ఆస్పత్రి నుంచి కేంద్ర మంత్రి డిశ్చార్జి
ఆస్పత్రి నుంచి కేంద్ర మంత్రి డిశ్చార్జి
Published Sat, Jan 14 2017 3:17 PM | Last Updated on Tue, Sep 5 2017 1:16 AM
కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వ్యవహారాల మంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. శ్వాస సంబంధిత సమస్య కారణంగా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో రెండు రోజుల క్రితం ఆయనను పట్నాలపోని ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. అక్కడి ఐసీయూలో చేర్పించి ఆయనకు చికిత్స అందించారు. చికిత్స అనంతరం పూర్తిగా కోలుకోవడంతో పాశ్వాన్‌ను శనివారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
తనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పడంతో గురువారం రాత్రి 8:30 గంటలకు పాశ్వాన్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు ఆయన సోదరుడు పశుపతి కుమార్ తెలిపారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పట్నా, కగారియా, బెగుసరాయ్, మొకమ ప్రాంతాల్లో మంత్రి పర్యటించాల్సి ఉంది. రాంవిలాస్ పాశ్వాన్ ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలిసిన ఎల్‌జేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆస్పత్రికి వెళ్లారు. రెండు రోజుల పాటు ఆస్పత్రి మొత్తం సందడిగా మారింది.
Advertisement