తెచ్చేవిగా మారితే అంతకన్నా విషాదం ఉండదు. వర్తమాన రాజకీయాల్లో పెళ్లికాని వారికి.. ఎట్ లీస్ట్.. వారసులను రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకునే వారికే ప్రజాదరణ మెండుగా ఉందన్న సంగతి మోదీ, మాయ, మమత, నవీన్, రాహుల్ లాంటి వాళ్లను చూశాకైనా రాంవిలాస్ లాంటి 'పుత్రప్రేమికులకు' అర్థమవుతుందా?.. కనీసం ఎన్నికలు అయిపోయిన తర్వాతైనా! -
అమిత్ షా 'లిప్టు' ఘటనపై విచారణకు కమిటీ
పాట్నా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రధాని మోదీ సన్నిహితుడు అమిత్ షా లిప్టులో ఇరుక్కు పోవడంపై విచారణ జరిపేందుకు బీహర్ ప్రభుత్వం మంగళవారం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. మంత్రివర్గ ప్రిన్సిపల్ సెక్రటరీ శిశిర్ సిన్హా, కమిటీ అధ్యక్షతన ఈ ఘటనపై విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన వెనుక కుట్ర దాగి ఉందని, ఎవరో కావాలనే ఆయనకు అపాయం తలపెట్టారని కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఆయన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై విచారణ జరపడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైతే, కేంద్ర ప్రభుత్వంతో విచారణ జరిపించాల్సిందిగా పాశ్వాన్ మంత్రివర్గాన్ని డిమాండ్ చేశారు. కాగా, అమిత్‌షా గత గురువారం అర్ధరాత్రి లిఫ్టులో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. గ్రౌండ్ ఫ్లోర్లో బయలుదేరిన లిఫ్టు మొదటి ఫ్లోర్‌కు చేరకుండానే మధ్యలో ఆగిపోయింది. దీంతో అమిత్‌షాతో పాటు ఆ పార్టీ బిహార్ నేతలు భూపేంద్ర యాదవ్, నాగేంద్ర, సౌదన్‌సింగ్, ఇద్దరు భద్రతా సిబ్బంది దాదాపు 40 నిమిషాల పాటు అందులోనే ఉండిపోయారు. వారి ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. చివరికి సీఆర్పీఎఫ్ జవాన్లు లిఫ్టు తలుపులను పగలగొట్టి అమిత్‌షాతో పాటు మిగతా వారిని బయటకు తీశారు. -
అమిత్ షా 'లిప్టు' ఆగిపోవడం కుట్రే!
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రధాని మోదీ సన్నిహితుడు అమిత్ షా లిప్టులో ఇరుక్కు పోవడం వెనుక ఓ కుట్ర దాగి ఉందని, ఎవరో కావాలనే ఆయనకు అపాయం తలపెట్టారని కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఆయన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. ఒక రాష్ట్ర అతిథి గృహంలో ఇలాంటి ఘటన జరగడం అంత తేలికగా తీసుకోలేమని అన్నారు. దీనివెనుక పూర్తి స్థాయి నిర్లక్ష్యమో లేఖ కుట్రనో దాగి ఉందని ఈ విషయాన్ని హోమంత్రి సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. దర్యాప్తు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అమిత్‌షా గత గురువారం అర్ధరాత్రి లిఫ్టులో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. గ్రౌండ్ ఫ్లోర్లో బయలుదేరిన లిఫ్టు మొదటి ఫ్లోర్‌కు చేరకుండానే మధ్యలో ఆగిపోయింది. దీంతో అమిత్‌షాతో పాటు ఆ పార్టీ బిహార్ నేతలు భూపేంద్ర యాదవ్, నాగేంద్ర, సౌదన్‌సింగ్, ఇద్దరు భద్రతా సిబ్బంది దాదాపు 40 నిమిషాల పాటు అందులోనే ఉండిపోయారు. వారి ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. చివరికి సీఆర్పీఎఫ్ జవాన్లు లిఫ్టు తలుపులను పగలగొట్టి అమిత్‌షాతో పాటు మిగతా వారిని బయటకు తీశారు. ఓవర్లోడింగ్(బరువు ఎక్కువ) కారణంగానే లిఫ్టు నిలిచిపోయినట్లు బిహార్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
'నేను కాదు కదా.. నా వాళ్లు కూడా బరిలో లేరు'
పాట్నా: తాను బీహార్ ముఖ్యమంత్రి రేసులో లేనని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అధినేత, ఎన్డీయే భాగస్వామి, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. తమ పార్టీ నుంచి కూడా ఎవరూ ముఖ్యమంత్రి పదవిని ఆశించడం లేదని ఆయన వివరణ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఆ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు ఓ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని, అది కూడా తమ పార్టీ అధినేతకే ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు కాస్తంత అసహనంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో పాశ్వాన్ మంగళవారం మీడియా ముందుకొచ్చి తాను బీహార్ ముఖ్యమంత్రి పదవిని ఆశించడం లేదని, తన పార్టీ నుంచి కూడా ఎవరూ లేరని, ఈ విషయంలో ఇంకా ఎవరినీ ఏమీ అడగాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ ఎవరినీ ఆమోదిస్తే వారినే ఎల్జేపీ కూడా అంగీకరిస్తుందని అన్నారు. వారు ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్, జీ, హెచ్, ఐ ఇలా ఎవరినీ ప్రకటించినా వెంటనే ఆమోదం తెలుపుతామని చెప్పారు. మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశిల్ కుమార్ మోదీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పాశ్వాన్ ఈ విషయాలపై స్పష్టతనిచ్చారు. -
జనవరి నుంచి ఈ-కేబినెట్
న్యూఢిల్లీ: జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ-కేబినెట్ సమావేశాలు నిర్వహించనుంది. పాలన సమర్థవంతంగా అందడానికి, నిర్ణయాలు వేగంగా అమలు కావడానికి కంప్యూటరీకరణ దోహదపడుతుందని కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ అన్నారు. కేబినెట్ సమావేశాల్లో సభ్యులకు ఇచ్చే సమాచారం, తీసుకునే నిర్ణయాలన్నీ జనవరి నుంచి కంప్యూటరీకరిస్తామన్నారు. తన ఆఫీసునూ కాగితరహితంగా చేయాలని అధికారులకు సూచించానన్నారు. ప్రధాని మోదీ సూచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. -
ఏపీ పాత్రికేయుడికి పూలే ఫెలోషిప్
సాక్షి, న్యూఢిల్లీ: దళితులు విద్యావంతులైతేనే సమాజంలోని అసమానతలు తొలగి పోతాయని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ అన్నారు. దళిత సాహిత్య అకాడమీ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జరోదా గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారతీయ దళిత సాహిత్య అకాడమీ 30వ జాతీయ సమావేశంలో ఏపీకి చెందిన కవి, రచయిత, పాత్రికేయుడు మట్టా ప్రభాత్కుమార్కు మహాత్మా జ్యోతిరావ్‌పూలే నేషనల్ ఫెలోషిప్ అవార్డు 2014ను ప్రదానం చేశారు. ఏపీలోని విజయవాడకు చెందిన ఆదిరాల జయప్రభు, కోట బాబురావు, ఎం. నాగేశ్వరావులు అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డులు అందుకున్నారు. -
లాలూ కాలం చెల్లిన మందు: పాశ్వాన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎన్నారైగా అభివర్ణించిన బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌కు ఒకనాటి ఆయన మిత్రుడు రాంవిలాస్ పాశ్వాన్ గట్టి ఝలక్ ఇచ్చారు. లాలూ ప్రసాద్ కాలం చెల్లిన మందులాంటి వారని, దానివల్ల దుష్ప్రభావాలు తప్ప ఉపయోగం ఏమీ ఉండదన్నారు. ఒకప్పుడు ఆర్జేడీకి మిత్రపక్షంగా ఉన్న ఎల్జేపీ.. ఇప్పుడు బీజేపీకి సన్నిహితంగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ అధినేత పాశ్వాన్ మోదీ మంత్రివర్గంలో ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. తన పాత మిత్రుడిని ఆయన కాలం చెల్లిన మందుగా వర్ణించారు. ఆయన కుమారుడు, ఎంపీ చిరాగ్ మరో అడుగు ముందుకేసి, లాలూజీ ఆరోగ్యం బాగోలేదని, ఆయన ఇక విశ్రాంతి తీసుకోవాలని అన్నారు. -
పాశ్వాన్ సహాయం కోరిన గడ్కరీ
న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ సహాయం కోరారు. సైక్లిస్టుల భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సైకిళ్ల తయారీకి సంబంధించిన మార్గదర్శకాలను ఆప్డేట్ చేయాలని పాశ్వాన్ రాసిన లేఖలో గడ్కరీ కోరారు. రోడ్డు ప్రమాదాల్లో సైక్లిస్టుల మరణాలు పెరుగుతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ, భారత ప్రమాణాల విభాగం సంయుక్తంగా పనిచేసి సైక్లిస్టుల భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాల్సిన అవసరముందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో పాశ్వాన్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని నాణ్యతా ప్రమణాలకు అనుగుణంగా సైకిళ్లు తయారయ్యేలా చూడాలని కోరారు. -
చక్కెర పరిశ్రమ నెత్తిన పాలు!
సాధారణంగా పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించడంతోపాటు, బహిరంగ మార్కెట్లో ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వాలు ‘ఉద్దీపన’ ప్యాకేజీలను ప్రకటిస్తూ ఉంటాయి. కాని ప్రస్తుతం చక్కెర పరిశ్రమ విషయంలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది. చక్కెర పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్ర ఆహార మంత్రి రాం విలాస్ పాశ్వాన్ కనుగొన్న మంత్రం పంచదార మిల్లుల యజమానులకు తీయగా ఉండొచ్చునేమోగానీ, అది వినియోగదారులకు మాత్రం కచ్చితంగా చేదు గుళికే. సుగర్ మిల్లులకు ‘ఉద్దీపన’ ప్యాకేజీ ప్రకటించిన మర్నాడే షేర్మార్కెట్లో చక్కెర కంపెనీల షేర్లు పది శాతం దాకా తారాజువ్వలా దూసుకుపోయాయి. అదేస్థాయిలో కొన్ని రోజుల్లోనే బహిరంగ మార్కెట్లో పంచదార ధర దాదాపు కిలోకు రెండు రూపాయల దాకా ప్రియమవుతుందంటే నరేంద్ర మోడీ సర్కార్ ఏ వర్గం కొమ్ముకాస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా పండగ సీజన్ వచ్చిందంటే చక్కెర రేటుకు రెక్కలు వస్తాయి. కాని దానికన్న కొన్ని నెలల ముందుగానే ప్రభుత్వమే ధర పెరిగేలా నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మామూలుగా పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించడంతోపాటు, బహిరంగ మార్కెట్లో ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వాలు ‘ఉద్దీపన’ ప్యాకేజీలను ప్రకటిస్తూ ఉంటాయి. కాని ప్రస్తుతం చక్కెర పరిశ్రమ విషయంలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది. పరిశ్రమ నెత్తిన పాలుపోసి, వినియోగదారులకు కాళ్లకింద మంటపెట్టినట్టయ్యింది! నిజానికి వినియోగదారులకు అన్ని రకాలుగా ఒకేసారి కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రభుత్వం ‘ఉద్దీపన’ ప్యాకేజీ ఇచ్చిందంటే అది ‘ఆమ్ఆద్మీ’ జేబులోంచి ఇవ్వాల్సిందే కదా. తర్వాత సొంత అవసరాలకు మార్కెట్లో చక్కెరను అధిక రేటుకు కొనుగోలు చేయాల్సి వస్తుంది! చక్కెరపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 15 శాతం నుంచి 40 శాతానికి పెంచడం, సెప్టెంబర్వరకు వర్తించేలా ఎగుమతి సబ్సిడీని టన్నుకు రూ.3,300 చొప్పున కొనసాగించడం వంటి చర్యలు కచ్చితంగా మార్కెట్లోని ఇన్వెస్టర్లను సంతోషపెట్టాయి. అంతేగాదు చక్కెర మిల్లుల యజమానులకు అదనంగా రూ. 4,400 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను ఇవ్వడానికి కూడా కేంద్రం ముందుకు వచ్చింది. అంతకుముందు ఈ పద్ధతిలో రూ. 6,600 కోట్ల దాకా రుణాలు సమకూర్చింది. చెరుకు రైతులకు చెల్లించాల్సిన దాదాపు రూ.11,000 కోట్ల దాకా బకాయిలను చెల్లిస్తామని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే ప్యాకేజీ ఇస్తామని పాశ్వాన్ అంటున్నారు. కానీ సెప్టెంబర్‌లోగా రైతుల బకాయిలను తీర్చాల్సిందిగా మిల్లు యాజమాన్యాలను మంత్రి గట్టిగా ఎందుకు ఆదేశించలేకపోతున్నారో అర్థం కాదు. మన దేశంలో ఒక రైతు కుటుంబం నెలకు సగటు ఆదాయం రూ. 