
'లౌకిక వాదానికి కేంద్రం కట్టుబడి ఉంది'
చెన్నై: భారతీయుల రక్తంలోనే లౌకికవాదం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగ పీఠిక నుంచి లౌకిక వాదం అనే పదాన్ని తొలగించే ఆలోచన లేదని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. లౌకిక వాదానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెంకయ్య తెలిపారు.