'బీజేపీ గెలుపుతోనే ఢిల్లీ అభివృద్ధి' | bjp is the delhi's future, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

'బీజేపీ గెలుపుతోనే ఢిల్లీ అభివృద్ధి'

Published Mon, Jan 26 2015 5:09 PM | Last Updated on Fri, Mar 29 2019 9:01 PM

'బీజేపీ గెలుపుతోనే ఢిల్లీ అభివృద్ధి' - Sakshi

'బీజేపీ గెలుపుతోనే ఢిల్లీ అభివృద్ధి'

న్యూఢిల్లీ: మోడీ-బేడీ జోడీ ఢిల్లీని అభివృద్ధిపథంలో నడిపిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ సోమవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ...ఢిల్లీ రాష్ట్ర  ప్రభుత్వానికి కేంద్ర సాయం ఎంతో అవసరమని తెలిపారు. రెండు చోట్లా బీజేపీ గెలిచినట్లైతే ఢిల్లీ అభివృద్ధిలో దూసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రజలకోసం అనధికార కాలనీలను క్రమబద్ధీకరిస్తున్నామని, ఆమ్ ఆద్మీ పార్టీ మాయలో పడవద్దని ప్రజలకు హితవు పలికారు. బీజేపీ గెలుపుతోనే ఢిల్లీలో అభివృద్ధి సాధ్యమౌతుందని, కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement