తిరుమల : కేంద్ర మంత్రులు అరుణ్‌జెట్లీ, వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పన విషయంలో ద్రోహం చేశారని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆరోపించారు. విభజన తరువాత ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని తమ కాంగ్రెస్ ప్రభుత్వం కార్యచరణ రూపొందించుకున్న నేపథ్యంలో 10 ఏళ్లు పాటు ఇవ్వాలని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా చేస్తామని నాడు బీజేపీ హామీ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బిడ్డని బతికించి తల్లిని చంపేసిందనే నాడు బీజేపీ వ్యాఖ్యలు చేసిందని, నేడు ఆ ప్రభుత్వమే తల్లితోపాటు బిడ్డను కూడా చంపివేసిందన్నారు.
పదేపదే ఆంధ్రా ప్రత్యేక హోదాకు చట్టబద్ధత లేదంటున్నార ని, అలాంటి పరిస్థితుల్లో పోలవరానికి ఏ పద్ధతిలో చట్టబద్ధత తీసుకువచ్చారని ప్రశ్నించారు. 2002 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి నేతృత్వంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కేవలం కేబినెట్ ఆమోదంతోనే ప్రత్యేక హోదాను తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 11 రాష్ట్రాలకు ఇదే తరహాలో ప్రత్యేకహోదా లభించిందన్నారు.
ప్రత్యేక ప్యాకేజీలపై ఉన్న దృష్టి ప్రత్యేకహోదాపై ఉంటే ఆంధ్రరాష్ట్రం ఇప్పటికే మరింతగా అభివృద్ధి చెంది ఉండేదన్నారు. 11 నెలల పాటు బీజీపీ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం మద్దతు పలుకుతూ ప్రత్యేకహోదా వస్తుందని ప్రజలను మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు విదేశి పర్యటనపై ఉన్న శ్రద్ధ రాష్ర్ట అభివృద్ధిపై లేదన్నారు. కేంద్రప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకువచ్చేవరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేశారు!
Published Sun, Aug 9 2015 3:04 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement