పాట్నా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రధాని మోదీ సన్నిహితుడు అమిత్ షా లిప్టులో ఇరుక్కు పోవడంపై విచారణ జరిపేందుకు బీహర్ ప్రభుత్వం మంగళవారం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. మంత్రివర్గ ప్రిన్సిపల్ సెక్రటరీ శిశిర్ సిన్హా, కమిటీ అధ్యక్షతన ఈ ఘటనపై విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన వెనుక కుట్ర దాగి ఉందని, ఎవరో కావాలనే ఆయనకు అపాయం తలపెట్టారని కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఆయన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై విచారణ జరపడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైతే, కేంద్ర ప్రభుత్వంతో విచారణ జరిపించాల్సిందిగా పాశ్వాన్ మంత్రివర్గాన్ని డిమాండ్ చేశారు.
కాగా, అమిత్‌షా గత గురువారం అర్ధరాత్రి లిఫ్టులో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. గ్రౌండ్ ఫ్లోర్‌లో బయలుదేరిన లిఫ్టు మొదటి ఫ్లోర్‌కు చేరకుండానే మధ్యలో ఆగిపోయింది. దీంతో అమిత్‌షాతో పాటు ఆ పార్టీ బిహార్ నేతలు భూపేంద్ర యాదవ్, నాగేంద్ర, సౌదన్‌సింగ్, ఇద్దరు భద్రతా సిబ్బంది దాదాపు 40 నిమిషాల పాటు అందులోనే ఉండిపోయారు. వారి ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. చివరికి సీఆర్పీఎఫ్ జవాన్లు లిఫ్టు తలుపులను పగలగొట్టి అమిత్‌షాతో పాటు మిగతా వారిని బయటకు తీశారు.
అమిత్ షా 'లిప్టు' ఘటనపై విచారణకు కమిటీ
Published Tue, Aug 25 2015 8:36 PM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM
Advertisement