delhi development
-
నెక్ట్స్ టార్గెట్ సిసోడియానే: కేజ్రివాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతోందని సీఎం అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు. అందుకే తమ మంత్రులను టార్గెట్ చేసిందని గురువారం ఆరోపించారు. ‘‘ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టుతో యమున క్లీనింగ్, మొహల్లా క్లినిక్ల ప్రారంభం ఆగిపోయాయి. ఇప్పుడు విద్యారంగ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను లక్ష్యంగా చేసుకున్నారు. తప్పుడు కేసు బనాయించి ఆయన్ను త్వరలోనే అరెస్ట్ చేసే చాన్సుంది. ఈ మేరకు కొన్ని నెలల ముందే నాకు విశ్వసనీయ వర్గాల సమాచారం అందింది’’ అని వివరించారు. ‘‘కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇలా ఒకరి తర్వాత మరొకరిపై కేసులు పెట్టుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇలాగైతే ప్రభుత్వం ఎలా పని చేస్తుంది?’’ అని ప్రశ్నించారు. ‘‘నేను చేతులు జోడించి ప్రధానిని ఒక్కటే వేడుతున్నా. ఇలా ఒకరి తర్వాత మరొకరిని జైలు పాలు చేసే బదులుగా ఆప్ మంత్రులందరినీ ఒకేసారి అరెస్టు చేయండి’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. -
కావాలంటే నన్ను కొట్టండి: కేజ్రీవాల్
ఎప్పుడూ అవకాశం వస్తే కేంద్రం మీద విరుచుకుపడే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అదే రాగంలో సరికొత్త పల్లవి అందుకున్నారు. ప్రధానమంత్రి మోదీకి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నానని, కావాలంటే తనతో దెబ్బలాడాలని.. ఇంకా కావాలంటే తనను కొట్టాలని, అంతేతప్ప ఢిల్లీ ప్రజలను వేధించొద్దని అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న మంచి పనులు ఆపేందుకు ప్రయత్నించొద్దని ఆయన కోరారు. ఢిల్లీ ప్రభుత్వం నియమించిన 21 మంది పార్లమెంటరీ సెక్రటరీలు తమ కళ్లు, చెవులు, చేతులని ఆయన చెప్పారు. వాళ్ల సాయంతోనే ప్రభుత్వం నడుస్తోందని, అభివృద్ధి పనులు జరగడానికి వీళ్లు చాలా కృషి చేస్తారని కేజ్రీవాల్ అన్నారు. అయితే.. తమ ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించడాన్ని బీజేపీ, కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాయని, వాళ్లు ఢిల్లీని పాలించినప్పుడు అలాగే చేశారని చెప్పారు. సాహిబ్ సింగ్ వర్మ దగ్గర నుంచి షీలా దీక్షిత్ వరకు అందరూ ఇలాగే చేశారని ఉదాహరణలు కూడా వివరించారు. వాళ్లు చేస్తున్న అదనపు పనులకు వాళ్లకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వడం లేదని, అందువల్ల వారి పదవులు ఊడగొట్టించేందుకు ప్రయత్నాలు చేయొద్దని కోరారు. అయితే.. తాను చెప్పదలచుకున్నది చెప్పేసిన తర్వాత.. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేసేలోపే ముఖ్యమంత్రి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. -
'బీజేపీ గెలుపుతోనే ఢిల్లీ అభివృద్ధి'
న్యూఢిల్లీ: మోడీ-బేడీ జోడీ ఢిల్లీని అభివృద్ధిపథంలో నడిపిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ సోమవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ...ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సాయం ఎంతో అవసరమని తెలిపారు. రెండు చోట్లా బీజేపీ గెలిచినట్లైతే ఢిల్లీ అభివృద్ధిలో దూసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకోసం అనధికార కాలనీలను క్రమబద్ధీకరిస్తున్నామని, ఆమ్ ఆద్మీ పార్టీ మాయలో పడవద్దని ప్రజలకు హితవు పలికారు. బీజేపీ గెలుపుతోనే ఢిల్లీలో అభివృద్ధి సాధ్యమౌతుందని, కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని వ్యాఖ్యానించారు.