2,400 కన్నా తక్కువనే ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ పార్లమెంట్లో ప్రకటించింది. ఈ దేశానికి తిండిపెట్టే అన్నదాత పేదరికంలో మగ్గుతూ క్షుద్బాధతో అలమటించేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయంటే ఇంతకన్నా అవహేళన మరొకటి ఉంటుందా? మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ఆర్ఈజీఏ) రోజు కూలీలుగా పనిచేసే వారిలో దాదాపు 60 శాతం మందిదాకా భూమి సొంతంగా ఉన్న రైతులే ఉన్నారంటే ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదు. మరో విషయం ఏమంటే.... దేశంలోని రైతుల్లో దాదాపు 58 శాతం మంది ఒక పూట పస్తులతో గడుపుతున్నారు. ఇక చెరుకు రైతుల పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. ఏదో ఒకటీ అరా పెద్ద రైతులను మినహాయిస్తే అనేకమంది సన్నకారు రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఒక్క యూపీలోనే రైతుల బకాయిలు రూ. 7,900 కోట్ల మేరకు పేరుకుపోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అధిక స్థాయిలో ఉన్న చెరుకు మద్దతు ధరల సమస్య పరిష్కారం కాకపోతే చక్కెర పరిశ్రమ నిలదొక్కుకోలేదని ఆర్థికవేత్తలు అంటున్నారు. చెరుకు ధరలను తగ్గించాలన్నదే వారు సూచించే పరిష్కార మార్గం. ఈ వాదనతో నేను ఏకీభవించను. రైతుల ప్రయోజనాల కోసమే చెరుకు ధరలను తగ్గించాలని వాదించేవారు అసలు మిల్లులకు ఎందుకు నష్టాలు వస్తున్నాయో, దాని వెనక నిజమైన కారణమేమిటో తెలివిగా దాటవేస్తున్నారు. మిల్లుల ఆధునీకరణకు యాజ మాన్యాలు ఎంతమాత్రం సిద్ధంగా లేవు. పచ్చి నిజం ఏమంటే... చక్కెర పరిశ్రమ యజమానుల అసమర్థ నిర్వాకానికీ అటు రైతులూ, ఇటు వినియోగదారులూ భారీగా మూల్యం చెల్లించుకోవల్సి వస్తోంది. (వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు) దేవందర్ -
ఓ జాతీయ నేత సొంత ఊర్లో లాంతర్లే దిక్కు
ఇంట గెలిచి రచ్చ గెలువాలనే సామెత అందరికి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పే నాయకులు మీడియాలో ఎన్నో హామీలను గుప్పిస్తుంటారు. జాతీయ రాజకీయాల్లో గొప్ప నాయకుడిగా చెలామణి అవుతున్న నేత సొంత గ్రామంలోనే విద్యుత్ సౌకర్యం లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కోతలు లేని విద్యుత్ అందిస్తామని రాజకీయ నేతలు అదను దొరికితే కోతలు కోస్తునే ఉంటారు. భారతదేశంలోని దాదాపు సుమారు అన్ని గ్రామాలు విద్యుదీకరణ జరిగాయని నేతలు సభల్లో గొప్పలు చెప్పుకుంటారు. మీరు నమ్ముతారో లేదో కాని లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ స్వంత గ్రామంలో లాంతర్లతోనే ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారట. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీతో ఎన్నికల పొత్తు పెట్టుకుని రాసుకు తిరుగుతున్న పాశ్వాన్, బీహార్ లోని ఖాగారియా జిల్లాలోని శహర్బాణి సొంత గ్రామంలో ఇంకా లాంతర్లే ప్రజలకు వెలుగునిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వంత గ్రామం నలంద జిల్లాలోని కళ్యాణ్ బిఘా, లాలూ ప్రసాద్ యాదవ్ గ్రామం గోపాల్ గంజ్ లోని ఫుల్వారియాలో జరిగిన అభివృద్దికి పూర్తి వ్యతిరేకంగా పాశ్వాన్ గ్రామం చీకటిలో మగ్గుతోంది. ఇంకా దారుణమైన విషయమేమిటంటే 2007 సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు పాశ్వాన్ సొంత గ్రామంలో అడుగుపెట్టలేదట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 1981లో విడాకులిచ్చిన పాశ్వాన్ తొలి భార్య కూడా ఇదే గ్రామంలో లాంతర్లతోనే జీవితం గడుపుతోంది. నాలుగున్నర దశాబ్దాల క్రితం పాశ్వాన్ గెలిచిన అసౌలీ అసెంబ్లీలో పరిధిలో ఇప్పటికి 44 రెవెన్యూ గ్రామాలకు, 21 పంచాయితీలు విద్యుదీకరణకు నోచుకోలేదనే సమాచారం ఉంది. ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో రాజకీయనాయకులు అశ్రద్ద వహిస్తున్నారని.. కనీసం విద్యుత్ లేకుండానే బ్రతకడమనేది అత్యంత దుర్భరకరమైన విషయమన్నారు. ఖగారియా పార్లమెంట్ పరిధిలోని మరో 50 గ్రామ పంచాయితీలకు కూడా విద్యుత్ సౌకర్యం లేదని ఆ నియోజకవర్గ ప్రజలు వెల్లడిస్తున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ఎన్నికల గుర్తు లాంతర్ అని.. బీహార్ లోని ప్రజలను లాంతర్ కే పరిమితం చేయడం తప్ప వారి జీవితాల్లో వెలుగు నింపలేదని ప్రస్తుత ఖగారియా ఎంపీ దినేష్ చంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు ఆపి..కనీస వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను ఎత్తుకోవాల్సిందేనని అక్కడి ప్రజలు విజ్క్షప్తి చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే పాశ్వాన్ సొంత గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం చాలా దారుణమే కాదా!. దేశానికి స్వాతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా ఇలాంటి సంఘటనలు ఇంకా వినాల్సి వస్తోందంటే ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో ఊహించుకోవచ్చు. -
'బిన్ లాడెన్' అంటే భయపడుతున్న లాలూ, పాశ్వాన్!
పాట్నా: ఓట్లను రాబట్టుకునేందుకు ఏది అనుకూలంగా కనిపిస్తే దాన్ని వాడేసుకోవడం రాజకీయ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. గత ఎన్నికల్లో ఒసామా బిన్ లాడెన్ పోలికలతో ఉన్న వ్యక్తిని వాడుకున్న బీహార్ నేతలు లాలు ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్ లు ప్రస్తుతం ఆయన ముఖం చూస్తేనే దడుసుకుంటున్నారట. గతంలో ఓట్లు రాబట్టేందుకు తనను ఎన్నికల ప్రచారంలో వాడుకున్న నేతలు ఇప్పుడు తానంటనే ముఖం చాటేస్తున్నారని లాడెన్ పోలికతో ఉన్న మెరాజ్ ఖాలిద్ నూర్ అన్నారు. పాట్నాకు చెందిన నూర్ ను 2004లో లోక్ జనశక్తి పార్టీ నేత పాశ్వాన్, 2005 ఎన్నికల్లో ఆర్జేడి అధినేత లాలూ పోటిపడి ప్రచారానికి వాడేసుకున్నారు. బీహార్ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు కీలకంగా మారిన సమయంలో తనను వాడున్నారన్నారని, లాలూ, పాశ్వాన్ తో వేదికలపై ప్రత్యేక ఆకర్షణగా మారానని ఆయన తెలిపారు. 2005 ఎన్నికల్లో బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కూడా తనను అభినందించారని నూర్ గుర్తు చేసుకున్నారు. బీహార్ లోని 83 మిలియన్ల జనాభాలో ముస్లింలు 16 శాతం ఉన్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో తాను కలిస్తే పట్టించుకోవడం లేదని, ఓ అంటరానివాడిని చూసినట్టు చూస్తున్నారని నూర్ అన్నారు. -
పాశ్వాస్ నివాసంలో రంగుల వేడుకలు
-
బీజేపీతో ఎల్జేపీ జట్టు!
గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్రపై మాట్లాడాల్సిన అవసరం లేదు: పాశ్వాన్ త్వరలోనే పొత్తుపై ప్రకటన వచ్చే అవకాశం న్యూఢిల్లీ/పాట్నా: గుజరాత్ అల్లర్ల తర్వాత ఎన్డీఏను వీడిన రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) మరోసారి బీజేపీతో జట్టు కట్టనుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీ పొత్తుతో బరిలోకి దిగనుంది. ఈ పొత్తు విషయంపై మూడు, నాలుగు రోజుల్లోనే పాశ్వాన్ తుది నిర్ణయం తీసుకుని, ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఆర్జేడీ, ఎల్జేపీలతో లౌకికవాద కూటమిని ఏర్పాటు చేయాలనుకున్న కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలినట్టయింది. ప్రత్యామ్నాయ పొత్తులపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్‌కు కట్టబెడుతూ బుధవారం సమావేశమైన ఎల్జేపీ పార్లమెంటరీ బోర్డు తీర్మానించిందని ఆ బోర్డు అధినేత చిరాగ్ పాశ్వాన్ విలేకరులకు తెలిపారు. బీజేపీతో పొత్తు అవకాశం ఉందా అన్న ప్రశ్నకు.. తమకు అన్ని అవకాశాలు తెరిచే ఉన్నాయన్నారు. ఆర్జేడీతో తమ సంబంధం తెగిపోయిందని ఎల్జేపీ నేత రామ సింగ్ ప్రకటించారు. బీజేపీతో తమ పొత్తు చర్చలు ఫలప్రదమయ్యే దిశగా సాగుతున్నాయని కూడా వెల్లడించారు. ఎల్జేపీతో పొత్తు చర్చలు ఒక కొలిక్కివచ్చినట్లు బీజేపీ వర్గాలు చెప్పాయి. ఎల్జేపీ తొమ్మిది సీట్లు కోరగా ఏడు సీట్లు కేటాయించడానికి బీజేపీ అంగీకరించిందని తెలిసింది. మోడీతో ఇబ్బంది లేదు: ఎల్జేపీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ఆర్జేడీతో తమకు ఎంతోకాలం నుంచి ఇబ్బంది ఉందని, అయినా లాలూ జైల్లో ఉన్నపుడు తాను వెళ్లి ఆయన్ను కలసి వచ్చానని చెప్పారు. లాలూ బయటకి వచ్చిన తర్వాత తమకు మూడు సీట్లు మాత్రమే ఇస్తామంటూ ఆ పార్టీ ప్రచారం చేస్తోందని, దీనిపై కాంగ్రెస్ ప్రతిస్పందన కోసం కొన్ని నెలల నుంచి వేచి చూశామని చెప్పారు. అసలు వాళ్లు తమను పట్టించుకున్నట్లే కనిపించడంలేదన్నారు. తమ పార్టీ ఆదర్శమైన లౌకికవాదం నుంచి పక్కకు తొలిగే ప్రశ్నేలేదన్నారు. 2002లో అలాంటి ప్రశ్న ఉత్పన్నమైనపుడు ఎన్డీఏ నుంచి వైదొలిగామని గుర్తుచేశారు. అప్పటి అల్లర్లలో మోడీ పాత్ర గురించి ప్రస్తావించగా.. ఆ కేసులో కోర్టు మోడీకి క్లీన్చిట్ ఇచ్చినపుడు ఇక ఆ విషయం గురించి మాట్లాడే అవసరం ఉండదన్నారు. రంగంలోకి సీబీఐ!: ఒకపక్క ఎన్డీఏతో పాశ్వాన్ చర్చలు జరుపుతుండగా.. మరోపక్క బొకారో ఉక్కు కర్మాగారంలో జరిగిన ఉద్యోగ భర్తీలో పాశ్వాన్ హస్తంపై సాక్ష్యాలు సేకరించేందుకు సీబీ ఐ రంగంలోకి దిగింది. పాశ్వాన్ కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఉద్యోగాలు దక్కించుకున్న వారు సమర్పించిన పత్రాల్లో ఆయన సిఫారసులు బయట పడ్డాయని సీబీఐ వర్గాలు తెలిపాయి.