'అప్పుడు అలా... ఇప్పుడు ఇలానా వెంకయ్య' | Raghuveera reddy takes on venkaiah naidu | Sakshi
Sakshi News home page

'అప్పుడు అలా... ఇప్పుడు ఇలానా వెంకయ్య'

Published Sun, Jan 25 2015 1:48 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'అప్పుడు అలా... ఇప్పుడు ఇలానా వెంకయ్య' - Sakshi

'అప్పుడు అలా... ఇప్పుడు ఇలానా వెంకయ్య'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు తమ పార్టీ అధికారంలోకి రాగానే మాట మార్చారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లో రఘువీరారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...  బీజేపీ ద్వంద్వ వైఖరీకి వెంకయ్యనాయుడి ధోరణే నిదర్శనమన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం అనుమతులు కష్టమని చెబుతున్న వెంకయ్యనాయుడు ... కృష్ణానది ఒడ్డున ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన ఎలా చేశారని ప్రశ్నించారు. ఉండవల్లి సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి శనివారం వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement